Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs AUS: టీమిండియాకు గుడ్‌న్యూస్.. తొలి టెస్టుకు సిద్ధమైన స్టార్ బ్యాటర్!

సొంతగడ్డపై న్యూజిలాండ్ చేతిలో ఘోర పరాజయాన్ని చవిచూసిన భారత్ మరో టెస్టు సిరీస్ సమరానికి సిద్ధమవుతోంది. నవంబర్ 22 నుంచి ఆస్ట్రేలియాతో అయిదు టెస్టుల సిరీస్ ఆడనుంది. వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ (2024-25)లో టీమిండియాకు ఇదే చివరి సిరీస్. ముచ్చటగా మూడోసారి డబ్ల్యూటీసీ ఫైనల్‌‌కు చేరాలంటే రోహిత్ సేన‌కు ఈ సిరీస్ అత్యంత కీలకం.

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని కనీసం 4-0తో విజయం సాధిస్తే ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడకుండా భారత్ ఫైనల్‌కు చేరుకోగలదు. మరోవైపు ఆస్ట్రేలియాకు ఈ సిరీస్ ఎంతో కీలకం కానుంది. శ్రీలంక సిరీస్‌తో కలిపి ఆడాల్సిన ఏడు మ్యాచ్‌ల్లో అయిదు విజయాలు సాధించాల్సి ఉంది. అయితే సిరీస్ ప్రారంభంకాక ముందే టీమిండియాకు వరుసగా ఎదురుదెబ్బలు తగిలిన విషయం తెలిసిందే. శుభ్‌మన్ గిల్‌కు బొటనవేలులో విరిగింది. స్లిప్‌లో ఫీల్డింగ్ చేస్తుండగా తీవ్ర గాయమైంది. పెర్త్ వేదికగా జరిగే తొలి టెస్టుకు దూరం కానున్నాడు.

IND vs AUS KL Rahul Returns to Nets After Injury Scare Ahead of BGT Opener

గిల్ కంటే ముందు కేఎల్ రాహుల్‌కు కూడా గాయమైంది. ప్రసిధ్ కృష్ణ బౌలింగ్‌ను ఎదుర్కొనే క్రమంలో రాహుల్ మోచేతికి దెబ్బ తగిలింది. ఇక రెండో సారి తండ్రి అయిన కెప్టెన్ రోహిత్ శర్మ మరికొన్ని రోజులు కుటుంబంతో గడపాలనుకుంటున్నాడు. దీంతో సారథి కూడా తొలి టెస్టుకు దూరం కానున్నాడు. ఈ నేపథ్యంలో టీమిండియా టాప్ ఆర్డర్ బలహీనంగా మారింది. అయితే ఈ పరిస్థితుల్లొ కేఎల్ రాహుల్ పూర్తిగా కోలుకున్నాడు. ఆదివారం బ్యాటింగ్‌కు కూడా వచ్చాడు. తిరిగి పూర్తిస్థాయిలో సాధన చేశాడు. లయను అందిపుచ్చుకోవడానికి తీవ్రంగా చెమటోడ్చాడు. దీంతో యశస్వీ జైస్వాల్‌తో కలిసి ఓపెనర్‌గా లేదా వన్‌డౌన్‌లో రాహుల్ బరిలోకి దిగడం ఖాయంగా అనిపిస్తోంది.

ఆస్ట్రేలియాతో అయిదు టెస్టుల సిరీస్ షెడ్యూల్
నవంబర్ 22-26: తొలి టెస్టు- పెర్త్ (ఉదయం 7.30)
డిసెంబర్ 06-10: రెండో టెస్టు (డే/నైట్)- అడిలైడ్ (ఉదయం 9.30)
డిసెంబర్ 14-18: మూడో టెస్టు- బ్రిస్బేన్ (ఉదయం 5.50)
డిసెంబర్ 26-31: నాలుగో టెస్టు- మెల్‌బోర్న్ (ఉదయం 5 గంటలకు)
జనవరి 03-08: అయిదో టెస్టు- సిడ్నీ (ఉదయం 5 గంటలకు).

భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వీ జైస్వాల్, శుభ్‌‌మన్ గిల్, అభిమన్యు ఈశ్వరన్, విరాట్ కోహ్లి, సర్ఫరాజ్ ఖాన్, వాషింగ్టన్ సుందర్, నితీశ్ కుమార్ రెడ్డి, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, రిషభ్ పంత్, కేఎల్ రాహుల్, ధ్రువ్ జురెల్, జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ప్రసిధ్ కృష్ణ, హర్షిత్ రాణా, ఆకాశ్ దీప్.

Story first published: Sunday, November 17, 2024, 13:54 [IST]
Other articles published on Nov 17, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+