Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

'నేను ఎంత చెప్పిన వినలేదు'- కోహ్లీపై మండిపడ్డ కేఎల్ రాహుల్! (వీడియో వైరల్)

ఛాంపియన్స్ ట్రోఫీ 2025 సెమీఫైనల్ లో విజయం సాధించి భారత్ ఫైనల్ కు దూసుకెళ్లడానికి శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, హార్దిక్‌ పాండ్య, విరాట్ కోహ్లీ కీలకంగా వ్యవహరించారు. అయితే ఈ పోరులో కోహ్లీ - కేఎల్ రాహుల్ కలిసి కాసేపు స్కోర్ బోర్డును ముందుకు తీసుకెళ్లారు. అయితే ఓ సందర్భంలో కోహ్లీపై కేఎల్ రాహుల్ కాస్త కోపడ్డాడు. ఎందుకు అలా చేశావంటూ మండిపడ్డాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

అసలేం జరిగిందంటే?
పాకిస్థాన్ పై సెంచరీ బాదిన కోహ్లీ.. ఆసీస్ సెమీఫైనల్ మ్యాచ్ లోనూ శతకం బాదుతాడని అంతా ఆశించారు. అందుకు తగ్గట్టే అతడు మంచి ప్రదర్శనే చేశాడు. అయితే భారత్‌ విజయానికి 40 పరుగుల దూరంలో ఉన్న సమయంలో కాస్త దూకుడు ప్రదర్శించి తృటిలో సెంచరీని మిస్ చేసుకున్నాడు కోహ్లీ. జంపా బౌలింగ్‌లో అనవసర షాట్‌ ఆడి 43వ ఓవర్లో పెవిలియన్ చేరాడు. అప్పుడు వెంటనే కోహ్లీతో పాటు మరో ఎండ్ లో ఉన్న కేఎల్ రాహుల్ కాస్త అసహనానికి గురయ్యాడు. 'నీకు ముందే చెప్పా కదా చివరి వరకు నువ్వు క్రీజులో ఉండాల'ని అంటూ కాస్త కోహ్లీపై కోపడ్డాడు. తాను ఎంత చెప్పినా వినకుండా విరాట్ అనవసర షాట్ బాది ఔటైనట్లు ఆ తర్వాత వివరించాడు.

IND VS AUS KL Rahul upset on Kohli out says I was hitting Man in champions trophy 2025 semifinal

దీనిపై మ్యాచ్ అనంతరం కేఎల్ రాహుల్ మాట్లాడుతూ.. "క్రీజులోకి రాగానే కోహ్లీతో కాసేపు మాట్లాడాను. ఆఖరి వరకు క్రీజులోనే ఉండాలని చెప్పాను. నువ్వు ఓవైపు ఎండ్‌లో ఉంటే.. నేను మరోవైపు ఎండ్‌లో రిస్క్ తీసుకొని షాట్లు ఆడతాను అని చెప్పాను. అతడు సెట్ బ్యాటర్. కాబట్టి క్రీజులో ఉండటం జట్టుకు ఎంతో అవసరం. అతడితోనూ ఇదే చెప్పాను. రిస్క్ నేను తీసుకుని షాట్లు ఆడతానని చెప్పాను. కానీ అతడే తొందరపడి జంపా బౌలింగ్ లో బంతిని బలంగా బాది ఔట్ అయ్యాడు." అని రాహుల్ వివరణ ఇచ్చాడు. విరాట్ కోహ్లీ ఔట్ అవ్వగానే గౌతమ్ గంభీర్‌ కూడా కాస్త నిరాశకు గురైనట్లు ఎక్స్‌ప్రెషన్ ఇచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి.

Story first published: Wednesday, March 5, 2025, 11:23 [IST]
Other articles published on Mar 5, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+