భారత్‌ను ఢీ కొట్టే ఆసీస్ జట్టు ఇదే: కొత్త ముఖానికి బెర్త్: ఐపీఎల్ స్టార్లకూ చోటు: రంజుగా

మెల్‌బోర్న్: ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు యుద్ధానికి సన్నద్ధమైంది. భారత్‌ను ఢీ కొట్టే జట్టును ప్రకటించింది. ఈ మేరకు కొద్దిసేపటి కిందటే ఓ ప్రకటన విడుదల చేసింది. తమ దేశ పర్యటనకు వచ్చే టీమిండియాతో తలపడే జాతీయ జట్టు క్రికెటర్ల పేర్లను వెల్లడించింది.

జట్టును దాదాపు యువ క్రికెటర్లతో నింపేసినట్టు కనిపిస్తోంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్-2020 స్టార్ క్రికెటర్లకు చోటు కల్పించింది. ఓ కొత్త ముఖానికీ జట్టులో బెర్త్ కన్‌ఫర్మ్ చేసింది. వన్డే ఇంటర్నేషనల్, టీ20 మ్యాచ్‌లకు మాత్రమే జట్టు వివరాలను తెలియజేసిన క్రికెట్ ఆస్ట్రేలియా.. టెస్ట్ ఫార్మట్‌లో ఆడే క్రికెటర్ల పేర్లను ఇంకా వెల్లడించాల్సి ఉంది.

హీటెక్కుతోన్న ఐపీఎల్: ఆల్‌రౌండర్ల ఫేస్ టు ఫేస్: సిక్స్ కొట్టి..రెచ్చగొట్టి: ఆ వెంటనే అవుట్

ఆరోన్ ఫించ్ సారథ్యంలో..

వన్డే ఇంటర్నేషనల్స్, టీ20 మ్యాచ్‌లల్లో ఆడే ఆస్ట్రేలియా జట్టుకు ఆరోన్ ఫించ్ నాయకత్వాన్ని వహిస్తాడు. అతని కేప్టెన్సీలో ఆసీస్.. టీమిండియాను ఢీ కొట్టబోతోంది. కోహ్లీసేనతో తలపడబోతోంది. ఐపీఎల్-2020లో ఆడుతోన్న తమ దేశ క్రికెటర్లలో కొందరిని జాతీయ జట్టులోకి తీసుకుంది. సన్ రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ జట్ల కేప్టెన్లు డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్‌లను టీమ్‌లోకి తీసుకుంది. అలాగే- కోల్‌కత నైట్ రైడర్స్ తరఫున ఆడుతోన్న బౌలింగ్ స్పీడ్‌స్టర్ పాట్ కమ్మిన్స్‌ను టీమ్‌లో ఇంక్లూడ్ చేసింది. జట్టుకు అతనే వైస్ కేప్టెన్. అలెక్స్ క్యారీ, హేజిల్‌వుడ్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, మార్కస్ స్టోయినిస్, ఆడమ్ జంపాలను వన్డే, టీ20ల్లోకి తీసుకుంది. వారంతా ప్రస్తుతం ఐపీఎల్‌లో ఆడుతున్నారు.

ఆల్‌రౌండర్‌కు నో బెర్త్..

మరో ఆల్ రౌండర్ మిఛెల్ మార్ష్‌ను జట్టులోకి తీసుకోలేదు ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు. అతను గాయపడటమే దీనికి కారణం. ఐపీఎల్-2020లో సన్ రైజర్స్‌ హైదరాబాద్ తరఫున ఆడాల్సి ఉన్న మిఛెల్ మార్ష్.. టోర్నమెంట్‌ ఆరంభానికి ముందు గాయం కారణంగా దూరమైన విషయం తెలిసిందే. మడమ గాయంతో అతను బాధపడుతున్నాడు. ఐపీఎల్-2020 టోర్నమెంట్ మొత్తానికీ దూరం అయ్యాడు. అదే గాయం కారణంగా.. జాతీయ జట్టులోనూ అతని చోటు దక్కలేదు. మార్ష్ పేరును పరిశీలనలోకి తీసుకున్నామని, అతను తమకు విలువైన ఆటగాడని క్రికెట్ ఆస్ట్రేలియా బోర్డు వెల్లడించింది. గాయం నుంచి అతను ఇంకా కోలుకోవాల్సి ఉందని పేర్కొంది.

కొత్త ముఖానికి చోటు..

కొత్త ముఖానికి చోటు..

జాతీయ జట్టులో కొత్త ఆటగాడికి అవకాశాన్ని కల్పించింది ఆసీస్ బోర్డు. కొత్త ముఖం కామెరూన్ గ్రీన్‌ను టీమ్‌లోకి తీసుకుంది. భారత్‌తో సిరీస్‌ సందర్భంగా అతను అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేయబోతున్నాడు. 21 సంవత్సరాల కామెరూన్ వెస్టర్న్ ఆస్ట్రేలియా టీమ్ క్రికెటర్..ఆల్‌రౌండర్. ఇప్పటిదాకా తొమ్మిది డొమెస్టిక్ వన్డే మ్యాచ్‌లను ఆడాడు. పెర్త్ స్కార్చర్స్ తరఫున 13 టీ20 మ్యాచ్‌లను ఆడాడు. షెఫ్పీల్డ్ షీల్డ్ సీజన్‌లో నిలకడగా రాణిస్తున్నాడు. బౌలర్‌గా 21 ఆడిన తొలి ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లోనే అయిదు వికెట్లను పడగొట్టాడు.

సీనియర్లకు నో ఛాన్స్..

సీనియర్లకు నో ఛాన్స్..

ఈ సారి జాతీయ జట్టులో సీనియర్లను తీసుకోలేదు. నాథన్ లియాన్, ఆండ్రూ టైలకు చోటు దక్కలేదు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున ఆడుతోన్న జోష్ ఫిలిప్‌ను జట్టులో బెర్త్ దక్కలేదు. అదే సమయంలో జాతీయ జట్టులో స్థానం దక్కించుకోలేకపోతోన్న న్యూ సౌత్ వేల్స్ ఆల్‌రౌండర్ మోజెస్ హెన్రిక్‌కు పిలుపు ఇచ్చింది. ఆల్‌రౌండర్ కేటగిరీలో అతణ్ని తీసుకుంది. చివరిసారిగా హెన్రిక్ 2017లో జాతీయ జట్టులో ఆడాడు. మళ్లీ అతను క్రికెట్ ఆస్ట్రేలియాకు ఎంపికక కావడం ఇదే తొలిసారి. గాయపడ్డ మిఛెల్ మార్ష్ స్థానంలో అతణ్ని తీసుకుంది.

వన్డే, టీ20లకు ఒకే జట్టు..

వన్డే, టీ20లకు ఒకే జట్టు..

వన్డే, టీ20ల కోసం ఒకే జట్టు ఆడనుంది. ఆరోన్ ఫించ్ కేప్టెన్సీలో భారత్‌లో తలపడబోతోన్న ఆసీస్ జట్టులో సీన్ అబాట్, అష్టన్ అగర్, అలెక్స్ క్యారీ, కామెరూన్ గ్రీన్, జోష్ హేజిల్‌వుడ్, మోజెస్ హెన్రిక్స్, మామస్ లాబుస్‌ఛాన్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, డేనియల్ సామ్స్, కేన్ రిచర్డ్‌సన్, స్టీవ్ స్మిత్, మిఛెల్ స్టార్క్, మార్కస్ స్టోయినిస్, మాథ్యూ వేడ్, డేవిడ్ వార్నర్, ఆడమ్ జంపా.

For Quick Alerts
Subscribe Now
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
 
Story first published: Thursday, October 29, 2020, 10:55 [IST]
Other articles published on Oct 29, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X