IND vs AUS: కాన్‌బెర్రాలో జరుగుతున్న మ్యాచ్‌లో ఆస్ట్రేలియా కెప్టెన్ మిచెల్ మార్ష్ టాస్ గెలిచి ముందుగా ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఈ నిర్ణయం ద్వారా అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌ల్లో టాస్ గెలిచిన 18 సందర్భాలలో మార్ష్ ఫీల్డింగ్ ఎంచుకోవడం ఒక ప్రత్యేక రికార్డుగా నమోదైంది.
ఫీల్డింగ్ ఎంచుకున్న అనంతరం ఆసీస్ కెప్టెన్ మిచెల్ మార్ష్ మార్ష్ మాట్లాడుతూ.. "మేము ముందుగా బౌలింగ్ చేయబోతున్నాం. ఇది మంచి పిచ్. కాన్‌బెర్రాకు వచ్చిన ప్రతిసారీ మంచి ఉపరితలం ఉంటుంది. మైదానం అద్భుతంగా ఉంది. ప్రేక్షకులు కూడా పెద్ద సంఖ్యలో వస్తున్నారు, దీని కోసం ఎదురుచూస్తున్నాను" అని మార్ష్ తెలిపాడు. తమ జట్టు దూకుడుగా ఆడుతుందనే విషయంపై మాట్లాడుతూ.. "భారత్ కూడా అలాగే ఆడుతుంది. మా రెండు జట్లలో చాలా మంది హిట్టర్లు ఉన్నారు. భారత్ ప్రపంచంలోనే నంబర్ వన్ ర్యాంక్ జట్టు, కాబట్టి ఈ పోరు కోసం నేను సిద్ధంగా ఉన్నాను" అని అన్నాడు. ప్రపంచకప్‌కు సన్నాహకాల గురించి మాట్లాడుతూ.. "ఇది ఉత్సాహంగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా అన్ని జట్లు ఇప్పుడు ప్రపంచకప్ కోసం తమ ప్లాన్‌లను సిద్ధం చేసుకుంటున్నాయి. ప్రపంచ నంబర్ వన్ జట్టుతో మా బలాన్ని పరీక్షించుకోవడానికి మేము ఉత్సాహంగా ఉన్నాము" అని పేర్కొన్నాడు. జట్టు కూర్పుపై నవ్వుతూ.. "పదకొండు మంది ఆటగాళ్లు - కొందరు బ్యాటర్లు, కొందరు బౌలర్లు, కొందరు ఆల్‌రౌండర్లు. సింపుల్‌గా చెబుతున్నా" అని బదులిచ్చాడు.

సూర్యకుమార్ యాదవ్ అభిప్రాయం
టాస్ ఓడిపోయిన భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ.. "మేము మొదట బ్యాటింగ్ చేయాలనుకున్నాము. ఆట సాగే కొద్దీ వికెట్ కొద్దిగా నెమ్మదిస్తుంది" అని చెప్పాడు. జట్టు గురించి మాట్లాడుతూ.. "వాళ్ళకి ఏం చేయాలో బాగా తెలుసు, వారి పాత్రలు ఏమిటో తెలుసు. ఇది ఒక పెద్ద తలనొప్పి, కానీ ఇది మంచి తలనొప్పి" అని వ్యాఖ్యానించాడు.
ఆస్ట్రేలియా (ప్లేయింగ్ XI):
మిచెల్ మార్ష్(కెప్టెన్), ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్(వికెట్ కీపర్), టిమ్ డేవిడ్, మిచెల్ ఓవెన్, మార్కస్ స్టోయినిస్, జోష్ ఫిలిప్, జేవియర్ బార్ట్‌లెట్, నాథన్ ఎల్లిస్, మాథ్యూ కుహ్నెమన్, జోష్ హేజిల్‌వుడ్.
భారత్ (ప్లేయింగ్ XI):
అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), తిలక్ వర్మ, సంజు శాంసన్(వికెట్ కీపర్), శివమ్ దూబే, అక్షర్ పటేల్, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, జస్‌ప్రీత్ బుమ్రా.
భారత్ తుది జట్టులో లేని ఆటగాళ్లు: రింకూ సింగ్, వాషింగ్టన్ సుందర్, జితేశ్ శర్మ, అర్ష్‌దీప్ సింగ్, నితీష్ కుమార్ రెడ్డి.
నితీష్ కుమార్‌కు గాయం
నితీష్ కుమార్ రెడ్డి మొదటి మూడు టీ20లకు దూరమయ్యాడు. అడిలైడ్‌లో జరిగిన రెండో వన్డే సందర్భంగా అతనికి కండరాల గాయం అయ్యింది. దాని నుంచి కోలుకుంటున్న క్రమంలో అతడు మెడ నొప్పితో బాధపడడంతో నితీష్ రికవరీ, కదలికపై ప్రభావం చూపింది. బీసీసీఐ వైద్య బృందం అతని పురోగతిని పర్యవేక్షిస్తోంది.