Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs AUS: ఆస్ట్రేలియాకు బిగ్ షాక్.. స్టార్ పేసర్ దూరం

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఆరంభ మ్యాచ్‌లో ఘోర పరాజయం చవిచూసిన ఆస్ట్రేలియా‌కు బిగ్ షాక్ తగిలింది. గాయం కారణంగా ఆ జట్టు స్టార్ ఫాస్ట్ బౌలర్ జోష్ హేజిల్‌వుడ్ రెండో జట్టుకు దూరమయ్యాడు. పక్కటెముకల గాయంతో ఇబ్బంది పడుతున్న హేజిల్‌వుడ్ సిరీస్‌లోని మిగిలిన టెస్టులకు అందుబాటులో ఉండటం అనుమానమే.

తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో హేజిల్‌వుడ్ నాలుగు వికెట్లతో చెలరేగాడు. రెండో ఇన్నింగ్స్‌లో ఒక్క వికెట్ సాధించాడు. రెండో టెస్టు‌కు వేదిక అయిన అడిలైడ్‌లో ఈ కుడిచేతి వాటం పేసర్‌కు మంచి రికార్డు ఉంది. అడిలైడ్ వేదికగా భారత్‌తో ఆడిన గత మ్యాచ్‌లో హేజిల్‌వుడ్ 5 ఓవర్లలో 8 పరుగులే ఇచ్చి అయిదు వికెట్లు పడగొట్టాడు. ఈ మ్యాచ్‌లో టీమిండియా 36 పరుగులకే ఆలౌటైంది.

IND vs AUS Josh Hazlewood Ruled Out of Adelaide Pink-Ball Test Due to Side Strain

హేజిల్‌వుడ్ స్థానంలో అన్‌క్యాపడ్ పేసర్లు సీన్ అబాట్, బ్రెండన్ డెగాట్ ఎంపికయ్యారు. కాగా, హేజిల్‌వుడ్ స్థానంలో స్కాట్ బొలాండ్ తుదిజట్టులో స్థానం దక్కించుకునే అవకాశం కలిగింది. ఇవాళ భారత్‌తో జరగనున్న వార్మప్ మ్యాచ్‌లో ప్రైమ్ మినిష్టర్స్ XIకి బొలాండ్ ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. 2023 లీడ్స్‌లో చివరిసారిగా బొలాండ్ ఆసీస్ తుదిజట్టులో ఆడాడు. మరోవైపు హేజిల్‌వుడ్ స్థానంలో ఎంపికైన అబాట్, డెగాట్ 2018లో పాకిస్థాన్ సిరీస్ కోసం యూఏఈ పర్యటనకు కూడా ఎంపికయ్యారు. కానీ తుదిజట్టులో ఆడే అవకాశం దక్కలేదు. అడిలైడ్ వేదికగా డిసెంబర్ 6 నుంచి పింక్ బాల్‌తో రెండో టెస్టు ప్రారంభం కానుంది.

రెండో టెస్టుకు ఎంపికైన ఆస్ట్రేలియా: పాట్ కమిన్స్ (కెప్టెన్), స్కాట్ బొలాండ్, అలెక్స్ కేరీ, ట్రావిస్ హెడ్, జోష్‌ ఇంగ్లిస్, ఉస్మాన్ ఖావాజా, మార్నస్ లబుషేన్, నాథన్ లైయన్, మిచెల్ మార్ష్, నాథన్ మెక్‌స్వీనే, స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్, బ్యూ వెబ్‌స్టర్, సీన్ అబాట్, బ్రెండన్ డెగాట్.

ఆస్ట్రేలియాతో అయిదు టెస్టుల సిరీస్ షెడ్యూల్
నవంబర్ 22-26: తొలి టెస్టు- భారత్ 295 పరుగుల తేడాతో విజయం
డిసెంబర్ 06-10: రెండో టెస్టు (డే/నైట్)- అడిలైడ్ (ఉదయం 9.30)
డిసెంబర్ 14-18: మూడో టెస్టు- బ్రిస్బేన్ (ఉదయం 5.50)
డిసెంబర్ 26-31: నాలుగో టెస్టు- మెల్‌బోర్న్ (ఉదయం 5 గంటలకు)
జనవరి 03-08: అయిదో టెస్టు- సిడ్నీ (ఉదయం 5 గంటలకు).

Story first published: Saturday, November 30, 2024, 8:04 [IST]
Other articles published on Nov 30, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+