IND vs AUS Practice Match: బరిలోకి రోహిత్.. సూర్యకు లిట్మస్ టెస్ట్! డేవిడ్ వార్నర్‌కు అగ్నీ పరీక్ష!

దుబాయ్‌: తొలి సన్నాహక మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ను చిత్తు చేసి టీ20 ప్రపంచకప్‌ ప్రయాణాన్ని ఘనంగా ఆరంభించిన టీమిండియా మరో ప్రాక్టీస్‌ సమరానికి సిద్ధమైపోయింది. బుధవారం తన రెండో, చివరి సన్నాహక పోరులో ఆస్ట్రేలియాను ఢీకొంటుంది. చిరకాల శత్రువు పాకిస్థాన్‌ను ఎదుర్కోవడానికి ముందు భారత జట్టు తమ అస్త్రశస్త్రాలను సరిచూసుకునేందుకు ఇదే చివరి అవకాశం. ఈనెల 24న పాకిస్థాన్‌తో పోరుతో టీమిండియా ఈ మెగా టోర్నీని ఆరంభించనుంది.

ఈ నేపథ్యంలో తమ బ్యాటింగ్‌ ఆర్డర్‌ ఎలా ఉండాలనే విషయంపై ఎక్కువగా దృష్టి సారించనుంది. ఎందుకంటే మెగా టోర్నీకి తుది జట్టును ఖరారు చేసే విషయంలో ఆస్ట్రేలియాతో జరిగే ప్రాక్టీస్ మ్యాచే కీలకం కానుంది.

ఫుల్ జోష్‌లో బ్యాట్స్‌మన్..

ఫుల్ జోష్‌లో బ్యాట్స్‌మన్..

సోమవారం జరిగిన తొలి వామప్‌లో ఇంగ్లండ్‌పై భారత బ్యాట్స్‌మెన్ అదరగొట్టడం సానుకూలాంశం. కేఎల్‌ రాహుల్‌, ఇషాన్‌ కిషన్‌ ఆరంభం నుంచే ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడ్డారు. క్లాస్ బ్యాటింగ్‌తో కనువిందు చేశారు. ఐపీఎల్‌ ఫామ్‌ను ఇక్కడా కొనసాగించారు. అయితే కెప్టెన్‌ విరాట్ కోహ్లీ, సూర్యకుమార్‌ యాదవ్ ఎక్కువసేపు క్రీజులో నిలవలేకపోయారు. ఇంగ్లండ్‌తో వామప్‌ మ్యాచ్‌కు ముందు మెగా ఈవెంట్‌లో రోహిత్‌తో కలిసి రాహుల్‌ ఓపెనర్‌గా వస్తాడని చెప్పడం ద్వారా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ ఇప్పటికే స్పష్టతనిచ్చాడు. మూడో స్థానంలో తానే వస్తున్నట్టుగా కూడా ప్రకటించాడు.

సూర్యకు ఎసరు..

సూర్యకు ఎసరు..

ఇక ఇంగ్లండ్‌పై ఇషాన్‌ కిషన్‌ 70 పరుగుల తుఫాన్‌ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. దీంతో అతడిని కూడా తుది జట్టులో ఆడించాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. ఆస్ట్రేలియాతో జరిగే నేటి మ్యాచ్‌లో సూర్య రిథమ్ అందుకోకుంటే మాత్రం.. అతను బెంచీకే పరిమితమయ్యే అవకాశాలున్నాయి. ఇంగ్లాండ్‌పై బ్యాటింగ్‌ చేయని రోహిత్‌.. ఆస్ట్రేలియాపై ఆడే అవకాశముంది. కానీ ప్రధానంగా చర్చ జరుగుతున్నది మాత్రం ఆల్‌రౌండ్‌ హార్దిక్‌ పాండ్య గురించే. ఇంగ్లాండ్‌పై అతడు అంత సౌకర్యంగా కనపడలేదు.

బౌలింగ్‌కు దూరంగా ఉంటున్న హార్దిక్‌ పాండ్యాను కేవలం బ్యాటర్‌గానే పరిగణిస్తారా? అనేది చూడాల్సిందే. అదే జరిగితే ఆరో బౌలర్‌ సేవలను జట్టు కోల్పోయినట్టే. మరోవైపు బౌలింగ్‌ విభాగంలో బుమ్రా, షమీ ఆకట్టుకోగా, పేసర్‌ భువనేశ్వర్‌ కుమార్, స్పిన్నర్‌ రాహుల్‌ చాహర్‌ తేలిపోయారు. వీరి బౌలింగ్‌లో ఇంగ్లండ్‌ బ్యాటర్స్‌ ధారాళంగా పరుగులు రాబట్టారు. అందుకే ఆసీస్‌తో మ్యాచ్‌లో జడేజా, వరుణ్‌ చక్రవర్తి, శార్దూల్‌ ఠాకూర్‌లను పరీక్షించనున్నారు.

వార్నర్ ఫామ్ అందుకునెనా?..

వార్నర్ ఫామ్ అందుకునెనా?..

ఆస్ట్రేలియా కూడా ఆత్మవిశ్వాసంతో కనిపిస్తోంది. తమ తొలి వామప్‌ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై చివరి ఓవర్‌లో ఉత్కంఠ విజయం అందుకుంది. అయితే ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ పేలవ ఫామ్‌ ఇక్కడా కొనసాగింది. అతను ఇన్నింగ్స్ ఫస్ట్ బాల్‌కే ఔటయ్యాడు. మెగా టోర్నీ ముందు అతను ఫామ్‌లోకి రావడం అటు జట్టుకు ఇటు వార్నర్‌కు ఎంతో కీలకం. మరోవైపు న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో మిడిలార్డర్‌ కూడా విఫలమైంది.

టెయిలెండర్లు అగర్‌, స్టార్క్‌, ఇంగ్లిస్‌ వేగం కారణంగానే చివర్లో గట్టెక్కింది. అయితే బౌలింగ్‌లో ఆడమ్‌ జంపా, రిచర్డ్‌సన్‌ ప్రమాదకరంగా కనిపిస్తున్నారు. న్యూజిలాండ్‌తో కష్టంగా గెలిచిన ఆస్ట్రేలియా.. భారత్‌పైనైనా సంపూర్ణ ఆధిపత్యాన్ని ప్రదర్శించి ఆత్మవిశ్వాసంతో ప్రపంచకప్‌లో అడుగుపెట్టాలనుకుంటోంది.

తుది జట్లు (అంచనా)

తుది జట్లు (అంచనా)

భారత్: రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్/ఇషాన్ కిషన్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషభ్ పంత్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, మహమ్మద్ షమీ/జస్‌ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్, వరుణ్ చక్రవర్తీ/రాహుల్ చాహర్

ఆస్ట్రేలియా: డేవిడ్ వార్నర్, ఆరోన్ ఫించ్(కెప్టెన్), మిచెల్ మార్ష్, స్టీవ్ స్మిత్, మార్కస్ స్టోయినిస్, మాథ్యూ వేడ్, అష్టన్ అగర్, మిచెల్ స్టార్క్/పాట్ కమిన్స్, జోష్ ఇంగ్లీస్, గ్లేన్ మ్యాక్స్‌వెల్, మిచెల్ స్వెప్సన్

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Wednesday, October 20, 2021, 8:19 [IST]
Other articles published on Oct 20, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X