IND vs AUS: వరల్డ్ రికార్డుపై కన్నేసిన కోహ్లి... 147 ఏళ్ల క్రికెట్ చరిత్రలో!
అయిదు టెస్టుల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని ఘనంగా ఆరంభించిన భారత్ రెండో టెస్టులో నిరాశపర్చింది. అడిలైడ్ వేదికగా జరిగిన డే/నైట్ టెస్టులో అన్ని విభాగాల్లో విఫలమై పది వికెట్ల తేడాతో ఘోర పరాజయాన్ని చవిచూసింది. సిరీస్‌లో ఆధిక్యాన్ని 1-1తో సమం చేసుకుంది. పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్టులో టీమిండియా సంపూర్ణ ఆధిపత్యం చెలాయించి 295 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే.
అయితే సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో భారత్ మరో సమరానికి సిద్ధమైంది. బ్రిస్బేన్‌లోని గబ్బా వేదికగా శనివారం నుంచి మూడో టెస్టు ప్రారంభం కానుంది. భారత కాలమాన ప్రకారం ఉదయం 5.50 గంటలకు మ్యాచ్ మొదలుకానుంది. కాగా, గబ్బా టెస్టులో టీమిండియా స్టార్ బ్యాటర్ అరుదైన ప్రపంచ రికార్డులపై కన్నేశాడు. మూడో టెస్టులో కోహ్లి సెంచరీ చేస్తే.. ఆస్ట్రేలియాలోని ప్రధాన అయిదు వేదికల్లో శతకాలు బాదిన మూడో పర్యాటక జట్టు ఆటగాడిగా చరిత్రకెక్కుతాడు.

147 ఏళ్ల క్రికెట్ చరిత్రలో ఈ రికార్డును ఇప్పటివరకు ఇద్దరు మాత్రమే సాధించారు. భారత దిగ్గజ ప్లేయర్ సునీల్ గవాస్కర్, ఇంగ్లండ్ మాజీ ఆటగాడు అలెస్టర్ కుక్ ఈ ఘనత అందుకున్నారు. 1977లో గవాస్కర్ బ్రిస్బేన్, పెర్త్, మెల్‌బోర్న్‌లతో సెంచరీ సాధించాడు. 1985లో అడిలైడ్, సిడ్నీలో శతకం బాది కంగారూల గడ్డపై అయిదు ప్రధాన నగరాల్లో మూడంకెల స్కోరు అందుకున్న తొలి విజిటింగ్ బ్యాటర్‌గా రికార్డులకెక్కాడు. కుక్ 2006లో పెర్త్, 2010-11లో బ్రిస్బేన్, అడిలైడ్, సిడ్నీలో; 2017లో మెల్‌బోర్న్‌లో శతకాలు సాధించాడు.
కాగా, విరాట్ కోహ్లి అడిలైడ్‌లో ఏకంగా మూడు సెంచరీలు బాదాడు. 2012, 2014, 2024లో శతకాలు సాధించాడు. 2018, 2024లో పెర్త్ వేదికలో; 2014లో మెల్‌బోర్న్‌లో; 2015లో సిడ్నీ వేదికగా మూడంకెల స్కోరు అందుకున్నాడు. బ్రిస్బేన్ వేదికగా ఒక్క మ్యాచ్ మాత్రమే ఆడిన కోహ్లి 19, 1 పరుగులే చేశాడు. కాగా, బ్రిస్బేన్ వేదికగా జరగనున్న మూడో టెస్టులో కోహ్లి సాధిస్తే అరుదైన జాబితాలో చోటు సంపాదిస్తాడు.
కాగా, ఈ ఆస్ట్రేలియా పర్యటనలో కోహ్లి మరో సెంచరీ చేస్తే పలు రికార్డులు బద్దలవుతాయి. ఓ జట్టుపై అత్యధిక సెంచరీలు చేసిన పర్యాటక బ్యాటర్‌గా కోహ్లి రికార్డు సాధిస్తాడు. ప్రస్తుతం ఈ రికార్డు బ్రాడ్‌మన్ పేరిట ఉంది. ఇంగ్లండ్‌పై ఆయన 11 సెంచరీలు చేశాడు. రెండో స్థానంలో ఉన్న కోహ్లి ఆస్ట్రేలియాపై 10 శతకాలు బాదాడు. తర్వాతి స్థానాల్లో జేబీ హాబ్స్ (9 సెంచరీలు- ఆస్ట్రేలియాపై), సచిన్ (9 సెంచరీలు- శ్రీలంక) ఉన్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications