Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs AUS: ఆస్ట్రేలియాకు ఎదురుదెబ్బ.. మరో స్టార్ ప్లేయర్ దూరం!

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఆరంభ మ్యాచ్‌లో ఘోర పరాజయం చవిచూసిన ఆస్ట్రేలియా‌కు వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే గాయం కారణంగా స్టార్ పేసర్ హేజిల్‌వుడ్ దూరమైన ఆసీస్ జట్టుకు మరో షాక్ తగిలింది. ప్రధాన బ్యాటర్ స్టీవ్ స్మిత్ కూడా గాయపడ్డాడు. ప్రాక్టీస్‌లో స్మిత్ చేతి వేలుకు తీవ్రగాయమైంది. రెండో టెస్టు కోసం గులాబీ బంతితో సాధన చేస్తున్న స్మిత్ మంగళవారం గాయపడ్డాడు.

మార్నస్ లబుషేన్‌తో కలిసి ప్రాక్టీస్ చేస్తున్న స్మిత్‌ కుడిచేతికి గాయమైంది. దీంతో వెంటనే స్మిత్ నెట్ సెషన్‌ సాధన విరమించుకున్నాడు. ఫిజియో దగ్గరకు వెళ్లి చికిత్స చేయించుకున్నాడు. స్మిత్ గాయం తీవ్రతపై స్ఫష్టత లేనప్పటికీ.. మరో ప్లేయర్ గాయపడటం ఆస్ట్రేలియాకు తలనొప్పిగా మారింది. పక్కటెముకల గాయంతో హేజిల్‌వుడ్ రెండో టెస్టుకు దూరమైన విషయం తెలిసిందే. సిరీస్ మొత్తానికి కూడా హేజిల్‌వుడ్ అందుబాటుతో ఉండటం అనుమానమే.

IND vs AUS Steve Smith Injured During Adelaide Net Session After Being Struck on Right Hand

ఈ పరిస్థితుల్లో స్మిత్ కూడా దూరమైతే ఆస్ట్రేలియాకు తీవ్ర ప్రతికూలతంగా మారుతుంది. కాగా, స్మిత్ గత 23 ఇన్నింగ్స్‌ల నుంచి సెంచరీ సాధించలేకపోతున్నాడు. అడిలైడ్ టెస్టులో తిరిగి సత్తాచాటాలని పట్టుదలతో సాధన చేస్తూ గాయపడ్డాడు. డిసెంబర్ 6 నుంచి పింక్ బాల్‌తో రెండో టెస్టు జరగనుంది. ఈ డే/నైట్ టెస్టు భారత కాలమాన ప్రకారం ఉదయం 9.30 గంటలకు మొదలవుతుంది.

రెండో టెస్టుకు ఎంపికైన ఆస్ట్రేలియా: పాట్ కమిన్స్ (కెప్టెన్), స్కాట్ బొలాండ్, అలెక్స్ కేరీ, ట్రావిస్ హెడ్, జోష్‌ ఇంగ్లిస్, ఉస్మాన్ ఖావాజా, మార్నస్ లబుషేన్, నాథన్ లైయన్, మిచెల్ మార్ష్, నాథన్ మెక్‌స్వీనే, స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్, బ్యూ వెబ్‌స్టర్, సీన్ అబాట్, బ్రెండన్ డెగాట్.

ఆస్ట్రేలియాతో అయిదు టెస్టుల సిరీస్ షెడ్యూల్
నవంబర్ 22-26: తొలి టెస్టు- భారత్ విజయం
డిసెంబర్ 06-10: రెండో టెస్టు (డే/నైట్)- అడిలైడ్ (ఉదయం 9.30)
డిసెంబర్ 14-18: మూడో టెస్టు- బ్రిస్బేన్ (ఉదయం 5.50)
డిసెంబర్ 26-31: నాలుగో టెస్టు- మెల్‌బోర్న్ (ఉదయం 5 గంటలకు)
జనవరి 03-08: అయిదో టెస్టు- సిడ్నీ (ఉదయం 5 గంటలకు).

Story first published: Tuesday, December 3, 2024, 14:46 [IST]
Other articles published on Dec 3, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+