గవాస్కర్ కాళ్లు మొక్కిన నితీష్ కుమార్ రెడ్డి నాన్న
Nitish Kumar Reddy: బోర్డర్- గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా పట్టు బిగిస్తోంది. నాలుగో రోజు వెంటవెంటనే రెండు వికెట్లను పడగొట్టింది. ప్రారంభ ఓవర్లల్లో పేస్ బౌలర్లిద్దరూ చెలరేగారు. ఓపెనర్లను పెవిలియన్ దారి పట్టించారు.
9 వికెట్ల నష్టానికి 358 పరుగులతో నాలుగో రోజు ఆటను ఆరంభించిన టీమిండియా ఇన్నింగ్ ఎక్కువ సేపు కొనసాగలేదు. సెంచరీ హీరో నితీష్ కుమార్ రెడ్డి త్వరగా అవుట్ అయ్యాడు. 114 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద నాథన్ లియన్ బౌలింగ్‌లో మిఛెల్ స్టార్క్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీనితో 369 పరుగుల వద్ద టీమిండియా ఆలౌట్ అయింది.

వికెట్ల పతనం ఆస్ట్రేలియా ఇన్నింగ్‌లోనూ కొనసాగింది. టీమిండియా పేస్ బౌలర్లు జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్ వెంటవెంటనే వికెట్లు పడగొట్టారు. ఓపెనర్ సామ్ కొన్‌స్టాస్‌ను బుమ్రా, ఉస్మాన్ ఖవాజాను మహ్మద్ సిరాజ్ క్లీన్ బౌల్డ్ చేశారు. 13 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద సిరాజ్ బౌలింగ్‌లో టాప్ ఆర్డర్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ వికెట్ కీపర్ రిషభ్ పంత్‌కు క్యాచ్ ఇచ్చాడు.
మూడో రోజు హైలైట్‌గా నిలిచాడు నితీష్ కుమార్ రెడ్డి. టెస్టుల్లో సెంచరీ బాదాడు. 10 ఫోర్లు, ఒక భారీ సిక్సర్‌తో పరుగుల వరద పారించాడు. వంద పరుగులను అందుకున్నాడు. నాన్ స్ట్రైకింగ్ ఎండ్‌లో వాషింగ్టన్ సుందర్ అతనికి సహకరించాడు. అర్ధసెంచరీ చేశాడు సుందర్. సరిగ్గా 50 పరుగులు చేసిన తరువాత సుందర్ అవుట్ అయ్యాడు.
99 పరుగుల వద్ద ఫోర్ కొట్టి మరీ తొలి సెంచరీని అందుకున్నాడు నితీష్ కుమార్ తెగువకు అద్దం పట్టింది. బంతి బౌండరీ దాటిన వెంటనే అతన ఆనందానికి హద్దుల్లేకుండా పోయింది. స్టేడియంలో ప్రత్యక్షంగా మ్యాచ్ తిలకిస్తోన్న అతని తండ్రి ముత్యాల రెడ్డి ఉబ్బితబ్బిబ్బయ్యాడు.
ఈ ఉదయం నితీష్ కుమార్ రెడ్డి కుటుంబం.. టీమిండియా లెజెండర్ సునీల్ గవాస్కర్‌ను కలిసింది. ఈ సందర్భంగా ముత్యాల రెడ్డి సునీల్ గవాస్కర్ కాళ్లు మొక్కాడు. ఆయన ఆశీర్వాదాన్ని తీసుకున్నాడు. ఆనంద భాష్పాలు రాల్చాడు. సునీల్ గవాస్కర్ సైతం భావోద్వేగానికి గురయ్యాడు.
Nitish Kumar Reddy's family meeting the Great Sunil Gavaskar. [ABC Sport]
— Johns. (@CricCrazyJohns) December 29, 2024
- Beautiful moments at MCG...!!! pic.twitter.com/DEFJpCRSWY
ఓ తండ్రిగా గర్వించదగ్గ క్షణం అంటూ వ్యాఖ్యానించాడు. కొడుకు కోసం ముత్యాలరెడ్డి చేసిన ఎంతో త్యాగం చేశారని, ఉద్యోగాన్ని సైతం వదులుకున్న విషయం తన దృష్టికి వచ్చిందని పేర్కొన్నాడు. ప్రపంచ క్రికెట్, భారత జట్టుకు వజ్రంలాంటి ప్లేయర్‌ను ముత్యాలరెడ్డి అందించాడని ప్రశంసించాడు గవాస్కర్.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications