Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs AUS final: చిన్నప్పటి నుంచి ఆ టీమ్ అంటే పరమ అసహ్యం: ఎప్పుడూ ఓడిపోవాలనే కోరుకుంటా: గిల్

Shubman Gill, IND vs AUS final: ఐసీసీ ప్రపంచ కప్ 2023లో తుది పోరుకు సర్వం సిద్ధమైంది. గుజరాత్‌లోని ప్రతిష్ఠాత్మక నరేంద్రమోదీ స్టేడియం వేదికగా భారత్‌ను ఢీకొట్టబోతోంది ఆస్ట్రేలియా (Ind vs Aus final). మధ్యాహ్నం 2 గంటలకు ఈ మ్యాచ్ మొదలుకానుంది. అహ్మదాబాద్‌కు అభిమానులు పోటెత్తారు. వేర్వేరు నగరాల నుంచి ప్రత్యేక రైళ్లు, ప్రైవేటు- వ్యక్తిగత వాహనాల ద్వారా ఇక్కడికి చేరుకుంటోన్నారు.

కోల్‌కత ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన రెండో సెమీ ఫైనల్స్‌లో దక్షిణాఫ్రికాను చిత్తుచేసింది ఆస్ట్రేలియా. ఫైనల్స్‌లో అడుగుపెట్టింది. అమీతుమీ తేల్చుకోవడానికి రెండు జట్లు సన్నద్ధమౌతున్నాయి. నెట్స్‌లో కఠోరంగా శ్రమిస్తోన్నాయి.

IND vs AUS final, World Cup 2023: I always want Australians lose, says Shubman Gill

ఈ మ్యాచ్ కోసం ఆస్ట్రేలియా సమరోత్సాహంతో సన్నద్ధమౌతోంది. బలమైన దక్షిణాఫ్రికాను సెమీ ఫైనల్స్‌లో మట్టికరిపించిన దూకుడు మీద కనిపిస్తోందా జట్టు. సొంత గడ్డపై చెలరేగుతున్న భారత్‌ను కట్టడి చేయడానికి సర్వశక్తులనూ ఒడ్డుతోంది. ఇందులో భాగంగా నెట్స్‌లో చెమటోడ్చుతోంది.

ఈ పరిస్థితుల్లో భారత జట్టు డాషింగ్ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఆస్ట్రేలియా జట్టుపై తనకు ఉన్న అభిప్రాయాలను బయట పెట్టాడు. తాను మ్యాచ్ ఆడేటప్పుడు ప్రత్యర్థి ఎలాంటి జట్టు?, అందులో ఎలాంటి బౌలర్లు ఉన్నారనే విషయంపై పెద్దగా దృష్టి సారించబోనని పేర్కొన్నాడు. క్రీజ్‌లో ఉన్నప్పుడు తాను ఎన్ని పరుగులు చేయగలుగుతాననడానికే ప్రాధాన్యత ఇస్తానని అన్నాడు.

ఆస్ట్రేలియా జట్టు అంటే తనకు చిన్నప్పటి నుంచి పరమ అసహ్యమని చెప్పుకొచ్చాడు శుభ్‌మన్ గిల్. ఆ జట్టు ఎప్పుడూ ఓడిపోవాలనే కోరుకుంటానని స్పష్టం చేశాడు. ఆస్ట్రేలియాతో తాను మ్యాచ్ ఆడినప్పుడల్లా ఈ విషయాన్ని గుర్తు పెట్టుకుంటానని అన్నాడు. ఆ జట్టును ఎలాగైనా ఓడించి తీరాలని మాత్రమే ఆలోచిస్తానని, మరో ఆలోచన తన మదిలో ఉండదని పేర్కొన్నాడు.

Story first published: Sunday, November 19, 2023, 12:01 [IST]
Other articles published on Nov 19, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+