
హైదరాబాద్: న్యూజిలాండ్ వేదికగా జరుగుతోన్న అండర్-19 వరల్డ్ కప్‌లో భారత యువ జట్టు బోణి అదిరింది. గ్రూప్-బిలో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి మ్యాచ్‌లో యువ జట్టు 100 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
మూడుసార్లు ప్రపంచకప్ విజేతగా నిలిచిన భారత్.. ఆసీస్‌పై విజయంతో ఈ టోర్నీలో ఘనంగా శుభారంభం చేసింది.
భారత్ నిర్దేశించిన 329 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో ఆస్ట్రేలియా 42.5 ఓవర్లలోనే 228 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్ ఎడ్వర్డ్ 73, హోల్ట్ 39, జొనాథన్ 38, మ్యాక్స్ బ్రాంట్ 29 పరుగులతో రాణించగా.. మిగతా బ్యాట్స్‌మన్ తక్కువ స్కోరుకే పెవిలియన్‌కు చేరారు. భారత బౌలర్లలో శివమ్ మావి, నాగర్‌కోటి చెరో మూడు వికెట్లు తీయగా.. అభిషేక్ శర్మ, సుధాకర్ రాయ్ తలో వికెట్ తీశారు.
భారత్ 328/7
అంతకముందు ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 328 పరుగులు చేసింది. తద్వారా అండర్-19 వరల్డ్ కప్‌లో ఆస్ట్రేలియాపై 300కి పైగా పరుగులు చేసిన తొలి జట్టుగా యువ భారత జట్టు రికార్డ్ సృష్టించింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్... కెప్టెన్ పృథ్వీషా, మన్‌జోత్, శుభ్‌మన్ గిల్ హాఫ్ సెంచరీలతో చెలరేగడంతో భారీ స్కోరు చేసింది.
ఓపెనర్లుగా బరిలోకి దిగిన పృథ్వీ షా(94), మన్‌జోత్(86) చెలరేగి ఆడారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 180 పరుగుల భాగస్వామ్యాన్ని జోడించారు. సెంచరీకి చేరువైన కెప్టెన్ పృథ్వీ షా 30వ ఓవర్‌లో సుదర్‌లాండ్ బౌలింగ్‌లో హోల్ట్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరగడంతో తృటిలో సెంచరీని మిస్సయ్యాడు.
అనంతరం క్రీజులోకి వచ్చిన శుబ్‌మన్‌గిల్(63) కూడా దూకుడుగా ఆడి స్కోరు బోర్డుని పరిగెత్తించాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన భారత బ్యాట్స్‌మెన్లలో అభిషేక్ శర్మ 23, రాణా 14, నగర్‌కోటి 11, శివసింగ్ 10, జుయల్ 8, రాయ్ 6 పరుగులు చేశారు. ఆస్ట్రేలియా బౌలర్లలో ఎడ్వర్డ్ 4 వికెట్లు తీసుకోగా సుదర్‌లాండ్, ఉప్పల్, వా తలో వికెట్ తీసుకున్నారు.
జట్ల వివరాలు:
భారత్: Prithvi Shaw (C), Shubman Gill, Aryan Juyal, Abhishek Sharma, Arshdeep Singh, Harvik Desai, Manjot Kalra, Kamlesh Nagarkoti, Pankaj Yadav, Riyan Parag, Ishan Porel, Himanshu Rana, Anukul Roy, Shivam Mavi, Shiva Singh.
ఆస్ట్రేలియా: Jason Sangha (C), Will Sutherland, Xavier Bartlett, Max Bryant, Jack Edwards, Zak Evans, Jarrod Freeman, Ryan Hadley, Baxter Holt, Nathan McSweeney, Jonathan Merlo, Lloyd Pope, Jason Ralston, Param Uppal, Austin Waugh.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.