6 వికెట్లు తీసిన షమీ
ఆసీస్ బ్యాట్స్‌మెన్లలో షాన్ మార్ష్, ఆరోన్ ఫించ్, ట్రావిస్ హెడ్, ఆసీస్ కెప్టెన్ టిమ్ పైన్, ఉస్మాన్ ఖవాజ, నాథన్ లియాన్ వికెట్లను షమీ తీశాడు. ఈ క్రమంలో టీమిండియా మాజీ క్రికెట్ దిగ్గజం అనిల్ కుంబ్లే రికార్డుని సైతం షమీ బద్దలు కొట్టాడు. విదేశాల్లో ఓ కేలండర్ ఇయర్‌లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్‌గా రికార్డ్ చేశాడు. 2006లో అనిల్ కుంబ్లే విదేశీ గడ్డ మీద 41 వికెట్లు తీయగా.. ఆ రికార్డును షమీ అధిగమించాడు.
విదేశీ గడ్డ మీద 43 వికెట్లు
షమీ ఈ ఏడాది టెస్టుల్లో విదేశీ గడ్డ మీద 43 వికెట్లు పడగొట్టాడు. వీరిద్దరూ మినహా మరే ఇతర భారత బౌలర్ కూడా ఒక కేలండర్ ఇయర్లో విదేశాల్లో 40 వికెట్లు తీయలేదు. తన కెరీర్‌లోనే అత్యుత్తమ గణాంకాలను నమోదు చేసిన షమీపై సోషల్ మీడియాలో సచిన్ టెండూల్కర్ ప్రశంసల వర్షం కురిపించాడు. సచిన్ తన ట్విట్టర్‌లో "మన బౌలింగ్‌లో అద్భుతమైన పేస్ ఎటాక్‌ను చూస్తుండటం చాలా సంతోషంగా ఉంది. షమీ ఈరోజు ఇరగదీశాడు. 6 వికెట్లు తీసిన నీ బౌలింగ్‌ను చూడటం అద్భుతంగా ఉంది" అని ట్వీట్ చేశాడు.

నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 112/5
287 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 5 వికెట్లు కోల్పోయి 112 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో హనుమ విహారి(24), రిషబ్ పంత్(9) పరుగులతో ఉన్నారు. ఇంకో రోజు ఆట మిగిలిన ఈ టెస్టులో భారత్ విజయం సాధించాలంటే 175 పరుగులు చేయాల్సి ఉంది. చేతిలో ఐదు వికెట్లు మాత్రమే ఉన్నాయి.

రెండో టెస్టులో ఓటమి దిశగా భారత్!
ఆస్ట్రేలియా బౌలర్లలో నాథన్ లియాన్, హెజెల్‌ఉడ్ చెరో వికెట్లు తీయగా... మిచెల్ స్టార్క్‌కు ఒక వికెట్ లభించింది. ఆస్ట్రేలియా గడ్డపై టీమిండియా ఇప్పటివరకు ఇంతటి పెద్ద లక్ష్యాన్ని చేధించిన దాఖలా లేదు. దీంతో పెర్త్ టెస్టు ఫలితం ఎలా ఉండబోతుందోనని ఆసక్తికరంగా మారింది. మరోవైపు పచ్చికతో కూడిన పిచ్ క్రమంగా బ్యాటింగ్‌కి కష్టంగా మారడం విశేషం.


Click it and Unblock the Notifications












