For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఆసీస్ ఫైటింగ్ బ్యాక్- జిడ్డులా అంటుకుపోయిన చివరి బ్యాటర్లు: కలవరపరిచే ఆధిక్యత

Mohammed Siraj: బోర్డర్- గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్‌తో జరుగుతున్న నాలుగో టెస్ట్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా మరోసారి పతనం దిశగా సాగుతోంది. తొమ్మిది వికెట్లను కోల్పోయింది. ఇక ఆ జట్టు రెండో ఇన్నింగ్‌‌కు తెర పడటానికి ఎంతో సమయం పట్టకపోవచ్చనుకున్నప్పటికీ.. వాస్తవ పరిస్థితి దీనికి పూర్తి భిన్నంగా మారింది.

టీమిండియా పేస్ బౌలర్లు జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్ ధాటికి వెంటవెంటనే వికెట్లను కోల్పోయింది ఆస్ట్రేలియా. సామ్ కొన్‌స్టాస్- 8, ఉస్మాన్ ఖవాజా- 21, స్టీవెన్ స్మిత్- 13, ట్రావిస్ హెడ్- 1, మిఛెల్ మార్ష్- 0, వికెట్ కీపర్ బ్యాటర్- అలెక్స్ క్యారీ- 2 పరుగులు చేసి అవుట్ అయ్యారు. మొత్తంగా 91 పరుగుల వద్ద ఆరు వికెట్లను కోల్పోయింది ఆస్ట్రేలియా.

IND vs AUS Australia s lead cross by 300 mark valuable runs added by Lyon and Boland

డేంజరస్ మార్నుస్ లాబుషేన్ ఒంటరి పోరాటం సాగించడం భారత జట్టును కలవరపాటుకు గురిచేసింది. జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్ బౌలింగ్‌ను ఎదుర్కొని క్రీజ్‌లో నిలిచాడు. అర్ధసెంచరీని పూర్తి చేసుకున్నాడు. కుదురుగా ఆడటం, ఊరించే బంతులను కూడా వదిలేయడాన్ని బట్టి చూస్తే అతనెంత జాగ్రత్తగా ఆడుతున్నాడో అర్థం చేసుకోవచ్చు.

టీ విరామం తరువాత లాబుషెన్ ఎక్కువ సేపు క్రీజ్‌లో నిల్చోలేకపోయాడు. 70 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద అవుట్ అయ్యాడు. అతని వికెట్ మహ్మద్ సిరాజ్ ఖాతాలో పడింది. వికెట్ల కార్నర్‌లో బంతులను సంధించాలంటూ విరాట్ కోహ్లీ చేసిన సూచనలను అతను తూచ తప్పకుండా పాటించాడు. లాబుషెన్‌ను అవుట్ చేయగలిగాడు.

వరుసబెట్టి సిరాజ్.. వికెట్ల కార్నర్‌లో వేసిన బంతులను అడ్డుకునే క్రమంలో ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు లాబుషెన్. రివ్యూకు వెళ్లినా ఉపయోగం లేకుండా పోయింది. అతను వెేసిన లెంగ్తీ డెలివరీని ఆడటంలో విఫలం అయ్యాడు లాబుషేన్. నేరుగా ఆ బంతి ప్యాడ్లను తాకింది. వికెట్ల కంటే ఎక్కువ ఎత్తులో వెళ్తోందని భావించిన లాబుషేన్ అప్పీల్‌కు వెళ్లాడు గానీ ఉపయోగం లేకుండా పోయింది.

దీనితో 148 పరుగుల వద్ద ఏడో వికెట్ కోల్పోయింది ఆసీస్. 156 పరుగుల వద్ద మిఛెల్ స్టార్క్, 173 పరుగుల వద్ద పాట్ కమ్మిన్స్ అవుట్ అయ్యారు. అక్కడితో కథ ముగుస్తుందనుకున్నారంతా. 300 పరుగుల లోపే టీమిండియా టార్గెట్ ఉండొచ్చని, అయిదో రోజు దీన్ని ఛేదించడం లాంఛనమే అవుతుందనిపించింది.

అక్కడే అసలు కథ మొదలైంది. చిట్టచివరి బ్యాటర్లు నాథన్ లియాన్, స్కాట్ బోలాండ్.. క్రీజ్‌లో పాతకుపోయారు. బౌలర్ల సహనానికి అసలు సిసలు పరీక్ష పెట్టారు. ఇద్దరూ కలిసి ఒక్కో పరుగును స్కోర్ బోర్డ్‌పై జత చేస్తూ వెళ్తోన్నారు. 65వ ఓవర్‌లో ఎనిమిదో వికెట్ పడితే 77 ఓవర్‌లోనూ మరో వికెట్ పడలేదు. ఇన్ని ఓవర్లను లియాన్, బోలాండ్ ఎదుర్కొన్నారంటే మాటలు కాదు.

నాథన్ లియాన్ 36 బంతుల్లో 16 పరుగులు, బోలాండ్ 48 బంతుల్లో 8 పరుగులతో ఆడుతున్నారు. వారిద్దరి ఫైటింగ్ స్పిరిట్‌తో తొమ్మిది వికెట్ల నష్టానికి ఆస్ట్రేలియా 200 పరుగులు చేసింది ఆస్ట్రేలియా. ఫలితంగా 305 పరుగుల ఆధిక్యతలో కొనసాగుతోంది. జాగ్రత్తగా ఆడుతున్నారీ ఇద్దరు లోయర్ ఆర్డర్ బ్యాటర్లు. విలువైన పరుగులను జత చేస్తోన్నారు.

Story first published: Sunday, December 29, 2024, 12:18 [IST]
Other articles published on Dec 29, 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+