IND vs AUS: నితీశ్ రెడ్డి ఊహకందని ఊచకోత.. సిక్సర్లతో సంచలన బ్యాటింగ్ (Video)
తెలుగు కుర్రాడు, యువ ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి భారత జట్టులో విలువైన ప్లేయర్‌గా మారుతున్నాడు. కష్టాల్లో నిలిచిన టీమిండియాను మరోసారి ఒంటిచేత్తో ఆదుకున్నాడు. సంచలన బ్యాటింగ్‌తో ఆస్ట్రేలియా ప్రధాన ఫాస్ట్ బౌలర్లను వణికించాడు. మిచెల్ స్టార్క్, ప్యాట్ కమిన్స్, స్కాట్ బొలాండ్ బౌలింగ్‌లో బౌండరీలతో చెలరేగాడు. బొలాండ్ బౌలింగ్‌లో రివర్స్ స్కూప్ షాట్‌తో నితీశ్ రెడ్డి బాదిన సిక్సర్ బోర్డర్-గవాస్కర్ ట్రోఫీకే హైలైట్‌గా నిలవడం ఖాయం.
అడిలైడ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న డే/నైట్ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 44.1 ఓవర్లలో 180 పరుగులకు ఆలౌటైంది. నితీశ్ రెడ్డి టాప్ స్కోరర్. 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 54 బంతుల్లో 42 పరుగులు చేశాడు. కేఎల్ రాహుల్ (37; 64 బంతుల్లో, 6 ఫోర్లు), శుభ్‌మన్ గిల్ (31; 51 బంతుల్లో, 5 ఫోర్లు) ఫర్వాలేదనిపించారు. మిచెల్ స్టార్క్ ఆరు వికెట్లతో సత్తాచాటాడు. కమిన్స్, బొలాండ్ చెరో రెండు వికెట్లు తీశారు.

పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లోనూ నితీశ్ రెడ్డి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. భారత్ 150 పరుగులు సాధించగా.. నితీశ్ 59 బంతుల్లో 41 పరుగులు చేసి ఆఖరి వికెట్‌గా వెనుదిరిగాడు. 6 ఫోర్లు, 1 సిక్సర్ బాదాడు. అయితే ఈ మ్యాచ్‌లోనూ 87/5తో టీమిండియా కష్టాల్లో నిలిచిన సమయంలో క్రీజులోకి వచ్చిన నితీశ్ రెడ్డి ఆఖరి వికెట్‌గా వెనుదిరిగాడు.
కాగా, మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో నితీశ్ రెడ్డి కళ్లు చెదిరే సిక్సర్ బాదాడు. స్టార్క్ వేసిన ఔట్ సైడ్ ఆఫ్ స్టంప్ బంతిని డీప్ ఎక్స్‌ట్రా కవర్ మీదుగా భారీ సిక్సర్ బాదాడు. బొలాండ్ వేసిన ఆ తర్వాతి ఓవర్‌లో విధ్వంసం సృష్టించాడు. రెండు సిక్సర్లు, ఓ బౌండరీతో ఏకంగా 21 పరుగులు పిండుకున్నాడు. రెండో బంతిని నితీశ్ రెడ్డి సిక్సర్‌గా మలిచిన తీరు హైలైట్. బ్యాటింగ్ స్టాండ్స్ మార్చుకుని స్లిప్‌లో ఉన్న ఫీల్డర్ల మీదుగా సిక్సర్ బాదాడు. నాలుగో బంతిని పుల్ షాట్‌తో మరో సిక్సర్ సాధించాడు. నాథన్ లైయన్ దాన్ని అందుకోవడానికి తీవ్రంగా ప్రయత్నించి విఫలమయ్యాడు. ఇక కమిన్స్ బౌలింగ్‌లో కవర్ డ్రైవ్‌లతో ముచ్చటైన బౌండరీలు బాదాడు.
THIS IS CINEMA! 🙌
— Star Sports (@StarSportsIndia) December 6, 2024
Pink ball, seaming conditions & bowlers breathing fire - doesn't matter to #NitishReddy! 💪#AUSvINDOnStar 2nd Test 👉 LIVE NOW on Star Sports! #AUSvIND | #ToughestRivalry pic.twitter.com/IM9HaBrv63
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications