Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs AUS: థర్డ్ అంపైర్ తప్పిదానికి కేఎల్ రాహుల్ బలి! (Video)

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా పెర్త్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో భారత్‌పై ఆస్ట్రేలియా ఆధిపత్యం చెలాయిస్తోంది. ఆసీస్ ఫాస్ట్ బౌలర్ల ధాటికి మొదటి రోజు తొలి సెషన్ ముగిసేసరికి టీమిండియా 25 ఓవర్లకు నాలుగు వికెట్లు కోల్పోయి 51 పరుగులు చేసింది. ఓపెనర్ యశస్వీ జైస్వాల్, వన్‌డౌన్‌లో వచ్చిన దేవదత్ పడిక్కల్ డకౌటయ్యారు.

విరాట్ కోహ్లి (5; 12 బంతుల్లో) మరోసారి తక్కువ స్కోరుకే వెనుదిరిగాడు. క్రీజులో కుదురుకున్న కేఎల్ రాహుల్ (26; 74 బంతుల్లో, 3 ఫోర్లు) తొలి సెషన్ ఆఖర్లో పెవిలియన్‌కు చేరాడు. హేజిల్‌వుడ్, మిచెల్ స్టార్క్ చెరో రెండు వికెట్లు తీశాడు. అయితే కేఎల్ రాహుల్ ఔటైన తీరు వివాదాస్పదంగా మారింది. స్పష్టమైన ఆధారాలు లేనప్పటికీ రాహుల్ ఔట్‌గా థర్డ్ అంపైర్ తీసుకున్న నిర్ణయంపై పెద్దఎత్తున విమర్శలు వస్తున్నాయి.

IND vs AUS KL Rahul Expresses Frustration Over Controversial DRS Call in Perth Test

మిచెల్ స్టార్క్ వేసిన బౌలింగ్‌లో కేఎల్ రాహుల్ డిఫెన్స్‌కు ప్రయత్నించాడు. అయితే బంతి బ్యాటుకు తాకుతూ వెళ్లిందని ఆస్ట్రేలియా ప్లేయర్లు అపీలు చేశారు. కానీ ఫీల్డ్ అంపైర్లు ఔట్ ఇవ్వలేదు. దీంతో ఆసీస్ సమీక్షను కోరింది. థర్డ్ అంపైర్ స్నికో మీటర్ ఆధారంగా ఔట్‌ను పరిశీలించాడు. అయితే బ్యాటు సమీపం నుంచి బంతి వెళ్తున్న సమయంలోనే రాహుల్ బ్యాట్ తన ప్యాడ్లకు తాకింది. దీంతో స్నికోలో స్పైక్ చూపించింది.

బ్యాటుకు బంతి తాకినందుకు అలా వచ్చిందా? లేదా ప్యాడ్లకు బ్యాటు తాకినందుకు స్నికో మీటర్ రీడింగ్ చూపించిందా? అనే విషయం గందరగోళంగా మారింది. కానీ థర్డ్ అంపైర్ ఫ్రంట్ వ్యూతో పరిశీలించి..బంతి దిశలో డిఫ్లెక్షన్ వచ్చిందని భావించి ఔట్‌గా ఇచ్చాడు. ఈ ఆధారంగా థర్డ్ అంపైర్ ఔట్ ఇవ్వడంపై కేఎల్ రాహుల్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. నిరాశగా మైదానం వైపు కదిలాడు. కాగా, కుదురుకున్న రాహుల్ ఔటవ్వడం టీమిండియాకు ఊహించని ఎదురు దెబ్బ. ప్రస్తుతం క్రీజులో రిషభ్ పంత్, ధ్రువ్ జురెల్ ఉన్నారు.

Story first published: Friday, November 22, 2024, 10:45 [IST]
Other articles published on Nov 22, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+