Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

శని నెత్తిన తాండవం చేస్తోంటే ఎవరేం చేయగలరు: చివరి బ్యాటర్ అవుట్ అయినా..!!

Bumrah No ball: బోర్డర్- గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్‌తో జరుగుతున్న నాలుగో టెస్ట్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా పట్టు బిగించింది. తొమ్మిది వికెట్లు కోల్పోయినప్పటికీ వెనుకంజ వేయలేదు. ఫైటింగ్ స్పిరిట్ ప్రదర్శిస్తోంది. భారత్‌పై ఏకంగా 333 పరుగుల ఆధిక్యతను సాధించింది.

నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా 9 వికెట్ల నష్టానికి 228 పరుగులు చేసింది. ఇంకా ఒక వికెట్ మిగిలేవుండటంతో ఈ ఆధిక్యత మరింత పెరగడం ఖాయం. అయిదో రోజు తొలి సెషన్‌లోనే వికెట్ తీయగలిగితే ఆస్ట్రేలియా ఆధిక్యతకు అక్కడితో బ్రేకులు పడినట్టవుతుంది.

IND vs AUS Jasprit Bumrah gets Nathan Lyon but its no ball

చిట్టచివరి బ్యాటర్లు నాథన్ లియాన్, స్కాట్ బోలాండ్.. క్రీజ్‌లో పాతుకుపోయారు. బౌలర్ల సహనానికి అసలు సిసలు పరీక్ష పెడుతున్నారు. ఇద్దరూ కలిసి ఒక్కో పరుగును స్కోర్ బోర్డ్‌పై జత చేశారు. 65వ ఓవర్‌లో ఎనిమిదో వికెట్ పడితే 82 ఓవర్ ముగిసేంత వరకూ మరో వికెట్ పడలేదు. ఇన్ని ఓవర్లను లియాన్, బోలాండ్ ఎదుర్కొన్నారంటే మాటలు కాదు.

నాథన్ లియాన్ 54 బంతులను ఎదుర్కొని 41 పరుగులు చేశాడు. ఇందులో ఏకంగా అయిదు ఫోర్లు ఉన్నాయి. స్కాట్ బోలాండ్ 65 బంతులను ఎదుర్కొనడం అంటే అసాధారణ విషయం. ఒక ఫోర్ సహాయంతో 10 పరుగులు చేశాడు. వీరిద్దరూ నాలుగో రోజు నాటౌట్‌గా మిగిలారు. ఇద్దరూ కలిసి 110 బంతులను ఎదుర్కొన్నారు. 55 పరుగులు చేశారు.

ఇన్నింగ్ చివరి ఓవర్‌లో హైడ్రామా చోటు చేసుకుంది. నాలుగో బంతికి నాథన్ లియాన్ అవుట్ అయ్యాడు. కానీ అది నో బాల్. బుమ్రా వేసిన లెంగ్తీ డెలివరీని డిఫెన్స్ ఆడాడు లియాన్. థిక్ ఎడ్జ్ తీసుకున్న ఆ బంతి థర్డ్ స్లిప్ వైపు గాల్లోకి ఎగిరింది. అక్కడే ఉన్న కేఎల్ రాహుల్ దాన్ని అందుకున్నాడు. అక్కడితో ఇన్నింగ్‌కు తెరపడిందని అందరూ భావించినప్పటికీ అది నో బాల్ అయింది.

Story first published: Sunday, December 29, 2024, 13:01 [IST]
Other articles published on Dec 29, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+