వరల్డ్ కప్ 2023 బెస్ట్ కేప్టెన్ ఈజ్..: ఐసీసీ ప్లేయింగ్ 11 ఇదే
అహ్మదాబాద్: ఐసీసీ ప్రపంచ కప్ 2023 తుది పోరులో మరోసారి భారత జట్టుకు పరాభవం తప్పలేదు. గుజరాత్‌లోని ప్రతిష్ఠాత్మక నరేంద్రమోదీ స్టేడియం వేదికగా ఆదివారం జరిగిన మ్యాచ్‌లో ఘన విజయం సాధించింది ఆస్ట్రేలియా (Ind vs Aus final). ఆరోసారి వరల్డ్ కప్ విజేతగా ఆవిర్భవించింది.
తొలుత ఫీల్డింగ్ ఎంచుకున్న ఆసీస్.. బలమైన బ్యాటింగ్ లైనప్ ఉన్న టీమిండియాను 240 పరుగులకే కట్టడి చేసింది. అనంతరం ఈ లక్ష్యాన్ని నాలుగు వికెట్లను కోల్పోయి ఛేదించింది. 43 ఓవర్లల్లో 241 పరుగులతో విజయదుందుభి మోగించింది. ఓపెనర్ ట్రావిస్ హెడ్ సెంచరీతో కదం తొక్కాడు. మిడిలార్డర్ బ్యాటర్ మార్నుస్ లాంబుషెన్ 58 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.

ఈ వరల్డ్ కప్‌లో ఒక్కసారి కూడా భారత్ ఓడిపోకపోవడానికి ప్రధాన కారణం బౌలర్లే. ప్రతి మ్యాచ్‌లోనూ పోటీ పడి వికెట్లు నేల కూల్చుతూ వచ్చిన బౌలర్లు ఫైనల్స్‌లో చేతులెత్తేశారు. నాలుగు వికెట్లే తీయగలిగారు. జస్‌ప్రీత్ బుమ్రా-2, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్ ఒక్కో వికెట్ తీసుకున్నారు.
ఈ మ్యాచ్ ముగిసిన మరుసటి రోజే.. ఐసీసీ కీలక ప్రకటన వెలువడించింది. బెస్ట్ కేప్టెన్ ఎవరనే విషయాన్ని ప్రకటించింది. టీమ్ ఆఫ్ ది టోర్నమెంట్ (ICC team of the tournament)ను ఎంపిక చేసింది. మొత్తం 11 మంది ప్లేయర్లతో కూడిన జట్టు ఇది. ఈ వరల్డ్ కప్‌లో ఆడిన మెరికలను ఇందులోకి తీసుకుంది.
జట్టు కేప్టెన్‌గా రోహిత్ శర్మను సెలెక్ట్ చేసింది ఐసీసీ. వరల్డ్ కప్ ఫైనల్స్‌లో జట్టును విజయ తీరాలకు చేర్చడంలో విఫలమైనప్పటికీ.. అతిని ప్రతిభను ఏమాత్రం కూడా తక్కువగా అంచనా వేయలేమని పేర్కొంది. కేప్టెన్‌గా, ఓపెనర్‌గా సమర్థవంతంగా రోహిత్ శర్మ రాణించాడని కితాబిచ్చింది.
ఐసీసీ ఎంపిక చేసిన ప్లేయింగ్ 11లో- క్వింటన్ డికాక్, రోహిత్ శర్మ (కేప్టెన్), విరాట్ కోహ్లీ, డారిల్ మిఛెల్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), గ్లెన్ మాక్స్‌వెల్, రవీంద్ర జడేజా, జస్‌ప్రీత్ బుమ్రా, దిల్షాన్ మధుశంక, ఆడమ్ జంపా, మహ్మద్ షమీకి చోటు దక్కింది. ఈ టీమ్‌లో ఏకంగా ఆరుమంది భారత ప్లేయర్లను తీసుకోవడం.. మనోళ్ల ప్రతిభకు అద్దం పట్టినట్టయింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications