For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

పెర్త్ టెస్టులో లియాన్ అరుదైన ఘనత: ట్విట్టర్‌లో GOAT అంటూ ప్రశంసల వర్షం

Ind vs Aus 2nd Test, Day 4: Twitterati hails Nathan Lyon as GOAT after he produces another masterclass

హైదరాబాద్: పెర్త్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టులో కీలక సమయంలో వికెట్లు తీసి భారత్ నడ్డి విరిచిన స్పిన్నర్ నాథన్ లియాన్‌పై సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది. భారత్‌తో జరుగుతున్న నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో నాథన్ లియాన్ అటు బంతితోనూ, ఇటు బ్యాట్‌తోనూ అద్భుత ప్రదర్శన చేస్తున్నాడు.

పెర్త్ టెస్టులో 287 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా ఓపెనర్ కేఎల్ రాహుల్, ఛటేశ్వర్ పుజారాలను ఆదిలోనే పేసర్లు పెవిలియన్‌కు చేర్చగా... క్రీజులో కుదురుకుని నిలకడగా ఆడుతోన్న కెప్టెన్ విరాట్ కోహ్లీ, ఓపెనర్ మురళీ విజయ్‌లను పెవిలియన్‌కు చేర్చి భారత్‌ను మరింత కష్టాల్లోకి నెట్టాడు.

నాలుగోరోజైన సోమవారం ఓవర్‌నైట్ స్కోరు 132/4తో రెండో ఇన్నింగ్స్‌ని కొనసాగించిన ఆస్ట్రేలియా జట్టు 243 పరుగులు చేసి ఆలౌటైంది. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో లభించిన 43 పరుగుల ఆధిక్యాన్ని కలుపుకుని మొత్తం 287 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. అనంతరం రెండో ఇన్నింగ్స్‌ని ప్రారంభించిన తొలి ఓవర్‌లోనే భారత్ వికెట్ కోల్పోయింది.

ఓపెనర్ కేఎల్ రాహుల్ మరోసారి చెత్త ప్రదర్శన చేశాడు. స్టార్క్ వేసిన తొలి ఓవర్ నాలుగో బంతికి కేఎల్ రాహుల్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో పరుగులేమీ చేయకుండానే రాహుల్ డకౌట్‌గా వెనుదిరిగాడు. ఆ తర్వాత కొద్ది సేపటికే పుజారా (4) కూడా హేజిల్‌వుడ్ బౌలింగ్‌లో వికెట్ కీపర్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.

ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన కెప్టెన్ విరాట్ కోహ్లీని నాథన్‌ లియాన్‌ బౌలింగ్‌ స్లిప్‌‌లో క్యాచ్‌ ఇచ్చి కెప్టెన్ కోహ్లీ పెవిలియన్‌ చేరాడు. ఆ తర్వాత కొద్ది సేపటికే నిలకడగా ఆడుతోన్న మురళీ విజయ్‌ని బౌల్డ్‌ చేసి భారత్‌ను మరింత కష్టాల్లోకి నెట్టాడు. కీలక సమయంలో నాథన్ లియాన్ రెండు వికెట్లు తీయడంతో ఆసీస్ రెండో టెస్టులో గెలుపుదిశగా సాగుతోంది.

ఈ సిరిస్‌లో ఇప్పటికే నాథన్ లియాన్ టెస్టుల్లో భారత జట్టుపై 7 సార్లు ఐదు వికెట్లను తీసిన అరుదైన ఘనత సాధించాడు. దీంతో పాటు నాథన్ లియాన్ పెర్త్ టెస్టులో అరుదైన రికార్డుని తన ఖాతాలో వేసుకున్నాడు. టెస్టుల్లో భారత జట్టుపై అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో నాథన్ లియాన్ నాలుగో స్థానంలో నిలిచాడు.

ఈ జాబితాలో జేమ్స్ ఆండర్సన్(110), ముత్తయ్య మురళీధరన్‌ (105), ఇమ్రాన్ ఖాన్(94), నాథన్ లియాన్ (77) ఉన్నారు. ఆస్ట్రేలియా మాజీ స్పిన్ దిగ్గజం షేన్ వార్న్ కూడా టెస్టుల్లో భారత జట్టుపై కేవలం ఒక్కసారి మాత్రమే ఐదు వికెట్లను తీయగా, తన సుదీర్ఘ క్రికెట్ కెరీర్‌లో మాజీ పేసర్ గ్లెన్ మెక్‌గ్రాత్ రెండు సార్లు మాత్రమే ఐదు వికెట్లను పడగొట్టాడు.

ఆస్ట్రేలియా తరుపున నాథన్ లియాన్ ఇప్పటివరకు 81 టెస్టు మ్యాచ్‌లాడి 326 వికెట్లు పడగొట్టాడు. నిజానికి పెర్త్ పిచ్ పేస్, బౌన్సింగ్‌కు అనూకలించేలా రూపొందించినప్పటికీ లయాన్ తనదైన శైలిలో విజృంభించడం విశేషం. లియాన్ తాజా ఘనతపై సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది.

Story first published: Monday, December 17, 2018, 18:16 [IST]
Other articles published on Dec 17, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+