Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs AUS final: గేట్లయినా తియ్యనివ్వండయ్యా సామీ: దుకాణం పెట్టేశారు

IND vs AUS final: ఐసీసీ ప్రపంచ కప్ 2023లో తుది పోరుకు సర్వం సిద్ధమైంది. గుజరాత్‌లోని ప్రతిష్ఠాత్మక నరేంద్రమోదీ స్టేడియం వేదికగా భారత్‌ను ఢీకొట్టబోతోంది ఆస్ట్రేలియా (Ind vs Aus final). మధ్యాహ్నం 2 గంటలకు ఈ మ్యాచ్ మొదలుకానుంది. తాడో పేడో తేల్చుకోవడానికి రెండు జట్లు సన్నద్ధమౌతున్నాయి.

కేప్టెన్ రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, శ్రేయాస అయ్యర్, రవీంద్ర జడేజాతో కూడిన భారత జట్టు దూకుడును ఆస్ట్రేలియా ఎలా అడ్డుకుంటుందనేది ఉత్కంఠతను రేకెత్తిస్తోంది. నరేంద్ర మోదీ స్టేడియం పిచ్ మందకొడిగా ఉంటుందంటూ వార్తలు వస్తోన్న నేపథ్యంలో బౌలర్లు తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించే అవకాశం ఉంది.

IND vs AUS final, World Cup 2023: Fans flooded to Narendra Modi stadium

ఈ మ్యాచ్ కోసం అటు ఆస్ట్రేలియా సమరోత్సాహంతో సన్నద్ధమౌతోంది. ఉంది. బలమైన దక్షిణాఫ్రికాను సెమీ ఫైనల్స్‌లో మట్టికరిపించిందా కంగారూల టీమ్. సొంత గడ్డపై చెలరేగుతున్న భారత్‌ను కట్టడి చేయడానికి సర్వశక్తులనూ ఒడ్డుతోంది. ఇందులో భాగంగా నెట్స్‌లో చెమటోడ్చుతోంది.

అటు ఫైనల్ మ్యాచ్.. ఇటు ఆదివారం సెలవు రోజు కావడంతో అహ్మదాబాద్‌కు అభిమానులు పోటెత్తారు. వేర్వేరు నగరాల నుంచి ప్రత్యేక రైళ్లు, ప్రైవేటు- వ్యక్తిగత వాహనాల ద్వారా ఇక్కడికి చేరుకుంటోన్నారు. వందే భారత్ సహా పశ్చిమ రైల్వే 11 ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది. ఢిల్లీ, ముంబైల నుంచి ఆయా రైళ్లన్నీ అహ్మదాబాద్ వైపు పరుగులు తీస్తోన్నాయి.

IND vs AUS final, World Cup 2023: Fans flooded to Narendra Modi stadium

గుజరాత్‌కు చెందిన క్రికెట్ ప్రేమికులు అప్పుడే అహ్మదాబాద్‌కు వచ్చారు. తెల్లవారు జాము నుంచే నరేంద్ర మోదీ స్టేడియం వద్ద పడిగాపులు పడుతున్నారు. ఎప్పుడెప్పుడు గేట్లు తీస్తారా? అంటూ ఎదురు చూస్తోన్నారు. వేలాదిమంది అభిమానులు పోటెత్తడంతో స్టేడియం పరిసర ప్రాంతాలు జాతరను తలపిస్తోన్నాయి.

టీమిండియా ప్లేయర్లు ధరించే బ్లూ జెర్సీల అమ్మకాలు స్టేడియం వద్ద జోరుగా సాగుతున్నాయి. ఫుట్ పాత్ బిజినెస్ ముమ్మరంగా సాగుతోంది. ఒక్కో బ్లూ జెర్సీ 250 నుంచి 300 రూపాయల వరకు పలుకుతోంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ పేర్లు, వారి నంబర్ ఉన్న జెర్సీలకు మంచి డిమాండ్ ఉంటోంది. అవి హాట్ కేకుల్లా అమ్ముడు పోతున్నాయి.

Story first published: Sunday, November 19, 2023, 9:29 [IST]
Other articles published on Nov 19, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+