
టీ20 ప్రపంచ కప్ ముందు టీమిండియాకు మంచి ఆరంభం లభించింది. సోమవారం బ్రిస్బేన్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన వార్మప్ మ్యాచ్‌లో విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్ లో ఇండియా విజయం సాధించడానికి కారణం మహ్మద్ షమీ.. దాదాపు భారత్ ఓడిపోతుందనుకున్న సయంలో బౌలింగే చేసిన షమీ కంగారులను కంగారు పెట్టాడు. ఆరు బంతుల్లో నాలుగురిని ఔట్ చేసి ఆసీస్ కు ఓటమిని ఖారారు చేశాడు.
20 ఓవర్
షమీ గత ఏడాది జరిగిన టీ20 వరల్డ్ కప్ తర్వాత ఇప్పటి వరకు టీ20 ఆడలేదు. ఈ వరల్డ్ కప్ కు కూడా మహ్మద్ షమీ సెలెక్ట్ కాలేదు. కానీ బుమ్రా గాయపడడంతో మహ్మద్ షమీని జట్టులోకి తీసుకున్నారు. వార్మప్ మ్యాచ్ లో అతని మొదట్లో బౌలింగ్ ఇవ్వలేదు రోహిత్ శర్మ.. అయితే ఆస్ట్రేలియాకు 6 బంతుల్లో 11 పరుగులు చేయాల్సి ఉండగా.. 20వ ఓవర్ మహ్మద్ షమీ ఇచ్చారు.
మూడో బంతి నుంచి కథ మారిపోయింది
మొదటి బంతి వేసిన షమీ రెండు పరుగులిచ్చాడు. రెండో బంతికి కుడా రెండు పరుగులొచ్చాయి. మూడో బంతి నుంచి కథ మారిపోయింది. మూడో బంతికి కమ్మిన్స్ ఔట్ చేసిన షమీ నాలుగో బంతికి అగర్ రనౌట్ అయ్యాడు. ఐదో బంతి జోష్ ఇగ్లీస్ ఔట్ కాగా.. ఆరో బంతికి రిచర్డ్స్ సన్ ఔటయ్యాడు. ఇలా 20వ ఓవర్ లో ఆస్ట్రేలియా 4 వికెట్లు కోల్పోయి ఓటమి మూటగట్టుకుంది. మహ్మద్ షమీ బౌలింగ్ మ్యాచ్ గతిని మార్చిందని అభిమానులు చెబుతున్నారు.
రాహుల్, సూర్యాకుమార్
ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 186 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ 33 బంతుల్లో 57 పరుగులు చేయగా.. సూర్యాకుమార్ యాదవ్ 33 బంతుల్లో 50 పరుగులు చేశాడు. ఆసీస్ బౌలర్లలో రిచర్డ్ స్న్ 4 వికెట్లు పడగొట్టగా.. మ్యాక్స్ వెల్, అగర్, స్టార్క్ ఒక్కో వికెట్ తీశారు. అస్ట్రేలియా 180 పరుగులకు ఆలౌట్ అయింది. ఆరోన్ ఫించ్ 54 బంతుల్లో 76 పరుగులు చేయగా.. మిచెల్ మార్ష్ 35 పరుగులు చేశాడు. భారత్ బౌలర్లలో షమీ మూడు వికెట్లు పడగొట్టగా.. భువనేశ్వర్ 2, హర్ష్ దీప్ సింగ్, హర్షల్ పటేల్, చాహల్ ఒక్కో వికెట్ తీశారు.