
వేలాదిమంది ఒకే చోట..
స్టేడియం పూర్తి సామర్థ్యం 55,000. టికెట్లన్నీ అమ్ముడుపోయాయి. టికెట్ల అమ్మకాలు తీవ్ర వివాదాస్పదం అయ్యాయి. ఎన్నో అపశృతులు, ఆందోళనలు, గందరగోళ పరిస్థితుల మధ్య టికెట్లు బుక్ అయ్యాయి. టికెట్ల కౌంటర్ల వద్ద తొక్కిసలాట చోటు చేసుకోవడం, కొంతమంది అభిమానులు అపస్మారక స్థితిలోకి వెళ్లడం వంటి పలు అవాంఛనీయ సంఘటనలు సంభవించాయి. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు మహ్మద్ అజరుద్దీన్ సహా మరో ఇద్దరిపై కేసు నమోదు కావడానికీ దారి తీసిందీ ఘటన.

మెట్రో రైల్..
వేలాదిమంది ప్రేక్షకులు మ్యాచ్ చూడ్డానికి తరలి రాబోతోన్నారీ సాయంత్రం. దీన్ని దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. అర్ధరాత్రి వరకు మెట్రో రైలు సర్వీసులను నడిపించనున్నారు. అర్ధరాత్రి 12:30 గంటల వరకు అన్ని మార్గాల్లో కూడా మెట్రో రైలు సర్వీసులు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉండబోతోన్నాయి. మూడు మార్గాల్లోనూ మెట్రో రైళ్లు అందుబాటులో ఉంటాయి.

మూడు మార్గాల్లో..
మియాపూర్-ఎల్బీ నగర్ రెడ్ లైన్, మహాత్మాగాంధీ సెంట్రల్ బస్ స్టేషన్-జూబ్లీ బస్ స్టేషన్ పరేడ్ గ్రౌండ్స్ గ్రీన్ లైన్, రాయదుర్గం-నాగోల్ బ్లూ లైన్‌లో మెట్రో రైలు సర్వీసుల అర్ధరాత్రి 12:30 గంటల వరకు పొడిగించారు అధికారులు. ఈ విషయాన్ని రెండు రోజుల కిందటే ప్రకటించారు. ఇక తెలంగాణ ఆర్టీసీ అధికారులు కూడా స్పెషల్ సిటీ బస్సులను నడిపించనున్నారు. వేర్వేరు ప్రాంతాల నుంచి ఉప్పల్ స్టేడియానికి ప్రత్యేక బస్సులను అందుబాటులోకి తీసుకొచ్చారు.

సిటీ బస్సులూ..
మెహదీపట్నం, ఘట్‌కేసర్, హయత్ నగర్, ఎన్జీఓ కాలనీ, ఇబ్రహీంపట్నం, ల్యాబ్ క్వార్టర్స్, కోఠి, దిల్‌షుక్ నగర్, అఫ్జల్ గంజ్, లక్డీకాపుల్, బీహెచ్ఈఎల్, జీడిమెట్ల, కూకట్‌పల్లి, మేడ్చల్, మియాపూర్, జేబీఎస్, హకీంపేట్, ఈసీఐఎల్ క్రాస్ రోడ్స్, యూసుఫ్‌గూడ, బోయిన్‌పల్లి, ఛార్మినార్, చంద్రాయన్ గుట్ట, కొండాపూర్ నుంచి ఉప్పల్ స్టేడియానికి ప్రత్యేకంగా సిటీ బస్సులను నడిపించనున్నట్లు టీఎస్ఆర్టీసీ అధికారులు వెల్లడించారు.


Click it and Unblock the Notifications












