For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఆసీస్‌పై మోత మోగించడానికి కారణం చెప్పిన రోహిత్ శర్మ: వెలిగిపోయిన హిట్‌మ్యాన్ ముఖం

IND vs AUS 2022 2nd T20I: I was quite surprised actually with the innings, says Rohit Sharma

ముంబై: మహారాష్ట్ర నాగ్‌పూర్‌లో జరిగిన రెండో టీ20 ఇంటర్నేషనల్‌లో భారత్ అద్భుత విజయాన్ని అందుకుంది. ఆరు వికెట్లు తేడాతో ఆస్ట్రేలియన్లను మట్టి కరిపించింది. వర్షం వల్ల ఆలస్యంగా ప్రారంభమైన ఈ మ్యాచ్‌.. భారత బ్యాటర్ల సత్తా చాటింది. ప్రత్యేకించి రోహిత్ శర్మ, దినేష్ కార్తీక్. అటు బౌలర్లు కూడా రాణించారు. ఎనిమిది ఓవర్లల్లోనే అయిదు వికెట్లు నేలకూల్చారు. ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఆర్డర్‌ను అస్థిరపరిచారు.

పిడుగుల్లాంటి షాట్లతో..

వర్షం వల్ల ఎనిమిది ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో.. రెండు ఇన్నింగుల్లోనూ పిడుగుల్లాంటి షాట్లు చూడగలిగారు ఫ్యాన్స్. తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా ఓవర్‌కు 11కు పైగా రన్‌రేట్‌తో స్కోర్ బోర్డ్‌ను ఉరకలు పెట్టించింది. ఎనిమిది ఓవర్లల్లో అయిదు వికెట్ల నష్టానికి 90 పరుగులు చేసింది. ఈ టార్గెట్‌ను టీమిండియా ఇంకా నాలుగు బంతులు మిగిలివుండగానే ఛేదించింది. ఓవర్‌కు 12కు పైగా పరుగులు సాధించింది.

బెస్ట్ ఫినిషర్‌గా..

బెస్ట్ ఫినిషర్‌గా..

చాన్నాళ్ల తరువాత కేప్టెన్ కమ్ ఓపెనర్ రోహిత్ శర్మ తనదైన శైలిలో ఆడాడు. భారీ షాట్లతో ఆసీస్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. 20 బంతుల్లో నాలుగు ఫోర్లు, నాలుగు సిక్సర్లతో దుమ్ము దులిపాడు. 46 పరుగులతో ఇన్నింగ్ చివరి వరకూ నిలిచాడు. మరో ఓపెనర్ కేఎల్ రాహుల్, వన్‌డౌన్ బ్యాటర్ విరాట్ కోహ్లీ, టీ20 స్పెషలిస్ట్ సూర్యకుమార్ యాదవ్, ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా నిరాశపరిచినప్పటికీ- దినేష్ కార్తీక్ మ్యాచ్‌ను ఫినిష్ చేశాడు. తాను బెస్ట్ ఫినిషర్‌నని మరోసారి నిరూపించుకున్నాడు. రెండే రెండు బంతుల్లో 10 పరుగుల బాదాడు.

ప్లాన్ చేసుకోలే..

పోస్ట్ మ్యాచ్ ప్రజంటేషన్‌లో రోహిత్ శర్మ ఫుల్ ఎనర్జిటిక్‌గా కనిపించాడు. తొలి మ్యాచ్‌లో ఘోరంగా ఓడిపోయిన తరువాత సాధించిన ఈ విజయం అతని ముఖంలో కొట్టొచ్చినట్టు కనిపించింది. టీమ్ పెర్ఫార్మెన్స్‌పై సంతృప్తి వ్యక్తం చేశాడు. ఇలా ఆడతామని ఊహించలేదని వ్యాఖ్యానించాడు. 8-9 నెలలుగా తాను ఇదే తరహాలో ఆడుతున్నానని, తన బ్యాటింగ్ శైలిలో పెద్దగా మార్పు కనిపించలేదని చెప్పాడు. దూకుడుగా ఆడాల్సి ఉంటుందని ముందుగా ప్లాన్ చేయలేమని, గ్రౌండ్ లెవెల్‌లో పరిస్థితులకు అనుగుణంగా ఇలా ఆడాల్సి రావొచ్చని చెప్పాడు.

మంచు వల్ల ఇబ్బందులు..

మంచు వల్ల ఇబ్బందులు..

బౌలింగ్‌పై అంచనాలు తప్పాయని రోహిత్ శర్మ చెప్పాడు. పిచ్‌ను ఉపయోగించుకున్నప్పటికీ.. మంచు వల్ల బౌలర్లు ఇబ్బంది పడ్డారని పేర్కొన్నాడు. చాలాకాలం పాటు జట్టుకు దూరంగా ఉంటూ వచ్చిన జస్‌ప్రీత్ బుమ్రా అందుబాటులోకి రావడం ఆనందాన్ని ఇస్తోందని, అతను మళ్లీ గాడిన పడుతున్నాడని చెప్పాడు. అక్షర్ పటేల్ తన రోల్‌ను తాను పోషించాడని, గేమ్ ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా అతను ఒత్తిళ్లకు గురి కాకుండా బౌలింగ్ చేయగలడని కితాబిచ్చాడు.

Story first published: Saturday, September 24, 2022, 7:12 [IST]
Other articles published on Sep 24, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+