For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IND vs AUS: అలా ఎలా కొట్టావ్రా? కిందపడి సిక్సర్ బాదిన పంత్ (Video)

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా పెర్త్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా వికెట్ కీపర్ రిషభ్ పంత్ బాదిన సిక్సర్ నెట్టింట వైరల్‌గా మారింది. కిందపడి మరీ పంత్ సిక్సర్ కొట్టడం విశేషం. అయిదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన ఈ ఎడమచేతి వాటం బ్యాటర్ 78 బంతుల్లో 37 పరుగులు సాధించాడు. మూడు ఫోర్లు, ఒక్స సిక్సర్ బాదాడు.

ప్యాట్ కమిన్స్ బౌలింగ్‌లో పంత్ సాధించిన సిక్సర్ టీమిండియా ఇన్నింగ్స్‌లోనే హైలైట్‌‌గా నిలిచింది. 42వ ఓవర్‌‌లో కమిన్స్ ఆఖరి బంతిని ఔట్ సైడ్ ఆఫ్ స్టంప్‌ వైపుగా వేశాడు. పంత్ తన ఎడమవైపునకు వచ్చి డీప్ బ్యాక్‌వర్డ్ స్క్వేర్ మీదుగా స్కూప్ షాట్‌ బాదాడు. అయితే ఈ క్రమంలో పంత్ అదుపుతప్పి తొలుత మోకాలిపై, ఆ తర్వాత కిందపడిపోయాడు. పంత్ కిందపడిన కొన్ని సెకన్ల తర్వాత బంతి స్టాండ్స్‌లోకి పడింది.

IND vs AUS Rishabh Pant Hits Stunning Six While Falling to the Ground A Moment of Genius

పంత్ అద్భుతమైన షాట్‌కు వ్యాఖ్యాతలు ఫిదా అయ్యారు. ప్రముఖ స్పోర్ట్స్ వెబ్‌సైట్స్ కూడా పంత్‌ షాట్‌ను కొనియాడాయి. కాగా, మొదటి ఇన్నింగ్స్‌లో భారత్ 49.4 ఓవర్లలో 150 పరుగులకే ఆలౌటైంది. నితీశ్ కుమార్ రెడ్డి (41; 59 బంతుల్లో, 6 ఫోర్లు, 1 సిక్సర్) టాప్ స్కోరర్. టీమిండియా బ్యాటర్లలో నలుగురు మాత్రమే రెండంకెల స్కోరు సాధించారు. ఆసీస్ బౌలర్లలో జోస్ హేజిల్‌వుడ్ నాలుగు వికెట్లు, మిచెల్ స్టార్క్, ప్యాట్ కమిన్స్, మిచెల్ మార్ష్ తలో రెండు వికెట్లు తీశారు.

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్‌కు శుభారంభం దక్కలేదు. ఆదిలోనే ఇద్దరు బ్యాటర్లు డకౌటయ్యారు. 8 బంతులు ఎదుర్కొని యశస్వీ జైస్వాల్, 23 బంతులు ఎదుర్కొని దేవదత్ పడిక్కల్ పరుగుల ఖాతా తెరవకముందే పెవిలియన్‌కు చేరారు. విరాట్ కోహ్లి (5; 12 బంతుల్లో) మరోసారి నిరాశపరిచాడు. అయితే వికెట్లు పడుతున్నా మరో ఎండ్‌లో కేఎల్ రాహుల్ (26; 74 బంతుల్లో, 3 ఫోర్లు) క్రీజులో కుదురుకుని పరుగులు చేశాడు. కానీ థర్డ్ అంపైర్ చర్చనీయాంశమైన నిర్ణయంతో రాహుల్ వెనుదిరగాల్సి వచ్చింది.

కాసేపటికే ధ్రువ్ జురెల్ (11; 20 బంతుల్లో, 2 ఫోర్లు) కూడా ఔటయ్యాడు. ఈ దశలో బ్యాటింగ్‌కు వచ్చిన నితీశ్ కుమార్ రెడ్డితో కలిసి రిషభ్ పంత్ (37; 78 బంతుల్లో, 3 ఫోర్లు, 1 సిక్సర్) ఇన్నింగ్స్ చక్కదిద్దడానికి ప్రయత్నించాడు. వీరిద్దరు కలిసి ఏడో వికెట్‌కు 48 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. భారత్ ఇన్నింగ్స్‌లో ఇదే అత్యుత్తమ భాగస్వామ్యం. అయితే పంత్‌ను కమిన్స్ ఔట్ చేసి ఈ జోడీని విడగొట్టాడు.

Story first published: Friday, November 22, 2024, 13:45 [IST]
Other articles published on Nov 22, 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+