IND vs AUS: చరిత్ర సృష్టించిన బుమ్రా.. ఆల్‌టైమ్ వరల్డ్ రికార్డ్!
గబ్బా వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టులో భారత్ ఎట్టకేలకు తిరిగి కాస్త పోటీలోకి వచ్చింది. జస్‌ప్రీత్ బుమ్రా మరోసారి జట్టును ఆదుకున్నాడు. ప్రత్యర్థి ముందు సహచర బౌలర్లు నిస్సహాయులైన స్థితిలో అయిదు వికెట్లతో చెలరేగాడు. శతకాలతో కుదురుకున్న బ్యాటర్లు ట్రావిస్ హెడ్ (152; 160 బంతుల్లో, 18 ఫోర్లు), స్టీవ్ స్మిత్ (101; 190 బంతుల్లో, 12 ఫోర్లు)లను పెవిలియన్‌కు చేర్చాడు.
అయితే ఈ క్రమంలో బుమ్రా అరుదైన ఘనత సాధించాడు. విదేశాల్లో టెస్టు ఫార్మాట్‌లో అత్యధిక సార్లు అయిదు వికెట్ల ఘనతను అందుకున్న భారత ఫాస్ట్ బౌలర్‌గా చరిత్రకెక్కాడు. అంతకుముందు ఈ రికార్డు కపిల్ దేవ్‌తో బుమ్రా సంయుక్తంగా పంచుకున్నాడు. వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్ కపిల్ దేవ్ విదేశాల్లో 10 సార్లు అయిదు వికెట్లు సాధించగా బుమ్రా 11 సార్లు పడగొట్టాడు. ఓవరాల్‌గా టెస్టుల్లో ఓ ఇన్నింగ్స్‌ల్లో బుమ్రా అయిదు వికెట్లు తీయడం ఇది 12వ సారి. ఈ సిరీస్‌లో రెండో సారి. పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్టులోనూ బుమ్రా 5 వికెట్లు తీశాడు. బుమ్రా 43 టెస్టుల్లో 190 వికెట్లు పడగొట్టాడు.

ఇక మ్యాచ్ విషయానికొస్తే.. ఆస్ట్రేలియా ఆరు వికెట్లు కోల్పోయి 353 పరుగులు చేసింది. ట్రావిస్ హెడ్, స్టీవ్ స్మిత్ శతకాలు సాధించారు. 28/0 ఓవర్‌నైట్ స్కోరుతో ఇవాళ ఆట ఆరంభించిన ఆసీస్ ఆదిలోనే రెండు వికెట్లు కోల్పోయింది. ఓపెనర్లును జస్‌ప్రీత్ బుమ్రా పెవిలియన్‌కు చేర్చాడు. 16వ ఓవర్ మొదటి బంతికి ఉస్మాన్ ఖవాజా (21; 54 బంతుల్లో, 4 ఫోర్లు)ను ఔట్ చేశాడు. ఫార్వర్డ్ డిఫెన్స్‌కు ప్రయత్నించి ఖవాజా వికెట్ కీపర్ రిషభ్ పంత్ చేతికి చిక్కాడు.
తన తర్వాతి ఓవర్‌లోనే మరో ఓపెనర్ మెక్‌స్వీనె (9; 49 బంతుల్లో, 1 ఫోర్)ని కూడా బుమ్రా బోల్తాకొట్టించాడు. బ్యాక్ ఫుట్ డిఫెన్స్‌కు ప్రయత్నించిన మెక్‌స్వీనె సెకండ్ స్లిప్‌లో ఉన్న కోహ్లి చేతికి చిక్కాడు. లబుషేన్ (12; 55 బంతుల్లో)ను నితీశ్ రెడ్డి ఔట్ చేశాడు. అయితే ఈ దశలో బ్యాటింగ్‌కు వచ్చిన ట్రావిస్ హెడ్ ఇన్నింగ్స్ స్వరూపాన్ని మార్చాడు. స్టీవ్ స్మిత్‌తో కలిసి 241 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు.
Jasprit Bumrah gets Travis Head to bring up his fifth wicket! #AUSvIND | #MilestoneMoment | @nrmainsurance pic.twitter.com/2QGUazarZP
— cricket.com.au (@cricketcomau) December 15, 2024
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications