For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

India Vs Australia, 1st ODI: 10,000 పరుగులకు 1 పరుగు దూరంలో ధోని

India Vs Australia,1st ODI : MS Dhoni 1 Run Away From Major Milestone | Oneindia Telugu
IND vs AUS: MS Dhoni 1 run away from major milestone, looks to complete 10,000 ODI runs for India

హైదరాబాద్: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని తన కెరీర్‌లో అరుదైన మైలురాయికి అడుగు దూరంలో ఉన్నాడు. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా సిడ్నీ వేదికగా భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య తొలి వన్డే ప్రారంభమైంది. సిడ్నీ క్రికెట్ గ్రౌండ్‌లో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో ధోని కేవలం ఒక్క పరుగు చేస్తే వన్డేల్లో 10,000 పరుగుల మార్క్‌ని అందుకోనున్నాడు.

ఇప్పటివరకు భారత్ తరుపున 333 వన్డేలాడిన ధోని 9,999 పరుగులు సాధించాడు. నిజానికి గతేడాదే ధోని 10వేల పరుగుల మైలురాయిని అందుకున్నాడు. అయితే, అందులో 174 పరుగులు ఆసియా ఎలెవన్ తరఫున ఆడి చేసినవి కావడం విశేషం. 2007లో ఆఫ్రికా ఎలెవన్, ఆసియా ఎలెవన్ మధ్య జరిగిన ఆ టోర్నీలో మూడు వన్డేలాడిన ధోనీ 174 పరుగులు చేశాడు.

దీంతో ధోని ఖాతాలో ఉన్న 10,173 నుంచి ఆ పరుగుల్ని మినహాయిస్తే, టీమిండియా తరఫున ధోని చేసినవి 9,999 మాత్రమే కావడంతో గణాంకాలు మారాయి. కాగా, భారత్ తరఫున ఇప్పటి వరకూ సచిన్ టెండూల్కర్ (18,426), సౌరవ్ గంగూలీ (11,363), రాహుల్ ద్రవిడ్ (10,889), విరాట్ కోహ్లీ (10,232) మాత్రమే 10వేల పరుగులు మైలురాయిని అందుకున్నారు.

1
43627

నిజానికి ఈ ఒక్క పరుగుని ధోని గత నవంబర్ నెలలో వెస్టిండిస్ జట్టు భారత్‌లో పర్యటించిన సమయంలోనే అందుకోవాల్సి ఉంది. తిరువనంతపురం వేదికగా జరిగిన ఐదో వన్డేకి ముందు టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ పదివేల పరుగుల మైలురాయిని అందుకునేందుకు కేవలం ఒక్క పరుగు దూరంలో ఉన్నాడు.

అయితే, ఐదో వన్డేలో భారత్ విజయం సాధించినప్పటికీ ధోని మాత్రం ఆ మైలురాయిని అందుకోలేకపోయాడు. ధోని ఈ మైలురాయిని అందుకోనివ్వకుండా కోహ్లీనే ఉద్దేశపూర్వంగా అడ్డుపడ్డాడని అప్పట్లో ట్విట్టర్‌లో నెటిజన్లు మండిపడిన సంగతి తెలసిందే. విండిస్‌తో ముగిసిన సిరీస్‌లో మూడు సెంచరీలు సాధించడంతో పాటు కోహ్లీ వన్డేల్లో పదివేల పరుగుల మైలురాయిని కూడా అందుకున్న సంగతి తెలిసిందే.

Story first published: Saturday, January 12, 2019, 11:40 [IST]
Other articles published on Jan 12, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+