Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs AUS 2nd Test: టీమిండియాకు గుడ్ న్యూస్.. అతను తిరిగొచ్చాడు!

టీమిండియాకు గుడ్‌న్యూస్. వ్యక్తిగత కారణాలతో స్వదేశానికి వెళ్లిన భారత జట్టు ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ ఆస్ట్రేలియాకు తిరిగొచ్చాడు. అడిలైడ్‌లో ఉన్న టీమిండియాతో చేరాడు. తొలి టెస్టులో విజయానంతరం బీసీసీఐ అనుమతితో గంభీర్ భారత్‌కు వచ్చిన విషయం తెలిసిందే. రెండో టెస్టుకు తప్పనిసరిగా అందుబాటులో ఉంటానని చెప్పి వెళ్లిన అతను తిరిగొచ్చాడు.

ఆస్ట్రేలియాతో అయిదు టెస్టుల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా అడిలైడ్ వేదికగా డిసెంబర్ 6 నుంచి పింక్ బాల్‌తో రెండో టెస్టు జరగనుంది. ఈ డే/నైట్ టెస్టు భారత కాలమాన ప్రకారం ఉదయం 9.30 గంటలకు మొదలవుతుంది. కాగా, గంభీర్ గైర్హాజరీలో ఇటీవల ప్రైమ్ మినిష్టర్స్ XI జట్టుతో జరిగిన వార్మప్ మ్యాచ్‌కు, జట్టు సాధనలో అసిస్టెంట్ కోచ్‌లు అభిషేక్ నాయర్, ర్యాన్‌ టెన్, బౌలింగ్ కోచ్ మోర్నే మోర్కెల్, ఫీల్డింగ్ కోచ్ టీ దిలీప్ కోచింగ్ బాధ్యతలను చూసుకున్నారు.

IND vs AUS Head Coach Gautam Gambhir Joins Team India in Adelaide

గంభీర్ రాకతో రెండో టెస్టు తుదిజట్టుపై ప్రణాళికలు మొదలుకానున్నాడు. వ్యక్తిగత కారణాలతో రోహిత్ శర్మ, గాయంతో శుభ్‌మన్ గిల్ తొలి టెస్టుకు దూరమైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో యశస్వీ జైస్వాల్‌తో కలిసి కేఎల్ రాహుల్ ఇన్నింగ్స్ ఆరంభించాడు. ఆస్ట్రేలియా గడ్డపై 200 పరుగుల భాగస్వామ్యం నమోదు చేసిన తొలి భారత ఓపెనింగ్ జోడీగా జైస్వాల్-రాహుల్ రికార్డు నెలకొల్పారు. గిల్ స్థానంలో వన్‌డౌన్‌లో దేవదత్ పడిక్కల్ ఆడాడు.

పెర్త్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై టీమిండియా 295 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. అయితే రోహిత్-గిల్ రీఎంట్రీతో రాహుల్ స్థానం ఎక్కడా? అనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల జరిగిన వార్మప్ మ్యాచ్‌లో రాహుల్ ఓపెనర్‌గానే వచ్చాడు. మరీ కోచ్ గంభీర్ తుదిజట్టుపై ఏ నిర్ణయం తీసుకుంటాడనేది ఆసక్తికరంగా మారింది. ఆస్ట్రేలియాకు తిరిగొచ్చిన గంభీర్‌కు తుదిజట్టు కూర్పు ఓ పెద్ద తలనొప్పి మారడం ఖాయమే!

ఆస్ట్రేలియాతో అయిదు టెస్టుల సిరీస్ షెడ్యూల్
నవంబర్ 22-26: తొలి టెస్టు- పెర్త్ (ఉదయం 7.30) - భారత్ విజయం
డిసెంబర్ 06-10: రెండో టెస్టు (డే/నైట్)- అడిలైడ్ (ఉదయం 9.30)
డిసెంబర్ 14-18: మూడో టెస్టు- బ్రిస్బేన్ (ఉదయం 5.50)
డిసెంబర్ 26-31: నాలుగో టెస్టు- మెల్‌బోర్న్ (ఉదయం 5 గంటలకు)
జనవరి 03-08: అయిదో టెస్టు- సిడ్నీ (ఉదయం 5 గంటలకు).

Story first published: Tuesday, December 3, 2024, 8:50 [IST]
Other articles published on Dec 3, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+