Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs AUS: భారత్ కొంపముంచిన రోహిత్.. హెడ్ క్యాచ్‌ను వదిలేసి! (Video)

గబ్బా వేదికగా జరుగుతున్న మూడో టెస్టులో టీమిండియాపై ఆస్ట్రేలియా ఆధిపత్యం చెలాయిస్తోంది. భారీ స్కోరు దిశగా సాగుతోంది. ట్రావిస్ హెడ్ వరుసగా మరో సెంచరీ సాధించాడు. అడిలైడ్ వేదికగా జరిగిన రెండో టెస్టులోనూ హెడ్ శతకం బాదిన సంగతి తెలిసిందే. టెస్టుల్లో హెడ్‌కు తొమ్మిదో సెంచరీ కాగా టీమిండియాపై మూడోది.

వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్- 2023 ఫైనల్ నుంచి టీమిండియాపై హెడ్ ఆడిన గత 11 ఇన్నింగ్స్‌‌ల్లో 84.90 సగటుతో 849 పరుగులు చేశాడు. ఇందులో నాలుగు సెంచరీలు, రెండు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇక గత అయిదు ఇన్నింగ్స్‌ల్లో భారత్‌పై 104.8 సగటుతో హెడ్ పరుగులు చేయడం గమనార్హం. ఈ క్రమంలో గబ్బా టెస్టులో ట్రావిస్ హెడ్ కోసం కెప్టెన్ రోహిత్ శర్మ ప్రత్యేక వ్యూహాలు- ప్రణాళికలు రచిస్తాడని భావించారంతా.

IND vs AUS Rohit Sharma Drops Crucial Catch Missed Opportunity to Dismiss Travis Head

కానీ హెడ్ కోసం ఎలాంటి వ్యూహాలు రచించలేదు. సాధారణ కెప్టెన్సీతోనే రోహిత్ జట్టును నడిపిస్తున్నాడు. హెడ్ ఎటాకింగ్ గేమ్ మొదలుపెట్టిన వెంటనే డిఫెన్సివ్ కెప్టెన్సీకి వెళ్లిపోయాడు. హెడ్‌ను కట్టడిచేయడానికి ఫీల్డర్లను ప్రత్యేకంగా మోహరించలేదని రోహిత్‌పై నెట్టింట్లో విమర్శలు వస్తున్నాయి. అయితే రోహిత్ ఫీల్డర్‌గానూ గబ్బా టెస్టులో ఆకట్టుకోలేకపోయాడు. స్లిప్‌లో హెడ్ క్యాచ్‌ను జారవిడిచాడు.

రెండో రోజు ఆటలో టీ విరామం అనంతరం హెడ్‌ను ఔట్ చేసే అవకాశం వచ్చింది. నితీశ్ రెడ్డి వేసిన బంతిని హెడ్ షాట్‌‌కు యత్నించాడు. కానీ బంతి ఔట్ సైడ్ ఎడ్జ్ తీసుకుంది. స్లిప్‌లో ఉన్న రోహిత్ తన ఎడమ వైపుకు బంతిని అందుకోవడానికి రెండు చేతులతో ప్రయత్నించాడు. కానీ క్యాచ్‌ను విజయవంతంగా అందుకోలేకపోయాడు. అది సులువైన క్యాచ్ కానప్పటికీ, అందుకోలేనంత కష్టతరమైన క్యాచ్ అయితే కాదని వ్యాఖ్యతలు పేర్కొన్నాడు. మరోవైపు రోహిత్ ఫీల్డింగ్‌పై నెట్టింట్లో విమర్శలు వస్తున్నాయి. కాగా, ఆస్ట్రేలియా మూడు వికెట్లకు 313 పరుగులు చేసింది. ట్రావిస్ హెడ్ (146*), స్టీవ్ స్మిత్ (103*) అజేయ శతకాలతో కదం తొక్కారు.

Story first published: Sunday, December 15, 2024, 11:55 [IST]
Other articles published on Dec 15, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+