Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఏ బిడ్డ.. ఇది టీమిండియా అడ్డా: ఉప్పల్ స్టేడియం రికార్డ్స్ ఇవే..!!

IND vs AUS 3rd T20: Check out Hyderabads RGI stadium records here

హైదరాబాద్: భారత్-ఆస్ట్రేలియా మధ్య హైదరాబాద్ వేదికగా టీ20 సిరీస్‌ను తేల్చేసే మ్యాచ్ జరగబోతోంది. ఈ సాయంత్రం 7:30 గంటలకు మ్యాచ్ ఆరంభం కానుంది. దీనికి వేదిక- ఉప్పల్ స్టేడియం. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో ఇది చివరిది. సిరీస్ డిసైడర్ కూడా. ఇందులో గెలిచిన జట్టే సిరీస్ సొంతం చేసుకుంటుంది. అలాంటి కీలక మ్యాచ్‌కు హైదరాబాద్ ఆతిథ్యాన్ని ఇస్తోంది. హైదరాబాద్ ఫ్యాన్స్ ఓ హైఓల్టేజ్ మ్యాచ్‌ను చూడబోతోన్నారీ సాయంత్రం. వర్షం పడే ఛాన్స్ దాదాపుగా లేకపోవడంతో ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ ఖాయం.

ఆడింది ఒక్కటే..

ఆడింది ఒక్కటే..

ఉప్పల్ స్టేడియంలో ఇప్పటివరకు టీమిండియా ఆడింది ఒక్క టీ20 ఇంటర్నేషనల్ మ్యాచే. పరుగుల వరద పారిందా మ్యాచ్‌లో. విజయం టీమిండియాను వరించింది. 2019లో భారత్-వెస్టిండీస్ మధ్య ఈ మ్యాచ్ జరిగింది. తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ నిర్దేశించిన 208 పరుగుల భారీ లక్ష్యాన్ని టీమిండియా ఆరు వికెట్ల నష్టంతో కొట్టి పడేసింది. విరాట్ కోహ్లీ 94, కేఎల్ రాహుల్ 62 పరుగులు చేశారా మ్యాచ్‌లో. భారత్ ఇన్నింగ్‌లో 27 సిక్సర్లు నమోదయ్యాయి.

2004లో ఏర్పాటు..

2004లో ఏర్పాటు..

2004లో ఈ స్టేడియం అందుబాటులోకి వచ్చింది. అప్పటి నుంచి ఇప్పటివరకు రెండు టీ20 మ్యాచ్‌లకు మాత్రమే ఈ స్టేడియంలో షెడ్యూల్ అయ్యాయి. 2017 అక్టోబర్ 13వ తేదీన ఆస్ట్రేలియాతో టీమిండియా మ్యాచ్ ఇక్కడ జరగాల్సి ఉంది. భారీ వర్షం వల్ల మ్యాచ్ మొత్తం తుడిచిపెట్టుకు పోయింది..ఒక్క బంతి కూడా పడకుండానే. ఔట్ ఫీల్డ్ మొత్తం చిత్తడిగా మారడంతో మ్యాచ్‌ను రద్దు చేసింది హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్.

ఇది మూడోది..

ఆ తరువాత 2019లో డిసెంబర్ 6వ తేదీన వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ విజయాన్ని అందుకుంది. ఈ సాయంత్రం జరగాల్సిన మ్యాచ్ మూడోది. 2013లో జరిగిన టెస్ట్ మ్యాచ్ కూడా భారత్ వశమైంది. భారత్-ఆస్ట్రేలియా మధ్య అయిదు మ్యాచ్‌ల సిరీస్‌లో ఒక్కదానికి ఉప్పల్ స్టేడియం ఆతిథ్యాన్ని ఇచ్చింది. ఇన్నింగ్ 135 పరుగుల తేడాతో విజయఢంకా మోగించింది టీమిండియా. మొత్తానికి ఉప్పల్ స్టేడియంలో టీమిండియాకు మంచి ట్రాక్ రికార్డ్ ఉంది.

కోహ్లీ కింగ్..

కోహ్లీ కింగ్..

ఉప్పల్ స్టేడియంలో అత్యధిక పరుగులు చేసిన రికార్డ్ విరాట్ కోహ్లీ పేరు మీద ఉంది. వెస్టిండీస్‌పై జరిగిన టీ20 మ్యాచ్‌లో అతను 94 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఈ పిచ్‌పై బెస్ట్ బౌలింగ్ ఫిగర్‌ను రికార్డ్ చేశాడు యుజ్వేంద్ర చాహల్‌. తన నాలుగు ఓవర్ల కోటాలో 36 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు. అత్యధిక పరుగుల పార్ట్‌నర్‌షిప్‌లో కూడా కోహ్లీ హ్యాండ్ ఉంది. కేఎల్ రాహుల్‌తో కలిసి 100 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. మోస్ట్ సిక్సెస్, మోస్ట్ ఫోర్స్ కూడా కింగ్ కోహ్లీదే. ఆరుచొప్పున ఫోర్లు, సిక్సర్లు బాదాడు.

Story first published: Sunday, September 25, 2022, 8:53 [IST]
Other articles published on Sep 25, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+