Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs AUS: చరిత్ర సృష్టించిన ట్రావిస్ హెడ్.. వరల్డ్ క్రేజీ రికార్డ్‌!

భారత జట్టుకు ఆస్ట్రేలియా బ్యాటర్ ట్రావిస్ హెడ్‌ కొరకరాని కొయ్యగా మారాడు. గబ్బా వేదికగా జరగుతున్న మూడు టెస్టులోనూ సెంచరీతో కదం తొక్కాడు. టెస్టుల్లో ఓవరాల్‌గా తొమ్మిది శతకాన్ని అందుకున్న హెడ్.. టీమిండియాపైనే మూడు సెంచరీలు సాధించడం గమనార్హం. హెడ్ (103 బ్యాటింగ్; 118 బంతుల్లో, 13 ఫోర్లు)తో పాటు స్టీవ్ స్మిత్ (65 బ్యాటింగ్; 149 బంతుల్లో, 6 ఫోర్లు) కూడా సత్తాచాటడంతో రెండో రోజు ఆటలో టీ విరామానికి ఆస్ట్రేలియా 70 ఓవర్లకు 234/3 స్కోరు చేసింది.

అయితే గబ్బాలో సెంచరీ బాదిన ట్రావిస్ హెడ్ అరుదైన ఘనత సాధించాడు. ఓ క్యాలెండర్ ఇయర్‌లో ఓ వేదికపై కింగ్ పెయిర్ - శతకం సాధించిన ప్లేయర్‌గా ట్రావిస్ హెడ్ రికార్డు నెలకొల్పాడు. ఓ టెస్టులో ఓ ఆటగాడు రెండు ఇన్నింగ్స్‌లో తొలి బంతికే డకౌటవ్వడాన్ని కింగ్ పెయిర్ అంటారు. గబ్బా వేదికగా అంతకుముందు వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో ట్రావిస్ హెడ్ రెండు ఇన్నింగ్స్‌ల్లో డకౌటయ్యాడు. వెస్టిండీస్ కంటే ముందు జరిగిన మ్యాచ్‌లోనూ హెడ్ గోల్డెన్ డకౌటవ్వడం గమనార్హం.

IND vs AUS Travis Head Joins Elite Club with Unique King Pair and Century Feat at the Gabba

గబ్బాలోని గత మూడు ఇన్నింగ్స్‌ల్లో గోల్డెన్ డకౌటైన ట్రావిస్ హెడ్ టీమిండియాతో జరుగుతున్న మ్యాచ్‌లో శతకంతో చెలరేగాడు. కాగా, ఓ క్యాలెండ్ ఇయర్‌లో ఓ వేదికపై పెయిర్ & సెంచరీ సాధించిన ఆరో బ్యాటర్‌గా హెడ్ నిలిచాడు. హెడ్ కంటే ముందు 1958లో వాజిర్ మహ్మద్ (పోర్ట్ ఆఫ్ స్పెయిన్), 1974లో అల్విన్ కల్లిచరణ్ (పోర్ట్ ఆఫ్ స్పెయిన్), 2001లో మార్వన్ ఆటపట్టు (కొలంబో), 2004లో రామ్‌నరేశ్ శర్వాన్ (కింగ్‌స్టన్), 2004లో మహ్మద్ అష్రాఫుల్ (ఛటోగ్రామ్) ఈ ఘనత సాధించారు.

టెస్టుల్లో గత ఏడు ఇన్నింగ్స్‌ల్లో టీమిండియాపై హెడ్ సాధించిన పరుగులు
90(163)
163(174)
18(27)
11(13)
89(101)
140(141)
103*(118)

Story first published: Sunday, December 15, 2024, 11:10 [IST]
Other articles published on Dec 15, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+