Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

'ఛాంపియన్స్ ట్రోఫీ మనదేనా భయ్యా?' - పంత్ రియాక్షన్ తేడాగా ఉందే!!

బోర్డర్ గావస్కర్ ట్రోఫీ ముగియడంతో ఆస్ట్రేలియా నుంచి టీమిండియా స్టార్ వికెట్ కీపర్ రిషభ్ పంత్ స్వదేశానికి తిరిగొచ్చాడు. అయితే ఛాంపియన్స్ ట్రోఫీ గురించి ఎయిర్ పోర్టులో పంత్ ను అడగగా, అతడు ఇచ్చిన రియాక్షన్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇంతకీ అతడు ఏం చెప్పాడంటే?

ఇటీవలే బోర్డర్ గావస్కర్ ట్రోఫీ ముగియడంతో టీమ్ ఇండియా ప్లేయర్స్ స్వదేశానికి తిరిగొస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా టీమిండియా పించ్ హిట్టర్ రిషబ్ పంత్ కూడా భారత్ కు తిరిగొచ్చాడు. స్వదేశంలో ఎయిర్ పోర్ట్ లో ల్యాండ్ అవ్వగానే పంత్ ను కెమెరాలు చుట్టుముట్టాయి. అయితే అతడు బయటకు వచ్చే క్రమంలో ఓ వ్యక్తి... రిషభ్ భాయ్ ఛాంపియన్స్ ట్రోఫీ మనదేనా? మనం గెలుస్తామా?' అని అడిగాడు. కానీ దానికి పంత్ ఇచ్చిన సమాధానం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

IND VS AUS Rishabh Pant s Reaction Goes viral on India s 2025 Champions Trophy Victory Question

పంత్ ఎలాంటి రియాక్షన్ ఇచ్చాడంటే?
వీడియోలో పంత్ బ్లూ కలర్ హుడీ, బ్లాక్ షార్ట్ ప్యాంట్ ధరించి కనిపించాడు. అయితే వాస్తవానికి పంత్, తరచుగా తన వోకల్ స్టైల్ తో ఎప్పుడూ హైలైట్ అవుతుంటాడు. తనదైన స్టైల్ లో మాట్లాడుతూ వైరల్ అవుతుంటాడు. అయితే ఈ సారి మాత్రం ఛాంపియన్స్? ట్రోఫీ గురించి అడగగానే మాత్రం ఎటువంటి సమాధానం చెప్పకుండా అక్కడ నుంచి వెళ్లిపోయాడు. ప్రశ్నను దాటవేస్తూ అక్కడి నుంచి నడుచుకుంటూ ముందుకెళ్లిపోయాడు. ఫ్యాన్స్ తో సెల్ఫీ దిగి సైలైంట్ గా అక్కడి నుంచి జారుకున్నాడు. దీంతో ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది. 'ఛాంపియన్స్ ట్రోఫీ గురించి అడిగితే ఏం మాట్లాడకుండా అలా వెళ్లి పోయాడేంటి', 'బహుశ సిరీస్ కోల్పోయిన బాధలో ఉన్నాడేమో' అంటూ క్రికెట్ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.

కాగా, రీసెంట్ గా ముగిసిన బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో పంత్ ప్రదర్శన విషయానికొస్తే పర్వాలేదనిపించేలా ఆడాడు. తొమ్మిది ఇన్నింగ్స్ లో 28.33 యావరేజ్ తో 255 పరుగులు చేశాడు. కమ్‌బ్యాక్ తర్వాత మంచి ప్రదర్శన చేస్తున్న అతడు మునుపటి రేంజ్‌లో కాకపోయినా అడపాదడపా మంచి ఇన్నింగ్స్‌లే ఆడుతున్నాడు. రీసెంట్ ఆసీస్ టూర్ లోనూ కొన్ని బ్యూటిఫుల్ నాక్స్‌తో ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా సిడ్నీ టెస్ట్ సెకండ్ ఇన్నింగ్స్‌లో భారీ సిక్సులు, బౌండరీలతో ఆసీస్‌ను కంగారు పెట్టేలా ప్రదర్శన చేశాడు.

Story first published: Wednesday, January 8, 2025, 14:52 [IST]
Other articles published on Jan 8, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+