For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

మాజీ లెజెండర్ల నోటికి దొరికిన రోహిత్ శర్మ

Rohit Sharma: బోర్డర్- గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్‌తో జరుగుతున్న నాలుగో టెస్ట్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా పట్టు బిగించింది. తొమ్మిది వికెట్లు కోల్పోయినప్పటికీ వెనుకంజ వేయలేదు. ఫైటింగ్ స్పిరిట్ ప్రదర్శిస్తోంది. భారత్‌పై ఏకంగా 333 పరుగుల ఆధిక్యతను సాధించింది.

నాథన్ లియాన్ 54 బంతులను ఎదుర్కొని 41 పరుగులు చేశాడు. ఇందులో ఏకంగా అయిదు ఫోర్లు ఉన్నాయి. స్కాట్ బోలాండ్ 65 బంతులను ఎదుర్కొనడం అంటే అసాధారణ విషయం. ఒక ఫోర్ సహాయంతో 10 పరుగులు చేశాడు. వీరిద్దరూ నాలుగో రోజు నాటౌట్‌గా మిగిలారు. ఇద్దరూ కలిసి 110 బంతులను ఎదుర్కొన్నారు. 55 పరుగులు చేశారు.

IND vs AUS Mark Waugh and Mike Hussey takes a dig at Rohit Sharma for his failure in BGT

ఇది రికార్డ్ పార్ట్‌నర్‌షిప్. తొమ్మిదో వికెట్‌కు 55 పరుగులు చేయడాన్ని అసాధారణంగా భావిస్తోన్నారు క్రీడా పండితులు. 110 బంతులను ఎదుర్కొనడాన్ని అసామాన్యంగా అభివర్ణిస్తోన్నారు. బోలాండ్ వంటి లోయర్ ఆర్డర్ బ్యాటర్ టీమిండియా బౌలర్లను 65 బంతుల పాటు ధీటుగా ఎదుర్కొనడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.

ఈ టెస్ట్ మ్యాచ్ అటు తిరిగి, ఇటు తిరిగి కేప్టెన్ రోహిత్ శర్మకు చుట్టుకుంది. అతని బ్యాటింగ్ వైఫల్యం పట్ల ఆస్ట్రేలియా లెజెండరీ ప్లేయర్లు మండిపడుతున్నారు. రిటైర్ అవ్వడం మంచిందంటూ సలహాలిస్తోన్నారు. పరుగులు గనక చెయ్యకపోతే నాలుగో టెస్ట్ మ్యాచ్ రెండో ఇన్నింగే అతనికి చివరిది అవుతుందని వ్యాఖ్యానించారు.

రోహిత్ శర్మ టెస్ట్ జీవితం ఏమిటనేది రెండో ఇన్నింగ్ డిసైడ్ చేస్తుందని, అందులో కూడా పరుగులు చేయకపోతే అతను రిటైర్ కావడం మంచిదని మార్క్ వా అన్నాడు. తానే గనక సెలెక్టర్ స్థానంలో ఉంటే రెండో ఇన్నింగ్‌లో విఫలమైన రోహిత్ శర్మకు ఉద్వాసన పలుకుతానని, రోహిత్ శర్మ స్థానంలో జస్‌ప్రీత్ బుమ్రాను కేప్టెన్‌గా అపాయింట చేస్తానని చెప్పాడు.

చివరి 14 ఇన్నింగ్‌లల్లో రోహిత్ శర్మ యావరేజ్ 11 మాత్రమేనని మార్క్ వా గుర్తు చేశాడు. ఇది అతని వైఫల్యానికి అద్దం పట్టిందని అన్నాడు. ప్రతి ఒక్క గొప్ప బ్యాటర్ కూడా ఏదో ఒక దశలో కేరీర్ చరమాంకానికి చేరుకోక తప్పదనీ తేల్చి చెప్పాడు.

ఆస్ట్రేలియాకే చెందన మరో మాజీ క్రికెటర్ మైక్ హస్సీ కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశాడు. నంబర్లు అబద్ధం చెప్పవని అన్నాడు. రోహిత్ శర్మ టెస్ట్ ఫార్మట్‌లో ఎంతగా విఫలం అయ్యాడనేది ఈ మధ్యకాలంలో అతను చేసిన పరుగులే స్పష్టం చెబుతున్నాయని పేర్కొన్నాడు. ఫీల్డ్‌లో కూడా మందకొడిగా కదులుతున్నాడని, వేగం తగ్గిందని అన్నాడు.

Story first published: Sunday, December 29, 2024, 16:53 [IST]
Other articles published on Dec 29, 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+