For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IND vs AUS: చరిత్ర సృష్టించిన మిచెల్ స్టార్క్

అడిలైడ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న డే/నైట్ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 44.1 ఓవర్లలో 180 పరుగులకు ఆలౌటైంది. నితీశ్ కుమార్ రెడ్డి (42; 54 బంతుల్లో, 3 ఫోర్లు, 3 సిక్సర్లు) టాప్ స్కోరర్. కేఎల్ రాహుల్ (37; 64 బంతుల్లో, 6 ఫోర్లు), శుభ్‌మన్ గిల్ (31; 51 బంతుల్లో, 5 ఫోర్లు), రవిచంద్రన్ అశ్విన్ (22; 22 బంతుల్లో, 3 ఫోర్లు), రిషభ్ పంత్ (21; 35 బంతుల్లో, 2 ఫోర్లు) రాణించారు. మిగిలిన బ్యాటర్లూ ఎవరూ రెండంకెల స్కోరు అందుకోలేకపోయారు.

యశస్వీ జైస్వాల్, హర్షిత్ రాణా, జస్‌ప్రీత్ బుమ్రా డకౌటయ్యారు. ఆస్ట్రేలియా బౌలర్లలో మిచెల్ స్టార్క్ (6/48) ఆరు వికెట్లతో విజృంభించాడు. ప్యాట్ కమిన్స్ (2/41), స్కాట్ బొలాండ్ (2/54) చెరో రెండు వికెట్లు తీశారు. అయితే ప్రధాన బ్యాటర్లు వికెట్లు తీసి టీమిండియాను దెబ్బకొట్టిన స్టార్క్ అరుదైన ఘనత సాధించాడు. పింక్ బాల్ టెస్టుల్లో అయిదు వికెట్ల ఘనతను నాలుగు సార్లు సాధించిన ఏకైక బౌలర్‌గా చరిత్ర సృష్టించాడు.

IND vs AUS Mitchell Starc Breaks Record with Unmatched Fourth Five-Wicket Haul in Day-Night Tests

డే/నైట్ టెస్టుల్లో ఓ ఇన్నింగ్స్‌లో ఏ బౌలర్ రెండు కంటే ఎక్కువ సార్లు అయిదు వికెట్లను సాధించలేకపోయాడు. కానీ స్టార్క్ ఏకంగా నాలుగు సార్లు ఈ ఘనత సాధించాడు. కాగా, భారత్‌పై ఓ ఇన్నింగ్స్‌లో అయిదు వికెట్లు పడగొట్టడం స్టార్క్‌కు ఇదే తొలిసారి. కాగా, స్టార్క్ ఓవరాల్‌గా తన టెస్టు కెరీర్‌లో అత్యుత్తమ గణాంకాలు నమోదు చేశాడు. 14.1 ఓవర్లు బౌలింగ్ చేసిన స్టార్క్ 48 పరుగులే ఇచ్చి ఆరు వికెట్లు పడగొట్టాడు. అంతకుముందు 2016లో శ్రీలంకపై 50 పరుగులిచ్చి ఆరు వికెట్లు పడగొట్టిన రికార్డు తన అత్యుత్తమంగా ఉండేది.

టెస్టుల్లో స్టార్క్ అత్యుత్తమ గణాంకాలు
6/48- భారత్ (అడిలైడ్- 2024)
6/50- శ్రీలంక (గాలె- 2016)
6/66- పాకిస్థాన్ (అడిలైడ్- 2019)
6/111- ఇంగ్లండ్ (నాటింగ్‌హమ్- 2015)
6/154- దక్షిణాఫ్రికా (పెర్త్- 2012).

Story first published: Friday, December 6, 2024, 15:30 [IST]
Other articles published on Dec 6, 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+