India vs Australia: భారత్, ఆస్ట్రేలియా మధ్య జరగాల్సిన ఐదు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లో తొలి పోరు వరుణుడి కారణంగా రద్దైంది. కాన్‌బెర్రాలోని మనుకా ఓవల్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో వర్షం పదేపదే అంతరాయం కలిగించడంతో, చివరకు మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు.
భారత్ స్కోరు 97/1
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా ఓపెనర్ శుభ్‌మన్ గిల్, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (SKY) మెరుపు షాట్లతో చెలరేగిపోయారు. కేవలం 9.4 ఓవర్లలోనే భారత్ 1 వికెట్ నష్టానికి 97 పరుగుల భారీ స్కోరు చేసింది. సూర్యకుమార్ యాదవ్, శుభ్‌మన్ గిల్ తొలి వర్ష విరామం తర్వాత గేర్ మార్చి, దూకుడుగా ఆడటం ప్రారంభించారు. వారిద్దరూ కలిసి ఆసీస్ బౌలర్లను లక్ష్యంగా చేసుకుని బౌండరీలు, సిక్సర్లతో విరుచుకుపడ్డారు.

అయితే భారత ఇన్నింగ్స్ 9.4 ఓవర్ల వద్ద ఉండగా మళ్లీ భారీ వర్షం మొదలైంది. ఎంతకీ వర్షం తగ్గకపోవడం, మైదానం చిత్తడిగా మారడంతో, తదుపరి ఆట నిర్వహించడం సాధ్యం కాదని నిర్వాహకులు నిర్ణయించారు. ఈ మ్యాచ్ రద్దు కావడంతో ఇరు జట్లకు చెరో పాయింట్ లభించింది. యువ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలో దూకుడుగా ఆడిన భారత యువ బ్యాటర్ల మెరుపు ఇన్నింగ్స్‌ను పూర్తి మ్యాచ్‌లో చూడలేకపోవడం అభిమానులకు నిరాశ కలిగించింది.
కాన్‌బెర్రాలో జరిగిన మొదటి టీ20 మ్యాచ్‌లో ఆస్ట్రేలియా కెప్టెన్ మిచెల్ మార్ష్ టాస్ గెలిచి ముందుగా ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఈ నిర్ణయం ద్వారా అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌ల్లో టాస్ గెలిచిన 18 సందర్భాలలో మార్ష్ ఫీల్డింగ్ ఎంచుకోవడం ఒక ప్రత్యేక రికార్డుగా నమోదైంది. కానీ ఈ మ్యాచ్ వర్షార్పణం అయింది.