For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

అందుకే అతను స్పెషల్: బెస్ట్ ఫినిషర్‌ అనిపించుకోవడానికి దినేష్ కార్తీక్ చెప్పిన కారణం ఇదే

IND vs AUS 2022 2nd T20I: I got two balls and tried my best there, says Dinesh Karthik

ముంబై: నాగ్‌పూర్‌లో ఆస్ట్రేలియాపై జరిగిన రెండో టీ20 ఇంటర్నేషనల్‌లో భారత్ అద్భుత విజయాన్ని అందుకుంది. ఆరు వికెట్లు తేడాతో ప్రత్యర్థిపై వార్ వన్‌సైడ్ చేసింది. వర్షం వల్ల ఆలస్యంగా ప్రారంభమైన ఈ మ్యాచ్‌‌లో భారత్ చెలరేగింది. తొలుత బౌలింగ్, ఆ తరువాత బ్యాటింగ్‌లో సత్తా చాటింది. రోహిత్ శర్మ రెచ్చిపోయాడు. ఆసీస్ బౌలర్ల భరతం పట్టారు. భారీ షాట్లతో విరుచుకుపడ్డారు. చివర్లో దినేష్ కార్తీక్ తనదైన శైలిలో ఆడాడు.

 దూకుడుగా..

దూకుడుగా..

తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా ఓవర్‌ ఎనిమిది ఓవర్లల్లో అయిదు వికెట్ల నష్టానికి 90 పరుగులు చేసింది. ఓపెనర్ కమ్ కేప్టెన్ ఆరోన్ ఫించ్ 15 బంతుల్లో 31 పరుగులు చేశాడు. ఇందులో ఒక సిక్సర్, నాలుగు ఫోర్లు ఉన్నాయి. మిడిలార్డర్ బ్యాటర్ మాథ్యూ వేడ్ 20 బంతుల్లో మూడు సిక్సర్లు, నాలుగు ఫోర్లతో 43 పరుగులు చేశాడు. ఈ టార్గెట్‌ను టీమిండియా ఇంకా నాలుగు బంతులు మిగిలివుండగానే ఛేదించింది. రోహిత్ శర్మ 20 బంతుల్లో నాలుగు ఫోర్లు, నాలుగు సిక్సర్లతో 46 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.

ఫినిషింగ్‌పై ఫోకస్ పెట్టా..

ఈ మ్యాచ్‌లో విన్నింగ్ షాట్ దినేష్ కార్తీక్‌దే. మరోసారి బెస్ట్ ఫినిషర్ అనిపించుకున్నాడు. రెండే రెండు బంతులను ఎదుర్కొన్న డీకే- 10 పరుగులు పిండుకున్నాడు. మ్యాచ్ ముగిసిన అనంతరం నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో దినేష్ కార్తీక్ మాట్లాడాడు. బెస్ట్ ఫినిషింగ్ ఇవ్వాలనే ఉద్దేశంతో తాను చాలాకాలంగా ప్రాక్టీస్ చేస్తోన్నానని చెప్పాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో పాటు ఇంటర్నేషనల్స్‌లోనూ ఫినిషింగ్ చేయడం సంతోషంగా ఉందని వ్యాఖ్యానించాడు.

కొత్త బంతిని

విక్రమ్ రాథోడ్, రాహుల్ ద్రవిడ్ పర్యవేక్షణలో తన ప్రాక్టీస్ సాగుతోందని, ఏ షాట్‌లు ప్రాక్టీస్ చేయాలనుకుంటున్నానో దాని టెక్నిక్ గురించి తెలుసుకుంటున్నానని చెప్పాడు. నాగ్‌పూర్ మ్యాచ్‌లో రోహిత్ శర్మ అద్భుతంగా ఆడాడని కితాబిచ్చాడు. వీలైనంత త్వరగా మ్యాచ్ ముగించాలని భావించానని, దాని కోసం తన వంతు ప్రయత్నం చేశానని చెప్పుకొచ్చాడు. టాప్ క్లాస్ బౌలర్లు.. కొత్త బంతిని ఎదుర్కొనే సమయంలో ఇలాంటి షాట్లు ఆడటం అంత సులభం కాదని, అదే రోహిత్ స్థాయిని పెంచిందని చెప్పాడు.

రోహిత్.. అందుకే స్పెషల్..

రోహిత్.. అందుకే స్పెషల్..

ఫాస్ట్ బౌలింగ్‌‌లో కొత్తబంతిని ఎదుర్కొనడంలో రోహిత్ శర్మకు ఉన్న శక్తిసామర్థ్యాలు మరెవరికీ లేవని పేర్కొన్నాడు దినేష్ కార్తీక్. మొదటి టీ20లో తన కంటే ముందు అక్షర్ పటేల్‌ను బ్యాటింగ్‌కు దింపడంపై దినేష్ కార్తీక్ స్పందించాడు. అది మేనేజ్‌మెంట్ నిర్ణయమని, అక్షర్ ఎక్కువ ఓవర్లను ఎదుర్కోవాలనే ఉద్దేశం కావొచ్చని అన్నాడు. అక్షర్ పటేల్ స్పిన్నర్లను టార్గెట్ చేయగలడని, లెగ్ స్పిన్నర్ బౌలింగ్ చేస్తున్నప్పుడు ఎడమచేతి వాటం ఆటగాడు ఉండటం మంచిదని పేర్కొన్నాడు.

ఆ ముగ్గురిపై..

ఆ ముగ్గురిపై..

హార్దిక్ పాండ్యా వంటి ప్రపంచ స్థాయి ఆల్ రౌండర్‌ను ఉండటం టీమిండియాకు అదనపు బలమని దినేష్ కార్తీక్ అన్నాడు. పాండ్యా అనేక మ్యాచ్‌లల్లో జట్టును గెలిపించాడని చెప్పాడు. అక్షర్ పటేల్ కూడా బ్యాటింగ్‌లో రాణించడం జట్టుకు ఉపయోగపడుతుందని, అది బ్యాటింగ్ ఆర్డర్ బ్యాలెన్స్‌ అవుతుందని అన్నాడు. రిషబ్ పంత్ క్వాలిటీ గురించి అందరికీ తెలిసిందేనని, నాగ్‌పూర్ మ్యాచ్‌లో బ్యాటింగ్ చేయలేకపోయినప్పటికీ.. ఎప్పుడూ గొప్ప బ్యాటరేనని చెప్పాడు.

Story first published: Saturday, September 24, 2022, 8:10 [IST]
Other articles published on Sep 24, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+