IND vs AUS: కోహ్లి కొంపముంచిన అలసత్వం.. సేమ్ సేమ్ బట్ డిఫరెంట్! (Video)
అడిలైడ్ వేదికగా జరుగుతున్న డే/నైట్ టెస్టు మొదటి రోజు తొలి సెషన్‌లో భారత్‌పై ఆస్ట్రేలియా ఆధిపత్యం చెలాయింది. ఇన్నింగ్స్ ప్రారంభంలోనే టీమిండియాను దెబ్బకొట్టింది. యశస్వీ జైస్వాల్‌ను మిచెల్ స్టార్క్ తొలి బంతికే వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. ఆ తర్వాత కేఎల్ రాహుల్ (37; 64 బంతుల్లో, 6 ఫోర్లు)- శుభ్‌మన్ గిల్ (31; 51 బంతుల్లో, 5 ఫోర్లు) ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశారు.
రెండో వికెట్‌కు రాహుల్-గిల్ 69 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. అయితే 69/1తో ఉన్న టీమిండియా టీ విరామానికి 81 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది. గిల్‌ను బొలాండ్ ఔట్ చేశాడు. కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లి (7; 8 బంతుల్లో, 1 ఫోర్)ని స్టార్క్ పెవిలియన్‌కు చేర్చాడు. అయితే రాహుల్- కోహ్లిని ఒకే రీతిలో ఔట్ చేశాడు. స్టార్క్ వేసిన బంతిని అంచనా వేయడంలో విఫలమై మెక్‌స్వీనె చేతికి చిక్కాడు. కాస్త ఎక్స్‌ట్రా బౌన్స్‌ను ఆడకుండా వదిలేయాని ఆలస్యంగా భావించి వెనుదిరిగాడు.

విరాట్ కోహ్లి కూడా అదే రీతిలో ఔటయ్యాడు. బంతిని వదిలేయాలని ఆలస్యంగా భావించి స్లిప్‌లో ఉన్న స్టీవ్ స్మిత్‌కు క్యాచ్ ఇచ్చాడు. పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లోనూ కోహ్లి ఇదే తరహాలో ఔటయ్యాడు. హేజిల్‌వుడ్ వేసిన ఎక్స్‌ట్రా బౌన్స్‌ను వదిలేయాలని ఆఖర్లో భావించి స్లిప్‌లో దొరికిపోయాడు. తన అలసత్వంతో కోహ్లి వరుస టెస్టుల్లో వికెట్లు చేజార్చుకున్నాడు.
కాగా, ప్రస్తుతం క్రీజులో రోహిత్ శర్మ, రిషభ్ పంత్ క్రీజులో ఉన్నారు. రెండో సెషన్‌లో ఈ సంధ్య సమయంలో గులాబీ బంతితో బ్యాటింగ్ సవాలుగా ఉంటుంది. దీనికి తోడుగా టీ విరామంలో చిన్నపాటి జల్లులు కురిశాయి. వాతావరణం మేఘావృతంగా ఉండటంతో ఆస్ట్రేలియా పేసర్లు మరింత రెచ్చిపోయే అవకాశం ఉంటుంది. అయిదు టెస్టులో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో తొలి మ్యాచ్‌లో భారత్ 295 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే.
Mitchell Starc sends Virat Kohli packing!#AUSvIND pic.twitter.com/2AzNllS7xT
— cricket.com.au (@cricketcomau) December 6, 2024
Extra bounce from Hazlewood - Kohli's back in the sheds for five #AUSvIND pic.twitter.com/6M5DjgOqrV
— cricket.com.au (@cricketcomau) November 22, 2024
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications