Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs AUS: ఒంటరైన బుమ్రా.. అప్పుడు నితీశ్ రెడ్డి వచ్చి..! (Video)

అడిలైడ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న డే/నైట్ టెస్టులో భారత్ తిరిగి పోటీలోకి రావడానికి తీవ్రంగా శ్రమిస్తోంది. ఓవర్‌నైట్ స్కోరు 86/1తో రెండో రోజు ఆట ప్రారంభించిన ఆసీస్‌ను బుమ్రా ఆదిలోనే దెబ్బకొట్టాడు. చక్కని బౌన్స్‌తో బుమ్రా విసిరిన లెంగ్త్ డెలివరీని ఓపెనర్ నాథన్ మెక్‌స్వీనె (39; 109 బంతుల్లో, 6 ఫోర్లు)ఎదుర్కోలేకపోయాడు. డిఫెన్స్‌కు ప్రయత్నించి వికెట్ కీపర్ పంత్ చేతికి చిక్కాడు.

అనంతరం కాసేపటికే ప్రమాదకర బ్యాటర్ స్టీవ్ స్మిత్ (2; 11 బంతుల్లో)‌ను బుమ్రా బోల్తాకొట్టించాడు. లెగ్ వికెట్ మీదుగా కోణాన్ని మారుస్తూ బుమ్రా వేసిన వలలో స్మిత్ చిక్కుకున్నాడు. ఫ్లిక్‌కు ప్రయత్నించి వికెట్ కీపర్ పంత్‌కు దొరికిపోయాడు. దీంతో ఆస్ట్రేలియా రెండో రోజు ఆటలో 17 పరుగులకే కీలక రెండు వికెట్లు కోల్పోయింది. అయితే వరుసగా నాలుగు ఓవర్లు బౌలింగ్ చేసిన బుమ్రా ఆ తర్వాత విశ్రాంతి తీసుకున్నాడు.

IND vs AUS Nitish Kumar Reddy Shines with Bat and Ball Dismisses Labuschagne in Adelaide

ఈ క్రమంలో సిరాజ్‌తో పాటు హర్షిత్ రాణా పేస్ బాధ్యతలు అందుకున్నాడు. కానీ ప్రభావం చూపలేకపోయారు. వరుసగా ఏడు ఓవర్లు స్పెల్ వేసిన సిరాజ్ కట్టుదిట్టంగానే బౌలింగ్ చేసినప్పటికీ వికెట్ సాధించలేకపోయాడు. సిరాజ్ తర్వాత హర్షిత్ రాణాతో రవిచంద్రన్ అశ్విన్ జత కట్టాడు. కానీ వీరిద్దరు ధారళంగా పరుగులు సమర్పించుకున్నారు. అశ్విన్ బౌలింగ్‌లో ట్రావిస్ హెడ్ రెండు సిక్సర్లతో ఎటాక్ చేశాడు.

ఇక హర్షిత్ రాణా వేసిన 51వ ఓవర్‌లో హెడ్ ఓ బౌండరీ, లబుషేన్ మూడు ఫోర్లతో ఏకంగా 17 పరుగులు పిండుకున్నారు. బుమ్రా మినహా మిగిలిన బౌలర్లు సత్తాచాటకపోవడంతో క్రమంగా మ్యాచ్‌పై భారత్ పట్టుజారింది. అయితే ఈ స్థితిలో నితీశ్ కుమార్ రెడ్డి బౌలింగ్‌కు వచ్చాడు. తన రెండో ఓవర్‌లోనే కుదురుకున్న లబుషేన్ (64; 126 బంతుల్లో, 9 ఫోర్లు)ను పెవిలియన్‌కు చేర్చాడు. దీంతో లబుషేన్-హెడ్ 86 బంతుల్లో 65 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. కాగా, ప్రస్తుతం ఆస్ట్రేలియా టీ విరామానికి 59 ఓవర్లకు 191/4 స్కోరు సాధించింది. భారత్ కంటే 11 పరుగుల ఆధిక్యంలో ఉంది. తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 180 పరుగులు చేసింది.

Story first published: Saturday, December 7, 2024, 11:42 [IST]
Other articles published on Dec 7, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+