For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

గాయాలు లేకుండా కెరీర్ కొనసాగించడం అసాధ్యం: విలేకరులతో కోహ్లీ

Ind vs Aus: Its impossible to keep going without niggles, says Virat Kohli while playing down injury fears

హైదరాబాద్: అంతర్జాతీయ క్రికెట్‌లో నిత్యం ఫిట్‌గా ఉండే క్రికెటర్లలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఒకడు. తాను ఫిట్‌గా ఉండటంతో పాటు జట్టులోని సహచర క్రికెటర్ల సైతం ఫిట్‌గా ఉండాలంటూ సూచిస్తాడు. కోహ్లీ ఫిట్‌నెస్ గురించి, తన శరీరాన్ని ఫిట్‌గా ఉంచుకునేందుకు ఎక్కువ సమయం జిమ్‌లోనే గడుపుతుంటాడు.

అయితే, కెరీర్ తొలి నాళ్లలో తాను గాయాల బారిన పడినవాడినేనని తాజాగా కోహ్లీ చెప్పుకొచ్చాడు. తనకు ఉన్న వెన్ను నొప్పి సమస్యను తేలిగ్గా తీసుకున్నట్లు చెప్పుకొచ్చాడు. నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో చివరి టెస్టు సిడ్నీ వేదికగా గురువారం ప్రారంభం కానుంది.

మీడియా సమావేశంలో కోహ్లీ

మీడియా సమావేశంలో కోహ్లీ

ఈ నేపథ్యంలో బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో కోహ్లీ మాట్లాడుతూ తరచూ వెన్ను నొప్పి వేధిస్తుండటం తన కెరీర్‌ను దెబ్బ తీస్తుందన్న వాదనను తోసిపుచ్చాడు. క్రికెటర్లకు ఇలాంటి చిన్న చిన్న గాయాలు కొత్తేమీ కాదని కోహ్లీ పేర్కొన్నాడు. మెల్‌బోర్న్ టెస్ట్‌లో కోహ్లీని మైదానంలోనే వెన్ను నొప్పి వేధించడంతో ఫిజియో సాయం తీసుకున్న సంగతి తెలిసిందే.

నొప్పి 2011 నుంచే ఉందన్న కోహ్లీ

అయితే తనకు ఈ వెన్ను నొప్పి 2011 నుంచే ఉందని, ఇదేమీ కొత్త కాదని కోహ్లీ చెప్పాడు. కోహ్లీ మాట్లాడుతూ "కొన్నేళ్లుగా శారీరకంగా దృఢంగా ఉండేందుకు నేను చేస్తున్న కసరత్తుల కారణంగా ఆ నొప్పిని భరించగలుగుతున్నా. ఈ గాయాలపై తాను పెద్దగా దృష్టి సారించడం లేదు. ఈ నొప్పికి చెక్ పెట్టడానికి కొత్త మార్గాలను కూడా తాను అన్వేషిస్తున్నా" అని అన్నాడు.

గాయాలు లేకుండా కెరీర్ కొనసాగించడం అసాధ్యం

గాయాలు లేకుండా కెరీర్ కొనసాగించడం అసాధ్యం

ఎలాంటి గాయాలు లేకుండా కెరీర్ కొనసాగించడం అసాధ్యమని, ఇలాంటి చిన్న చిన్న గాయాలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని చెప్పిన కోహ్లీ... అవి పెద్దవి కాకుండా చూసుకుంటే చాలని అన్నాడు. కాగా, వెన్ను నొప్పి కారణంగా ఈ ఏడాది ఇంగ్లాండ్ పర్యటనలో ఒకే ఒక్క మ్యాచ్‌కు కోహ్లీ దూరమయ్యాడు.

 నాలుగో టెస్టులో విజయం సాధించి

నాలుగో టెస్టులో విజయం సాధించి

ఇదిలా ఉంటే, సిడ్నీ వేదకగా జరగనున్న నాలుగో టెస్టులో విజయం సాధించి చరిత్ర సృష్టించాలని కోహ్లీ ఆరాటపడుతున్నాడు. 1977-78లో 2-2తో సమంగా ఉన్న స్థితిలో ఐదో మ్యాచ్‌లో ఓడి సిరీస్‌ను కోల్పోయింది. ఆ తర్వాత 2003-04 ఆసీస్‌ పర్యటనలో నాలుగు టెస్టుల సిరీస్‌లో రెండో టెస్టును గెలిచిన టీమిండియా 1-0తో పైచేయి సాధించింది.

చరిత్ర సృష్టిస్తుందా?

చరిత్ర సృష్టిస్తుందా?

అయితే, తర్వాతి దాంట్లో ఓడిపోవడంతో ఆధిక్యాన్ని చేజార్చుకుంది. ఈ సిరీస్‌లో మొదటి, నాలుగో టెస్టులు డ్రాగా ముగియడంతో సిరిస్ ఫలితం 1-1గా మారింది. ఆసీస్ గడ్డపై ఇప్పటి వరకు ఈ రెండు మాత్రమే భారత్‌ సిరీస్‌ విజయానికి చేరువగా వచ్చిన సందర్భాలు. అయితే, ఇప్పుడు స్పష్టమైన ఆధిక్యంతో సిడ్నీలో గురువారం ఆతిథ్య జట్టుతో అడబోతోంది. ఈ మ్యాచ్‌ను డ్రా చేసుకున్నా టీమిండియా చరిత్ర తిరగరాసినట్లవుతుంది.

Story first published: Wednesday, January 2, 2019, 16:21 [IST]
Other articles published on Jan 2, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+