'ఏ దశలోనూ వెనుకంజవేయని గంగూలీ వారసుడు కోహ్లీ'

హైదరాబాద్: పెర్త్ పరాజయం అనంతరం కోహ్లీ కెప్టెన్సీపై చర్చలు మొదలైయ్యాయి. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా ఆటగాళ్లు, మాజీలు టీమ్‌ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లిని విమర్శిస్తుంటే.. ఆ దేశ మాజీ కోచ్ జాన్ బుకానన్ మాత్రం అతడిని ప్రశంసల్లో ముంచెత్తాడు. కోహ్లి.. భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ వారసుడంటూ అభివర్ణించాడు. దాదా లాగే విరాట్ కూడా దూకుడైన కెప్టెన్ అని అతనన్నాడు. ప్రఖ్యాత మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కోహ్లీ భారత క్రికెట్‌కు వన్నె తెచ్చాడని పేర్కొన్నాడు.

ఏ దశలోనూ వెనుకంజ వేయకూడదనే
‘సౌరవ్ గంగూలీ తరహాలో ఏ దశలోనూ వెనుకంజ వేయకూడదనే సంప్రదాయాన్ని విరాట్ కొనసాగిస్తున్నాడు. తన సహచరుల్ని ప్రోత్సహిస్తున్నాడు. కొన్నిసార్లు కోహ్లి కొంచెం శ్రుతి మించుతున్నట్లు అనిపిస్తుంది. కానీ అతడికి ఆట పట్ల గౌరవం ఉందని నేను నమ్ముతాను. ఆట చరిత్రను అతను గౌరవిస్తాడు. భారత క్రికెట్‌కు అవసరమైన నాయకుడతను. ఆటను ఎలా ఆడాలో సాంకేతికంగానే కాక నాయకుడి కోణం నుంచి అతను చూపిస్తున్నాడు. గంగూలీ ఘన వారసత్వాన్ని అతను కొనసాగిస్తున్నాడు' అని బుకానన్ పేర్కొన్నాడు.

సెంచరీ చాలు అతని గొప్ప చెప్పడానికి
పెర్త్ టెస్టులో విరాట్ సెంచరీ అతనెంత గొప్ప ఆటగాడో చెప్పడానికి నిదర్శనమని అతనన్నాడు. ఈ సెంచరీని అభివర్ణిస్తూ.. సొంతగడ్డను వదిలి విదేశాల్లో ఆడుతున్నప్పుడు మైదానానికి అలవాటు పడడం ఒక ఎత్తు అయితే అక్కడి ఆహారానికి, ప్రయాణానికి తట్టుకుని ఆడటం మరొక ఎత్తు. అందుకే ఇవే చెప్తున్నాయి అతనిలోని సత్తానంటూ చెప్పుకొచ్చాడు.

కెప్టెన్సీ మాత్రమే లోపం కాదని
పరాభవాలకు కెప్టెన్సీ మాత్రమే లోపం కాదని, జట్టు వైఫల్యమే దానికి కారణమని విశ్లేషించాడు. కోచ్‌గా బాధ్యతలు నిర్వర్తించిన ఎనిమిదేళ్ల కాలంలో జట్టు బాగానే నడిపించింది. అయితే రెండేళ్లుగా జట్టులో మార్పులు చోటు చేసుకున్నాయని అవే ఈ పరిస్థితికి తీసుకొచ్చాయంటూ తమ క్రికెటర్ల శైలి గురించి విచారించాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications