గబ్బా వేదికగా జరుగుతున్న భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా మూడో టెస్టు ఆసక్తికరంగా సాగుతోంది. రెండో రోజు ఆటలో లంచ్ విరామ సమయానికి 43 ఓవర్లకు ఆసీస్ మూడు వికెట్లు కోల్పోయి 104 పరుగులు చేసింది. స్టీవ్ స్మిత్ (25 బ్యాటింగ్; 68 బంతుల్లో, 1 ఫోర్), ట్రావిస్ హెడ్ (20 బ్యాటింగ్; 35 బంతుల్లో, 2 ఫోర్లు) క్రీజులో కొనసాగుతున్నారు.
తొలి రోజు ఆటకు వరుణుడు ఆటంకం కలిగించిన విషయం తెలిసిందే. వర్షం కారణంగా తొలి రోజు 13.2 ఓవర్లు మాత్రమే ఆట కొనసాగింది. అయితే రెండో రోజు ఆటలో మార్నస్ లబుసేన్- మహ్మద్ సిరాజ్ మధ్య ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. 32వ ఓవర్‌లో లబుషేన్‌కు సిరాజ్ సవాలైన బంతులు సంధించాడు. రెండో బంతి అనంతరం సిరాజ్ స్ట్రైకర్ ఎండ్‌కు వెళ్లి బెయిల్స్‌ను మార్చాడు.

అయితే సిరాజ్ వెళ్లిన అనంతరం స్ట్రైకింగ్‌లో ఉన్న లబుషేన్ బెయిల్స్‌ను తిరిగి మార్చాడు. కాగా, లబుషేన్ తర్వాతి ఓవర్‌లోనే ఔట్ అయ్యాడు. సిరాజ్ ఓవర్ ముగిసిన తర్వాత బంతిని అందుకున్న నితీశ్ రెడ్డి లబుషేన్‌ను బోల్తా కొట్టించాడు. షాట్‌కు యత్నించిన ఆసీస్ బ్యాటర్ స్లిప్‌లో ఉన్న విరాట్ కోహ్లి చేతికి చిక్కాడు. సిరాజ్ బెయిల్స్ స్విచ్ ట్రిక్ పనిచేసింది. లబుషేన్ ఏకాగ్రత కోల్పోయాడు. ఫీల్డింగ్ చేస్తున్న జట్టు వికెట్ కోసం బెయిల్స్‌ను స్విచ్ చేయడం క్రికెట్‌లో ఓ సెంటిమెంట్.
కాగా, అంతకుముందు 28/0 ఓవర్‌నైట్ స్కోరుతో ఆట ఆరంభించిన ఆస్ట్రేలియా ఆదిలోనే రెండు వికెట్లు కోల్పోయింది. ఓపెనర్లును జస్‌ప్రీత్ బుమ్రా పెవిలియన్‌కు చేర్చాడు. 16వ ఓవర్ మొదటి బంతికి ఉస్మాన్ ఖవాజా (21; 54 బంతుల్లో, 4 ఫోర్లు)ను ఔట్ చేశాడు. ఫార్వర్డ్ డిఫెన్స్‌కు ప్రయత్నించి ఖవాజా వికెట్ కీపర్ రిషభ్ పంత్ చేతికి చిక్కాడు. తన తర్వాతి ఓవర్‌లోనే మరో ఓపెనర్ మెక్‌స్వీనె (9; 49 బంతుల్లో, 1 ఫోర్)ని కూడా బుమ్రా బోల్తాకొట్టించాడు. బ్యాక్ ఫుట్ డిఫెన్స్‌కు ప్రయత్నించిన మెక్‌స్వీనె సెకండ్ స్లిప్‌లో ఉన్న కోహ్లి చేతికి చిక్కాడు. ఈ దశలో బ్యాటింగ్‌కు వచ్చిన స్టీవ్ స్మిత్‌తో కలిసి లబుషేన్ మూడో వికెట్‌కు 37 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు.
How good is this exchange between Siraj and Labuschange? #AUSvIND pic.twitter.com/GSv1XSrMHn
— cricket.com.au (@cricketcomau) December 15, 2024
India's man with the golden arm! 😍
— Star Sports (@StarSportsIndia) December 15, 2024
Nitish Kumar Reddy breaks a flourishing partnership as Marnus Labuschagne departs! 👏#AUSvINDOnStar 👉 3rd Test, Day 2, LIVE NOW! | #ToughestRivalry #BorderGavaskarTrophy pic.twitter.com/p6wNCCZuTp