హైదరాబాద్ టీ20 మ్యాచ్‌కు మరో భారీ అడ్డంకి..?

హైదరాబాద్: భారత్-ఆస్ట్రేలియా మధ్య హైదరాబాద్ వేదికగా టీ20 సిరీస్‌ను తేల్చేసే మ్యాచ్ జరగబోతోంది. ఈ సాయంత్రం 7:30 గంటలకు మ్యాచ్ ఆరంభం కానుంది. దీనికి వేదిక- ఉప్పల్ స్టేడియం. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో ఇది చివరిది. సిరీస్ డిసైడర్ కూడా. ఇందులో గెలిచిన జట్టే సిరీస్ సొంతం చేసుకుంటుంది. అలాంటి కీలక మ్యాచ్‌కు హైదరాబాద్ ఆతిథ్యాన్ని ఇస్తోంది. హైదరాబాద్ ఫ్యాన్స్ ఓ హైఓల్టేజ్ మ్యాచ్‌కు ప్రత్యక్ష సాక్షులు కాబోతోన్నారు.

టికెట్ల అమ్మకాల్లో..
టికెట్ల అమ్మకాల విషయంలో చెలరేగిన ఎన్నో అపశృతులు, ఆందోళనలు, వివాదాలు, గందరగోళ పరిస్థితులను అధిగమించిన హైదరాబాద్ అభిమానులు ఈ సాయంత్రం భారత్-ఆస్ట్రేలియా మధ్య జరిగే టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌ను చూడటానికి సిద్ధపడుతున్నారు. టికెట్ల కౌంటర్ల వద్ద తొక్కిసలాట చోటు చేసుకోవడం, కొంతమంది అభిమానులు అపస్మారక స్థితిలోకి వెళ్లడం వంటి పలు అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకున్నాయి. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు మహ్మద్ అజరుద్దీన్ సహా మరో ఇద్దరిపై కేసు కూడా నమోదైంది.

ఆడింది ఒక్కటే..
ఉప్పల్ స్టేడియంలో ఇప్పటివరకు టీమిండియా ఆడింది ఒక్క టీ20 ఇంటర్నేషనల్ మ్యాచే. పరుగుల వరద పారిందా మ్యాచ్‌లో. అందులో విజయం సాధించింది. 2019లో భారత్-వెస్టిండీస్ మధ్య ఈ మ్యాచ్ జరిగింది. తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్.. నిర్దేశించిన 208 పరుగుల భారీ లక్ష్యాన్ని టీమిండియా ఆరు వికెట్ల నష్టంతో కొట్టి పడేసింది. విరాట్ కోహ్లీ 94, కేఎల్ రాహుల్ 62 పరుగులు చేశారా మ్యాచ్‌లో. భారత్ ఇన్నింగ్‌లో 27 సిక్సర్లు నమోదయ్యాయి.

పిచ్ ఎలా ఉంది..?
సాధారణంగా ఉప్పల్ స్టేడియానిది ఫ్లాట్ పిచ్. బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటుంది. ఇదే పిచ్‌పై టీ20లో 400లకు పైగా పరుగులు నమోదయ్యాయి. ఇప్పుడూ అలాంటి పిచ్‌నే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ తీర్చిదిద్దింది. మ్యాచ్ సాగుతున్న కొద్దీ స్పిన్నర్లకు పిచ్ సహకరించే అవకాశం ఉంది. ఫ్లాట్ పిచ్ పైగా సిరీస్ డిసైడర్ కావడం వల్ల మరోసారి ఉప్పల్ స్టేడియంలో పరుగుల సునామీ ఏర్పడే అవకాశాలు లేకపోలేదు.

వాతావరణం..
ఇవ్వాళ హైదరాబాద్‌లో వర్షం పడటానికి అవకాశాలు తక్కువే. పగటి ఉష్ణోగ్రత గరిష్ఠంగా 29 డిగ్రీల వరకు వెళ్తుంది. మ్యాచ్ ఆరంభం అయ్యే సమయానికి 24-25 డిగ్రీలుగా నమోదవుతుందనే అంచనాలు ఉన్నాయి. పగటిపూట ఎంత ఎండకాసినా సాయంత్రానికి ఉరుములు, మెరుపులతో వర్షం పడిన సందర్భాలు హైదరాబాద్‌లో చాలా ఉన్నాయి. దీన్ని బట్టి చూస్తే- ఈ మ్యాచ్‌కు వర్షం అడ్డుపడొచ్చనే వాదనలు లేకపోలేదు.

టాస్ కీలకం..
గాలిలో తేమ 80 శాతం వరకు రికార్డవ్వొచ్చు. ఇది రెండో ఇన్నింగ్‌లో ఫీల్డింగ్ చేసే జట్టుకు ముప్పు తెచ్చిపెట్టి పెడుతుంది. గాలితో తేమశాతం అధికంగా ఉండటం వల్ల బౌలర్లు బంతిపై గ్రిప్ కోల్పోవడం సహజం. బంతిని సరైన దిశలో సంధించలేరు. అనుకున్న చోట దాన్ని ల్యాండ్ చేయలేరు. లూజ్ బాల్స్ పడటానికే అవకాశాలు అధికంగా ఉంటాయి. అందుకే ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన జట్టు తొలుత ఫీల్డింగ్ ఎంచుకోవడానికే మొగ్గు చూపుతుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications