For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

మెల్‌బోర్న్‌లో చెక్కు చెదరని 1928 నాటి ఛేజింగ్ రికార్డ్: మనం గెలిస్తే 10 తరాల పాటు చెప్పుకోవచ్చు

Bumrah no ball: బోర్డర్- గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్‌తో జరుగుతున్న నాలుగో టెస్ట్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా పట్టు బిగించింది. తొమ్మిది వికెట్లు కోల్పోయినప్పటికీ వెనుకంజ వేయలేదు. ఫైటింగ్ స్పిరిట్ ప్రదర్శిస్తోంది. భారత్‌పై ఏకంగా 333 పరుగుల ఆధిక్యతను సాధించింది.

నాథన్ లియాన్ 54 బంతులను ఎదుర్కొని 41 పరుగులు చేశాడు. ఇందులో ఏకంగా అయిదు ఫోర్లు ఉన్నాయి. స్కాట్ బోలాండ్ 65 బంతులను ఎదుర్కొనడం అంటే అసాధారణ విషయం. ఒక ఫోర్ సహాయంతో 10 పరుగులు చేశాడు. వీరిద్దరూ నాలుగో రోజు నాటౌట్‌గా మిగిలారు. ఇద్దరూ కలిసి 110 బంతులను ఎదుర్కొన్నారు. 55 పరుగులు చేశారు.

IND vs AUS Highest successful chase at MCG is 332 by England in 1928 Australia now at 333

ఇది రికార్డ్ పార్ట్‌నర్‌షిప్. తొమ్మిదో వికెట్‌కు 55 పరుగులు చేయడాన్ని అసాధారణంగా భావిస్తోన్నారు క్రీడా పండితులు. 110 బంతులను ఎదుర్కొనడాన్ని అసామాన్యంగా అభివర్ణిస్తోన్నారు. బోలాండ్ వంటి బ్యాటర్ టీమిండియా బౌలర్లను 65 బంతుల పాటు ధీటుగా ఎదుర్కొనడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.

కేప్టెన్ రోహిత్ శర్మ బౌలర్లను పదేపదే మార్చినా ఉపయోగం లేకుండా పోయింది. బుమ్రా, సిరాజ్, రవీంద్ర జడేజా, ఆకాష్ దీప్‌కు తోడుగా నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్ బౌలింగ్‌కు దిగినప్పటికీ ఏ మాత్రం ఉపయోగం లేకుండా పోయింది. వారిద్దరూ కొరుకుడుపడలేదు.

మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో హయ్యెస్ట్ రన్ ఛేజింగ్ 332 పరుగులు. 1928లో ఇంగ్లాండ్ ఈ రికార్డును సాధించింది. 332 పరుగుల తేడాతో ఆస్ట్రేలియాను మట్టికరిపించింది. ఆ తరువాత దీన్ని బద్దలు కొట్టడం ఎవ్వరి తరమూ కాలేదు. ఏ జట్టు కూడా ఈ ఫీట్‌ను ఇప్పటివరకు అందుకోలేదు.

తాజాగా జరుగుతున్న టెస్ట్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఇప్పటికే 333 పరుగులు సాధించింది. ఇంకా ఒక వికెట్ చేతిలో మిగిలివున్న నేపథ్యంలో ఇంకా కాసిన్ని పరుగులు దీనికి జత కావడం ఖాయమేననడంలో సందేహాలు అక్కర్లేదు. 1928 నుంచీ 332 పరుగుల రన్ ఛేజింగే ఇక్క హయ్యెస్ట్ కావడం, ఆల్రెడీ ఆస్ట్రేలియా ఈ మార్క్‌ను దాటడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

చివరి రోజు భారత్ గెలిస్తే మాత్రం 96 సంవత్సరాల నాటి రికార్డ్‌ను బద్దలు కొట్టినట్టవుతుంది. మెల్‌బోర్న్ పిచ్ పరిస్థితిని అర్ధం చేసుకుంటే పూర్తిగా ఫాస్ట్ బౌలింగ్‌కు అనుకూలంగా ఉంటోంది. చివరి రోజు ఆస్ట్రేలియా బౌలర్లు పాట్ కమ్మిన్స్, మిఛెల్ స్టార్క్, స్కాట్ బోలాండ్, నాథన్ లియాన్ బౌలింగ్‌ను ఎదుర్కొని మ్యాచ్‌ను డ్రాగా మార్చుకున్నా చాలనిపించే పరిస్థితి ఏర్పడిందిప్పుడు.

ఎంసీజీలో హయ్యెస్ట్ రన్ ఛేజ్ చూసుకుంటే..ఇంగ్లాండ్- 332 (1928), ఇంగ్లాండ్- 298 (1895), దక్షిణాఫ్రికా- 297 (1953), ఆస్ట్రేలియా- 287 (1929), ఇంగ్లాండ్- 282 (1908), ఆస్ట్రేలియా- 260 (1951), ఆస్ట్రేలియా- 258 (1961), ఇంగ్లాండ్- 237 (1962), ఆస్ట్రేలియా- 231 (2013), ఇంగ్లాండ్- 219 (1911). ఈ లిస్ట్‌లో భారత్ చేరుతుందో లేదో అయిదోరోజు తేలిపోతుంది.

Story first published: Sunday, December 29, 2024, 14:49 [IST]
Other articles published on Dec 29, 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+