నేను అవుట్ అయ్యానా!!.. అయోమయంలో ఫించ్(వీడియో)

న్యూఢిల్లీ: భారత్, ఆస్ట్రేలియా మధ్య అడిలైడ్ వేదికగా జరుగుతోన్న తొలి టెస్టు మ్యాచ్‌లో ఆదివారం ఆసక్తికరమైన ఘటన చోటు చేసుకుంది. నాలుగో రోజు రెండో సెషన్‌లో భారత్ జట్టు 307 పరుగులకి ఆలౌటైంది. భారత బౌలర్ల పనితనానికి ఆసీస్ నాలుగు వికెట్లు కోల్పోయింది. దానికంటే ముందు తొలి ఓవర్లోనే ఆస్ట్రేలియా వికెట్ కోల్పోయేది.. కానీ, ఇషాంత్ శర్మ తప్పిదం కారణంగా ఆ వికెట్ చేజారింది. ఆ తర్వాత కొద్దిసేపటికే అనూహ్యంగా అశ్విన్ చేతికి చిక్కించుకుని ఫించ్ వికెట్ పడగొట్టాడు.
ఆరోన్ ఫించ్ ఎల్బీడబ్ల్యూగా దొరికి
ఇషాంత్ శర్మ వేసిన ఇన్నింగ్స్ తొలి ఓవర్ రెండో బంతికే వికెట్ల ముందు ఆస్ట్రేలియా ఓపెనర్ ఆరోన్ ఫించ్ ఎల్బీడబ్ల్యూగా దొరికిపోయాడు. కానీ.. అతను అంపైర్ ఔట్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ డీఆర్‌ఎస్‌కి వెళ్లగా.. ఇషాంత్ శర్మ క్రీజు వెలుపల కాలు పెట్టి బంతి (నోబాల్) విసిరినట్లు రిప్లైలో తేలింది. దీంతో.. అతను నాటౌట్ అని అంపైర్ ప్రకటించాడు. ఇక్కడ గమనించదగ్గ మరో విషయమేమిటంటే తొలి ఇన్నింగ్స్‌లోనూ తొలి ఓవర్ మూడో బంతికే ఇషాంత్ శర్మ బౌలింగ్‌లో ఫించ్ క్లీన్‌బౌల్డయ్యాడు.
అశ్విన్ బంతిని డిఫెన్స్ చేసేందుకు
రెండో ఇన్నింగ్స్ ఆసీస్ బ్యాటింగ్ చేస్తోన్న 11వ ఓవర్‌లో అశ్విన్ బంతిని డిఫెన్స్ చేసేందుకు ఆరోన్ ఫించ్ విశ్వప్రయత్నం చేశాడు. కానీ.. బంతి అతని బ్యాట్‌కి తాకకుండా.. నేరుగా ఫ్యాడ్స్‌ని తాకి గాల్లోకి లేచింది. అంతే.. వికెట్ కీపర్ రిషబ్ పంత్.. సులువుగా క్యాచ్ అందుకుని ఔట్ కోసం అప్పీల్ చేశాడు. వెంటనే అంపైర్ వేలెత్తేశాడు. ఈ ఔట్ నిర్ణయంపై అసంతృప్తితో డీఆర్‌ఎస్‌కి వెళ్లాలని యోచించి.. నాన్‌స్ట్రైక్ ఎండ్‌లో ఉన్న మరో ఓపెనర్ హారిస్ సలహా తీసుకున్నాడు ఫించ్.

విజయానికి ఇంకా 219 పరుగులు
కానీ.. మళ్లీ ఆలోచించి లాభం లేదనుకుని.. డీఆర్‌ఎస్ అడగకుండానే పెవిలియన్ వైపు నడించాడు. రిప్లైలో బంతి బ్యాట్‌కి తాకలేదని తేలింది. ఈ మ్యాచ్‌లో ఆదివారం ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా 104/4తో నిలవగా.. ఆ జట్టు విజయానికి ఇంకా 219 పరుగులు చేయాల్సి ఉంది. ఆఖరిరోజైన సోమవారం 6 వికెట్లతో మాత్రమే ఆస్ట్రేలియా పోరాడనుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications