Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs AUS: టీమిండియాకు గుడ్‌న్యూస్.. రాహుల్‌కు బ్యాడ్ న్యూస్!

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో తొలి మ్యాచ్‌లో ఘన విజయం సాధించిన టీమిండియా మరో ఆసక్తికర పోరుకు సిద్ధమైంది. డిసెంబర్ 6 నుంచి అడిలైడ్ వేదికగా ఆస్ట్రేలియాతో రెండో టెస్టు తలపడనుంది. పింక్ బాల్‌తో జరగనున్న ఈ డే/నైట్ టెస్టు భారత కాలమాన ప్రకారం ఉదయం 9.30 గంటలకు మొదలవుతుంది. అయితే ఈ టెస్టులో టీమిండియాలో భారీ మార్పులు చోటు చేసుకోనున్నాయి.

వ్యక్తిగత కారణాలతో, గాయం కారణంగా దూరమైన రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ తిరిగి భారత జట్టుకు అందుబాటులోకి వచ్చారు. ఇప్పటికే వీరిద్దరు రేపటి నుంచి మొదలుకానున్న రెండో రోజుల వార్మప్ మ్యాచ్ కోసం పింక్ బాల్‌తో ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టారు. ఈ ఇద్దరి చేరికతో టీమిండియా బ్యాటింగ్‌ మరింత బలోపేతం మారనుంది. అయితే రోహిత్-గిల్ రావడంతో కేఎల్ రాహుల్ టాప్ ఆర్డర్‌లో చోటు కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. తొలి టెస్టులో భారత్ 295 పరుగుల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే.

IND vs AUS Shubman Gill Prepares for Pink-Ball Tour Game KL Rahul Set to Lose Top-Order Spot

ఈ పోరులో రోహిత్ శర్మ గైర్హాజరీలో యశస్వీ జైస్వాల్‌తో కలిసి కేఎల్ రాహుల్ భారత్ ఇన్నింగ్స్ ఆరంభించాడు. తొలి ఇన్నింగ్స్‌లో 74 బంతుల్లో 3 ఫోర్లతో 26 పరుగులు, రెండో ఇన్నింగ్స్‌లో 176 బంతుల్లో 5 బౌండరీలతో 77 పరుగులతో రాహుల్ ఆకట్టుకున్నాడు. పుజారాలా వాల్ ఇన్నింగ్స్ ఆడాడు. కానీ రెండో టెస్టుకు జైస్వాల్‌తో కలిసి రోహిత్ ఓపెనర్‌గా, వన్‌డౌన్‌లో గిల్ రానుండటంతో రాహుల్ టాప్ ఆర్డర్ ఆశలకు మరోసారి బ్రేక్‌లు పడనున్నాయి. రాహుల్ తిరిగి మిడిలార్డర్‌లోకి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది.

భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వీ జైస్వాల్, శుభ్‌‌మన్ గిల్, అభిమన్యు ఈశ్వరన్, విరాట్ కోహ్లి, దేవదత్ పడిక్కల్, సర్ఫరాజ్ ఖాన్, వాషింగ్టన్ సుందర్, నితీశ్ కుమార్ రెడ్డి, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, రిషభ్ పంత్, కేఎల్ రాహుల్, ధ్రువ్ జురెల్, జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ప్రసిధ్ కృష్ణ, హర్షిత్ రాణా, ఆకాశ్ దీప్.

ఆస్ట్రేలియా: పాట్ కమిన్స్ (కెప్టెన్), స్కాట్ బొలాండ్, అలెక్స్ కేరీ, జోష్‌ హేజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, జోష్‌ ఇంగ్లిస్, ఉస్మాన్ ఖావాజా, మార్నస్ లబుషేన్, నాథన్ లైయన్, మిచెల్ మార్ష్, నాథన్ మెక్‌స్వీనే, స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్, బ్యూ వెబ్‌స్టర్.

Story first published: Friday, November 29, 2024, 10:24 [IST]
Other articles published on Nov 29, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+