అడిలైడ్ వేదికగా భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న డే/నైట్ టెస్టు ఆసక్తికరంగా సాగుతోంది. ఓపెనర్‌గా రెండో టెస్టులోనూ వచ్చిన కేఎల్ రాహుల్‌కు అదృష్టం వరిస్తోంది. ఒకే ఓవర్‌లో రెండు సార్లు ఔట్ నుంచి తప్పించుకున్నాడు. అందులో ఓసారి ఔట్ అనుకుని మైదానాన్ని వీడటానికి కూడా సిద్ధమయ్యాడు. మరోవైపు విరాట్ కోహ్లి కూడా బ్యాటింగ్ చేయడానికి మైదానం వరకూ వచ్చాడు. కానీ రాహుల్ అనూహ్యంగా బతికిపోయాడు. తిరిగి క్రీజులోకి వచ్చాడు.
హేజిల్‌వుడ్ స్థానంలో తుదిజట్టులోకి వచ్చిన స్కాట్ బొలాండ్ వేసిన 8వ ఓవర్‌లో ఈ అనూహ్య సంఘటన చోటు చేసుకుంది. బొలాండ్ తొలి బంతిని క్రాకింగ్ డెలివరీగా సంధించాడు. రాహుల్ దాన్ని డిఫెండ్ చేయడానికి ప్రయత్నించాడు. కానీ గ్లవ్స్, బ్యాటు హ్యాండిల్‌కు దగ్గరగా వెళ్లి.. వికెట్ కీపర్ అలెక్స్ కేరీ చేతుల్లోకి బంతి వెళ్లింది. దీంతో కేఎల్ రాహుల్ ఔట్ అని భావించి పెవిలియన్ బాట పట్టాడు.

అయితే అప్పుడే అసలు ట్విస్ట్.. అంపైర్ నోబాల్ అని ప్రకటించాడు. రాహుల్‌ను అంపైర్లు వెనక్కి పిలిచారు. మరోవైపు కేఎల్ రాహుల్ పెవిలియన్‌కు వస్తుండటంతో కోహ్లి మైదానం వరకు వచ్చాడు. రాహుల్ తిరిగి క్రీజులోకి వెళ్తుండటంతో విరాట్ డ్రెస్సింగ్ రూమ్‌కు చేరుకున్నాడు. అయితే రాహుల్ గ్లవ్స్-బ్యాటుకే బంతిని తాకలేదని రిప్లేలో తేలింది. అది నోబాల్ కాకపోతే.. రాహుల్ ఔట్ కాకపోయినా అప్పనంగా వికెట్ సమర్పించుకున్నట్లు అయ్యేది.
అదే ఓవర్‌లో అయిదో బంతికి కేఎల్ రాహుల్ ఔటయ్యే ప్రమాదం నుంచి మరోసారి తప్పించుకున్నాడు. బొలాండ్ వేసిన బంతిని డిఫెండ్ చేయడానికి ప్రయత్నించి రాహుల్ బ్యాటుకు థిక్ ఔట్ సైడ్ ఎడ్జ్ అయ్యింది. ఫస్ట్ స్లిప్‌లో ఉన్న ఉస్మాన్ ఖవాజా వైపు బంతి వెళ్లింది. కానీ ఖవాజా దాన్ని అందుకోలేకపోయాడు. దీంతో ఒకే ఓవర్‌లో రెండు సార్లు ఔట్ నుంచి తప్పించుకున్నాడు. దీంతో రాహుల్ లక్కీ అంటూ నెట్టింట పోస్టులు వెల్లువెత్తుతున్నాయి.
Fortune KL Rahul this morning two Boons of life on the field still persisted on the pitch but the way he is riding to the ball is slow and late that's why he is still struggling to get the boundaries.#AUSvIND #AUSvINDIA pic.twitter.com/d5Js8puxGO
— Kamlesh Yadav (@kamleshyadav242) December 6, 2024
இன்னைக்கு KL Rahul-க்கு Luck உச்சத்துல இருக்கு போல😎
— Star Sports Tamil (@StarSportsTamil) December 6, 2024
📺 தொடர்ந்து காணுங்கள் | Border Gavaskar Trophy | 2nd Test | Star Sports தமிழில்#ToughestRivalry #BorderGavaskarTrophy #AUSvINDonStar pic.twitter.com/kMeYcVt3kS