Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs AUS: ఒరెయ్ సర్ఫరాజ్.. ఇదేం ఫీల్డింగ్‌రా- కోహ్లి (Video)

వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్స్‌కు చేరాలనే లక్ష్యంతో టీమిండియా మరో టెస్టు సమరానికి సిద్ధమైంది. నవంబర్ 22 నుంచి కంగారూల గడ్డపై ఆస్ట్రేలియాతో అయిదు టెస్టుల సిరీస్ ఆడనుంది. శుక్రవారం పెర్త్ వేదికగా తొలి మ్యాచ్ ప్రారంభం కానుంది. భారత కాలమాన ప్రకారం ఉదయం 7.50 గంటలకు ఆట ఆరంభమవుతుంది.

ఈ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని భారత్ 4-0తో గెలిస్తేనే ముచ్చటగా మూడోసారి డబ్ల్యూటీసీ టైటిల్ పోరుకు అర్హత సాధిస్తుంది. మరోవైపు ఆస్ట్రేలియాకు అదే పరిస్థితి. శ్రీలంక సిరీస్‌తో కలిపి ఆడాల్సిన ఏడు మ్యాచ్‌ల్లో అయిదు విజయాలు సాధించాల్సి ఉంది. ఈ హోరాహోరీ సిరీస్ కోసం భారత ఆటగాళ్లు బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నారు. అయితే సాధనలో సర్ఫరాజ్ ఖాన్ పేలవ ఫీల్డింగ్‌కు సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

IND vs AUS Sarfaraz Khan s Hilarious Catch Has Virat Kohli Rishabh Pant and Dhruv Jurel in Splits WATCH

సులువైన క్యాచ్‌ను సర్ఫరాజ్ జారవిడవడం చూసి విరాట్ కోహ్లి, ధ్రువ్ జురెల్, రిషభ్ పంత్ పొట్టచెక్కలయ్యేలా నవ్వారు. పంత్ కిందపడిమరి విరగబడి నవ్వడం గమనార్హం. అసలేం జరిగిందంటే.. ఈ నలుగురు ప్లేయర్లు స్లిప్‌లో క్యాచ్‌లు ప్రాక్టీస్ చేశారు. అయితే సర్ఫరాజ్ ముఖం మీదకు ఎత్తులో ఓ క్యాచ్ వచ్చింది. అది సులభమైన క్యాచే. కానీ సర్ఫరాజ్ భిన్నంగా ప్రయత్నించి జారవిడిచాడు. దీంతో ఈ మిడిలార్డర్ బ్యాటర్‌ను సరదాగా సహచర ఆటగాళ్లు ఆటపట్టించారు.

కాగా, తొలి టెస్టుకు సర్ఫరాజ్ తుదిజట్టులో ఆడటం అనుమానమే అనిపిస్తోంది. సర్ఫరాజ్‌కు బదులుగా ధ్రువ్ జురెల్‌కు అవకాశం ఇవ్వాలని టీమిండియా మేనేజ్మెంట్ భావిస్తోంది. న్యూజిలాండ్‌తో జరిగిన చివరి రెండు టెస్టుల్లో సర్ఫరాజ్ నిరాశపరిచాడు. మరోవైపు ఆస్ట్రేలియా-ఏతో జరిగిన టెస్టులో ధ్రువ్ జురెల్ సత్తాచాటాడు. రెండు కీలక అర్ధశతకాలతో ఆసీస్ బౌలర్లను ఎదుర్కొన్నాడు. దీంతో ధ్రువ్‌ను కొనసాగించాలని జట్టు యాజమాన్యం యోచిస్తోంది.

ఆస్ట్రేలియాతో అయిదు టెస్టుల సిరీస్ షెడ్యూల్
నవంబర్ 22-26: తొలి టెస్టు- పెర్త్ (ఉదయం 7.50)
డిసెంబర్ 06-10: రెండో టెస్టు (డే/నైట్)- అడిలైడ్ (ఉదయం 9.30)
డిసెంబర్ 14-18: మూడో టెస్టు- బ్రిస్బేన్ (ఉదయం 5.50)
డిసెంబర్ 26-31: నాలుగో టెస్టు- మెల్‌బోర్న్ (ఉదయం 5 గంటలకు)
జనవరి 03-08: అయిదో టెస్టు- సిడ్నీ (ఉదయం 5 గంటలకు)

Story first published: Wednesday, November 20, 2024, 10:06 [IST]
Other articles published on Nov 20, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+