Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

కవ్వించిన స్టార్క్‌కు రాకాసి బంతితో హర్షిత్ సమాధానం- బద్దలైన హెల్మెట్ (Video)

పెర్త్ వేదికగా భారత్ - ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న తొలి టెస్టు ఆసక్తికరంగా సాగుతోంది. మిచెల్ స్టార్క్- హర్షిత్ రాణా ఫైట్ రెండో రోజు ఆటను మరింత రసవత్తరంగా మార్చింది. కవ్వించిన స్టార్క్‌కు రాణా బంతితో సమాధానమిచ్చాడు. రాకాసి బంతితో స్టార్క్ హెల్మెట్ బద్దలుకొట్టాడు. అసలేం జరిగిందంటే..

హర్షిత్ రాణా వేసే చక్కని బంతుల్ని ఎదుర్కొనే క్రమంలో స్టార్క్ మాటలు కూడా ఉపయోగించాడు. శరీరం మీదకు వచ్చే బంతుల్ని సమర్థవతంగా ఎదుర్కొలే హర్షిత్‌ తన ఏకాగ్రత కోల్పోయేలా కవ్వించాడు. 'హర్షిత్.. నీకంటే ఎక్కువ వేగంగా బౌలింగ్ చేస్తాను. నాకు చాలా గుర్తుంది' అని స్టార్క్ అన్నాడు. దీనికి హర్షిత్ ఎలాంటి బదులివ్వకుండా నవ్వుతూ తిరిగి బౌలింగ్ చేయడానికి ప్రయత్నించాడు.

IND vs AUS Harshit Rana Shuts Down Starc s Taunts with a Fierce Bouncer to the Helmet

అయితే ఆ తర్వాత హర్షిత్ రాణా రాకాసి బంతితో స్టార్క్‌కు సమాధానమిచ్చాడు. హర్షిత్ వేసిన బౌన్సర్ నుంచి స్టార్క్ తప్పించుకోవడానికి ప్రయత్నించాడు. కానీ అది ఊహించినంత బౌన్సర్ కాకపోవడం, స్టార్క్ ఎత్తు వల్ల బంతి హెల్మెట్‌కు తాకింది. బాల్ వేగానికి హెల్మెట్ బ్యాడ్జ్ విరిగిపోయింది. వెంటనే హర్షిత్ రాణా స్టార్క్‌కు వద్దకు వెళ్లి ఏమైనా గాయమైందేమోనని కంగారుపడుతూ అడిగాడు. స్టార్క్ ఓకే అని చెప్పడంతో రిలాక్స్ అయ్యాడు.

తర్వాత ఫిజియో వచ్చి స్టార్క్‌ను చెక్ చేశాడు. మరో హెల్మెట్‌ను ధరించి స్టార్క్ తిరిగి బ్యాటింగ్ కొనసాగించాడు. గత ఐపీఎల్‌ సీజన్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ తరఫున హర్షిత్-స్టార్క్ ప్రాతినిథ్యం వహించిన సంగతి తెలిసిందే. కాగా, హర్షిత్ రాణా- మిచెల్ స్టార్క్ ఫైట్‌కు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి.

Story first published: Saturday, November 23, 2024, 9:46 [IST]
Other articles published on Nov 23, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+