
మెల్‌బోర్న్: పెర్త్ పరాజయం అనంతరం టీమిండియా జట్టు కూర్పుపై మరింత దృష్టి సారించింది. నలుగురు ఫేసర్లతో బరిలోకి దిగి తప్పు చేశామన్న కోహ్లీ ఈ సారి ఎవర్ని ఎంపిక చేస్తాడోననే ఉత్కంఠ అందరిలోనూ నెలకొంది. ఈ క్రమంలో రెండో టెస్టుకు దూరమైన పరిమిత ఓవర్ల ఫార్మాట్ ఓపెనర్ రోహిత్ శర్మను మూడో టెస్టుకు ఎంపిక చేసుకుంటారా అనే సందేహాలు జోరుగా వినిపిస్తున్నాయి. దీంతోపాటు ఆదివారం జరిగిన ఇండియన్ సమ్మర్ ఫెస్టివల్‌లో టీమిండియా ఆటగాళ్లు పాల్గొన్నారు.
వారిలో రోహిత్ శర్మ కూడా ఉండటంతో ఈ ఊహాగానాలకు మరింత ఊతమిచ్చాయి. ఆదివారం మీడియాతో మాట్లాడిన టీమిండియా కోచ్ రవిశాస్త్రి సైతం రోహిత్ శర్మ ఫిట్‌నెస్ గురించి మాట్లాడారు. ఫిట్‌నెస్ పరంగా ప్రస్తుతం బాగుందని అతనిలో మంచి మెరుగుదల కనిపిందని అన్నారు. అదే కనుక నిజమైతే జట్టులోకి రోహిత్ శర్మకు అవకాశం కల్పిస్తే మురళీ విజయ్‌తో పాటు రోహిత్ ఓపెనర్‌గా బరిలోకి దిగుతాడేమో.. !
టీమిండియా జట్టు అంచనా(1):
మురళీ విజయ్, మయాంక్ అగర్వాల్, చెతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, అజింక్య రహానె, హనుమ విహారి, రిషబ్‌పంత్, రవీంద్ర జడేజా, ఇషాంత్ శర్మ, మొహమ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా.
అంచనా(2):
మురళీ విజయ్, రోహిత్ శర్మ, చెతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, అజింక్య రహానె, హనుమ విహారి, రిషబ్‌పంత్, రవిచంద్రన్ అశ్విన్, ఇషాంత్ శర్మ, మొహమ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా.