Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs AUS: భారత్‌తో రెండో టెస్టుకు ఆస్ట్రేలియా జట్టు ప్రకటన

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఆరంభ మ్యాచ్‌లో ఘోర పరాజయం చవిచూసిన ఆస్ట్రేలియా రెండో టెస్టుకు జట్టును ప్రకటించింది. ప్యాట్ కమిన్స్ సారథ్యంలో 14 మందితో కూడిన జట్టును వెల్లడించింది. తొలి టెస్టు జట్టుకు ఎంపికైన ఆటగాళ్లతో పాటు అదనంగా ఆల్‌రౌండర్ బ్యూ వెబ్‌స్టర్‌ ఎంపికయ్యాడు. వెబ్‌స్టర్‌కు తొలిసారి క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) నుంచి పిలుపు దక్కింది.

పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్టులో టీమిండియా చేతిలో 295 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా ఓటమిపాలైన విషయం తెలిసిందే. వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ రేసులో నిలవాలంటే భారత్‌తో పాటు ఆసీస్‌కు ఈ సిరీస్ ఎంతో కీలకం. టాస్ ఓడి తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియాను 150 పరుగులకే ఆలౌట్ చేసినప్పటికీ.. భారత బౌలర్ల ముందు తమ బ్యాటర్లు నిలవలేక మ్యాచ్‌పై ఆస్ట్రేలియా పట్టు చేజార్చుకుంది. ఇక రెండో ఇన్నింగ్స్‌లో యశస్వీ జైస్వాల్, విరాట్ కోహ్లి సెంచరీలు బాదడంలో బౌలర్లు నిస్సహాయంగా కనిపించారు.

IND vs AUS Beau Webster Joins Australia s Test Squad as Marsh Faces Fitness Concerns

అయితే పెర్త్ టెస్టులో మిచెల్ మార్ష్ 17 ఓవర్లు బౌలింగ్ చేశాడు. గత మూడేళ్లలో ఓ టెస్టులో మార్ష్ అత్యధిక ఓవర్లు బౌలింగ్ వేయడం ఇదే ప్రథమం. దీంతో మిచెల్ మార్ష్ ఫిట్‌నెస్‌‌పై ఆందోళన నేపథ్యంలో ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ వెబ్‌స్టర్‌ను ఎంపిక చేసింది. గత రెండు సీజన్లలో వెబ్‌స్టర్ ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో అద్భుత ప్రదర్శన చేస్తున్నాడు. సర్ గార్‌ఫీల్డ్ సోబెర్స్ తర్వాత షెఫీల్డ్ షీల్డ్‌ చరిత్రలో ఓ సీజన్‌లో 900+ పరుగులు, 30 వికెట్లు పడగొట్టినన ప్లేయర్‌గా వెబ్‌స్టర్ నిలిచాడు.

కాగా, ప్రధాన పేస్ ఆల్‌రౌండర్ కామెరూన్ గ్రీన్ శస్త్రచికిత్స చేయించుకుని జట్టుకు దూరమవ్వడంతో మిచెల్ మార్ష్‌‌కు పనిభారం పెరిగిన విషయం తెలిసిందే. అయితే రెండో టెస్టుకు మార్ష్ తుదిజట్టులో కొనసాగే అవకాశం ఉంది. కానీ ఆల్‌రౌండర్‌గా కాకుండా బ్యాటర్‌గా మాత్రమే ఎంపికయ్యే ఛాన్స్ ఉంది. డిసెంబర్ 6 నుంచి అడిలైడ్ వేదికగా రెండో టెస్టు ప్రారంభం కానుంది. పింక్ బాల్‌తో జరగనున్న ఈ డే/నైట్ టెస్టు భారత కాలమాన ప్రకారం ఉదయం 9.30 గంటలకు మొదలవుతుంది.

రెండో టెస్టుకు ఎంపికైన ఆస్ట్రేలియా: పాట్ కమిన్స్ (కెప్టెన్), స్కాట్ బొలాండ్, అలెక్స్ కేరీ, జోష్‌ హేజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, జోష్‌ ఇంగ్లిస్, ఉస్మాన్ ఖావాజా, మార్నస్ లబుషేన్, నాథన్ లైయన్, మిచెల్ మార్ష్, నాథన్ మెక్‌స్వీనే, స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్, బ్యూ వెబ్‌స్టర్.

ఆస్ట్రేలియాతో అయిదు టెస్టుల సిరీస్ షెడ్యూల్
నవంబర్ 22-26: తొలి టెస్టు- పెర్త్ (ఉదయం 7.30) - భారత్ విజయం
డిసెంబర్ 06-10: రెండో టెస్టు (డే/నైట్)- అడిలైడ్ (ఉదయం 9.30)
డిసెంబర్ 14-18: మూడో టెస్టు- బ్రిస్బేన్ (ఉదయం 5.50)
డిసెంబర్ 26-31: నాలుగో టెస్టు- మెల్‌బోర్న్ (ఉదయం 5 గంటలకు)
జనవరి 03-08: అయిదో టెస్టు- సిడ్నీ (ఉదయం 5 గంటలకు).

Story first published: Thursday, November 28, 2024, 11:27 [IST]
Other articles published on Nov 28, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+