Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs AUS final: పిచ్‌పై పగుళ్లు: ఛేజింగ్ టీమ్‌దే గెలుపు: స్పష్టం చేసిన డీకే

Dinesh Karthik: ఐసీసీ ప్రపంచ కప్ 2023లో తుది పోరుకు సర్వం సిద్ధమైంది. గుజరాత్‌లోని ప్రతిష్ఠాత్మక నరేంద్రమోదీ స్టేడియం వేదికగా భారత్‌ను ఢీకొడుతోంది ఆస్ట్రేలియా (Ind vs Aus final). టాస్.. ఆస్ట్రేలియా వైపే మొగ్గు చూపింది. టాస్ (Toss) గెలిచిన ఆ జట్టు కేప్టెన్ పాట్ కమ్మిన్స్ (Pat Cummins) తొలుత ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. టీమిండియాను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు.

నరేంద్ర మోదీ స్టేడియం (Narendra Modi stadium) పిచ్‌పై భారీగా పగుళ్లు కనిపించాయి. పిచ్ మందకొడిగా ఉంటుందని, బౌలర్లకు సహకరిస్తుందంటూ మొదటి నుంచి అంచనాలు వ్యక్తమౌతూ వస్తోన్నాయి. వాటిని నిజం చేసేలా కనిపించింది పిచ్. మొత్తం పగుళ్లు ఉన్నాయి.

IND vs AUS final, World Cup 2023: team batting second is better suited for a win, says Dinesh Karthik

ఈ పిచ్‌ ఫొటోను వికెట్‌ కీపర్ బ్యాటర్ దినేష్ కార్తీక్.. తన అధికారిక ఎక్స్ అకౌంట్‌లో పోస్ట్ చేశాడు. మ్యాచ్‌పై తన అంచనాలను వెల్లడించాడు. పగుళ్లు ఎక్కువగా ఉన్నాయని, ఇలాంటి పిచ్‌పై భారీగా పరుగులను ఆశించలేమని స్పష్టం చేశాడు. లో- స్కోరింగ్ మ్యాచ్ అవుతుందని పేర్కొన్నాడు. లో- స్కోర్ రికార్డ్ కావడానికే అధిక అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నాడు.

ఈ పరిస్థితుల్లో మొదటిసారి బ్యాటింగ్ చేసిన జట్టు కంటే రెండో ఇన్నింగ్‌లో బ్యాటింగ్‌కు దిగిన టీమ్‌కే గెలిచే అవకాశాలు అధికంగా ఉంటాయని దినేష్ కార్తీక్ పేర్కొన్నాడు. దీనికి గల సాంకేతిక కారణాలను కూడా విశ్లేషించాడు డీకే. కాలం గడుస్తున్న కొద్దీ గాలిలో తేమ పెరుగుతుంటుందని, మంచు కురుస్తుంటుందని అది ఆ జట్టు విజయానికి బాటలు వేస్తుందనీ అన్నాడు.

ఏ జట్టు తొలుత బ్యాటింగ్ చేసినా గానీ భారీ లక్ష్యాన్ని నిర్దేశించడం ఒక్కటే దాని గెలుపునకు కారణమౌతుందని దినేష్ కార్తీక్ అభిప్రాయపడ్డాడు. భారత్, ఆస్ట్రేలియా జట్ల బ్యాటింగ్ ఆర్డర్ పటిష్టంగా ఉన్నందున చెప్పుకోదగ్గ స్కోరే నమోదవుతుందని, బోర్డులో చాలినన్ని పరుగులను జమ చేయక తప్పదనీ అన్నాడు.

Story first published: Sunday, November 19, 2023, 13:57 [IST]
Other articles published on Nov 19, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+