Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs AUS: ఆ భారత ప్లేయర్‌ను చూసి నేర్చుకోండి: ఆస్ట్రేలియాకు పాంటింగ్ సూచనలు

పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్టులో టీమిండియా చేతిలో 295 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా ఓటమిపాలైన విషయం తెలిసిందే. వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ రేసులో నిలవాలంటే భారత్‌తో పాటు ఆసీస్‌కు ఈ సిరీస్ ఎంతో కీలకం. తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియాను 150 పరుగులకే ఆలౌట్ చేసినప్పటికీ.. భారత బౌలర్ల ముందు తమ బ్యాటర్లు నిలవలేక మ్యాచ్‌పై ఆస్ట్రేలియా పట్టు చేజార్చుకుంది. ఇక రెండో ఇన్నింగ్స్‌లో యశస్వీ జైస్వాల్, విరాట్ కోహ్లి సెంచరీలు బాదడంలో బౌలర్లు నిస్సహాయంగా కనిపించారు. అనంతరం కొండంత లక్ష్యాన్ని ఛేదించలేక బ్యాటర్లు చతికిలపడ్డారు.

ఈ నేపథ్యంలో అడిలైడ్ వేదికగా జరిగే రెండో టెస్టులో విజయం సాధించి అయిదు టెస్టుల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భారత్ ఆధిక్యాన్ని సమం చేయాలని ఆస్ట్రేలియా ఉవ్విళూరుతోంది. డిసెంబర్ 6 నుంచి పింక్ బాల్‌తో జరగనున్న ఈ డే/నైట్ టెస్టు భారత కాలమాన ప్రకారం ఉదయం 9.30 గంటలకు మొదలవుతుంది. అయితే రెండో టెస్టు ముంగిట ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్లు స్టీవ్ స్మిత్, మార్నస్ లబుషేన్‌కు ఆ దేశ దిగ్గజ బ్యాటర్ రికీ పాంటింగ్ కీలక సూచనలు చేశాడు. విరాట్ కోహ్లి ఆటను చూసి బ్యాటింగ్ చేయాలని అన్నాడు.

IND vs AUS Ricky Ponting Urges Steve Smith and Marnus Labuschagne to Emulate Virat Kohli s Approach

''పెర్త్ టెస్టులో అందరు బ్యాటర్లలో లబుషేన్ ఎక్కువ తడబడినట్లు అనిపించింది. పటిష్టమైన బౌలింగ్ దళం, కష్టతరమైన వికెట్ అని అర్థం చేసుకోవచ్చు. కానీ అతను సత్తాచాటడానికి ప్రయత్నించాల్సింది. విరాట్ కోహ్లి తన ఆటను నమ్మాడు. తొలి ఇన్నింగ్స్‌లో కంటే రెండో ఇన్నింగ్స్‌లో భిన్నమైన ఆటగాడిగా కనిపించాడు. ప్రత్యర్థిని ఎదుర్కోవడం కంటే తప్పించుకుంటూ తన బలాన్ని నమ్మాడు. లబుషేన్-స్మిత్ కూడా అలానే ఆడాలి. సత్తాచాటడానికి తమ సొంత మార్గాల్ని కనుగొని ఆడాలి. బుమ్రా వంటి బౌలర్లను ఎదుర్కోవడానికి మార్గాలు అన్వేషించాలి. వాళ్లపై ఒత్తిడి తీసుకురావడానికి ప్రయత్నించాలి'' అని రికీ పాంటింగ్ పేర్కొన్నాడు.

పెర్త్ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో స్మిత్ బుమ్రా బౌలింగ్‌లో గోల్డెన్ డకౌటవ్వగా, లబుషేన్ 52 బంతులు ఎదుర్కొని 2 పరుగులు చేసి సిరాజ్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. రెండో ఇన్నింగ్స్‌లో లబుషేన్ 5 బంతుల్లో 3 పరుగులు, స్మిత్ 60 బంతుల్లో 17 పరుగులు చేసి బుమ్రా-సిరాజ్ బౌలింగ్‌లో ఔటయ్యారు. మరోవైపు విరాట్ కోహ్లి తొలి ఇన్నింగ్స్‌లో 12 బంతుల్లో 5 పరుగులు చేశాడు. కానీ రెండో ఇన్నింగ్స్‌లో 143 బంతుల్లో అజేయంగా 100 పరుగులు సాధించాడు.

ఆస్ట్రేలియాతో అయిదు టెస్టుల సిరీస్ షెడ్యూల్
నవంబర్ 22-26: తొలి టెస్టు- భారత్ 295 పరుగుల విజయం
డిసెంబర్ 06-10: రెండో టెస్టు (డే/నైట్)- అడిలైడ్ (ఉదయం 9.30)
డిసెంబర్ 14-18: మూడో టెస్టు- బ్రిస్బేన్ (ఉదయం 5.50)
డిసెంబర్ 26-31: నాలుగో టెస్టు- మెల్‌బోర్న్ (ఉదయం 5 గంటలకు)
జనవరి 03-08: అయిదో టెస్టు- సిడ్నీ (ఉదయం 5 గంటలకు).

Story first published: Saturday, November 30, 2024, 17:03 [IST]
Other articles published on Nov 30, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+